కొలకలూరి స్వరూపరాణి (Kolakaluri Swaruparani)

Share
పేరు (ఆంగ్లం)Kolakaluri Swaruparani
పేరు (తెలుగు)కొలకలూరి స్వరూపరాణి
కలం పేరు
తల్లిపేరుమంగాదేవి
తండ్రి పేరుఎన్.వి. రత్నం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ5/1/1943
మరణం
పుట్టిన ఊరుతెనాలి తా. గుంటూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తిఉపాధ్యాయిని
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొలకలూరి స్వరూపరాణి
సంగ్రహ నమూనా రచననేటి తెలుగు సాహిత్యంలో నవలలు వ్రాస్తున్న నవలా మణులే ఎక్కువ. నేడు ఆ నవలల కున్న నిలువ, స్థానము మరే సాహిత్య ప్ర్రక్రియకులేదు. నేటి మన పాఠకలోకం నవలా రచయిత్రులకే పెద్దపీఠం వేసింది. రచయిత్రులు కూడ ఈమధ్య వంటిల్లు విడిచి విశాల ప్రపంచం మనకంటూ కటుందని ఎంచి అనేక విషయాలను తమ నవలల్లో చొప్పిస్తున్నారు. సస్పెన్సు, థ్రిల్లింగ్, కిల్లింగ్, హారర్, టెరర్ మఱియు వైజ్ఞానిక, సామాజిక నవలలను కూడ చకచకా వ్రాస్తున్నారు.

కొలకలూరి స్వరూపరాణి

నేటి తెలుగు సాహిత్యంలో నవలలు వ్రాస్తున్న నవలా మణులే ఎక్కువ. నేడు ఆ నవలల కున్న నిలువ, స్థానము మరే సాహిత్య ప్ర్రక్రియకులేదు. నేటి మన పాఠకలోకం నవలా రచయిత్రులకే పెద్దపీఠం వేసింది. రచయిత్రులు కూడ ఈమధ్య వంటిల్లు విడిచి విశాల ప్రపంచం మనకంటూ కటుందని ఎంచి అనేక విషయాలను తమ నవలల్లో చొప్పిస్తున్నారు. సస్పెన్సు, థ్రిల్లింగ్, కిల్లింగ్, హారర్, టెరర్ మఱియు వైజ్ఞానిక, సామాజిక నవలలను కూడ చకచకా వ్రాస్తున్నారు. పత్రికలు కూడ వాటిని అతివేగంగా పాఠకుల ముందుంచుతున్నాయి. ఇప్పటి తెలుగు రచయితల సంఖ్యలో అధిక శాతం స్త్రీలదే. ఇంతమంది రచయిత్రులున్నా పై సాహిత్య ప్రక్రియ కాక అన్యమైన వాటిలో కృషిచేసి మంచిపేరు తెచ్చుకొన్నవారు అరుదు. కవియిత్రి అనే సార్థకనామం కొందరికే దక్కింది. వారు కూడ వేళ్ళపై లెక్క పెట్టవలసినవారే. చక్కటి పద్యములు, కవితలు వ్రాయగలిగిన నేర్పు ఏ కొందరు రచయిత్రులకో అబ్బింది. అలాంటి ఓ రచయిత్రి హిందూపురం పంచాయితీ సమితిలో ఉపాధ్యాయవృత్తిని చేపట్టి వుండటం గర్వకారణం. ఆమె శ్రీమతి కొలకలూరి స్వరూపరాణి. అసంఖ్యాక పద్య, గద్య, గేయ వచన విమర్శనాత్మక రచనలను, వాటికితోడుగా నేటి పాఠకలోకం మెచ్చేకథలు, నవలలు కూడ రచించి వాసికెక్కి పేరు సంపాదించుకుంది.
ఈ కవయిత్రి రచించిన ‘‘గంగావతరణ-శివతాండవము’’, ‘‘చంద్రగ్రహణము’’ అను రెండు పద్యకావ్యములను చదివినప్పుడు వీరి ప్రజ్ఞకు, కవితాశక్తికి, భావస్ఫురణకు అచ్చెరువొందని వారు లేరు. విద్వన్మణి – శ్రీ కఱ్ఱా వేంకట సుబ్రహ్మణ్యం ఎం.ఏ. గారొకసారి ఈమె వ్రాసిన శివతాండవ కావ్యమును చూచి ముగ్ధుడై ఏదో అనిర్వచనమైన శక్తి ఈమెలో ఆవహించి ఉందని అది వాగ్దేవతా కటాక్షమై యుండునని భావించిరి. ఈ నిర్ణయము వారి దొక్కరిదే కాదు. ఈమె గ్రంథములు జదివిన ప్రతి యొక్కరికి కూడా అదే అభిప్రాయమే కలదు. ఆమె తన కవిత్వమును గూర్చి ఇట్లు వ్రాసుకొన్నది.
కం. స్వతహాగా, ఒనగూడిన
నితాంత సాహిత్య గంధ నిర్మల కవితా
లతాంత వేనిని, సార
స్వంత ప్రాణి స్వరూపరాణి, సవినయ వాణిన్
ఇంకనూ ఈ కవియిత్రి స్వవిషయమును ప్రస్తావించుచూ తన శయమును గూర్చి యిట్లు వ్రాసుకొన్నది.
లేదు విశేష ప్రజ్ఞలవలేశము, సారవచో విధానమున్
లేదు, కవిత్వ ప్రౌఢిమయు లేదిక, యున్నది హృచ్ఛతఘ్ని నా
వేదనగంధకాప్తి యనువిద్ధ సముద్ధతి బ్రేలి లోక ని
ర్వేద మహీధరాశ్మతతి భిన్న మొనర్చిన చాలు మత్కృతుల్.
వీరి ‘‘గంగావతరణ – శివతాండవము’’ ఒక దివపద కావ్యము. ఇందు నూరు ద్విపదులు కలవు. ‘‘ఇందలి రచన దీర్ఘదీర్ఘములైన సంస్కృత సమాసములతో నిండియున్నది. అందందు ముచ్చటగా కూర్చిన చిన్న చిన్న సమానములు కూడ కలవు. ఇందలి సమాసముల కూర్పు చాల పరిణతమైనది. ఎంతో అఛ్యాసముండినగాని రచనలో ఇంతటి పరిణతి సంపాదించుట తేలిక గాదు. రచనలోనేకాదు భావ గంభీరతలో ఈమె పటిమ గల కవయిత్రి.’’
నిజమైన ఆధ్యాత్మిక చింతన, సామాజిక స్పృహలకు వ్యతిరేకము కాదని కవయిత్రి భావించి, ఆమె తన శివతాండవ కావ్యనాయకుడైన శివుని సమాజ వికాస నాయకునిగా లెక్కించి, ఆతని సుహృద్భావ మెంతటిదో సవిస్తరంగా వివరించింది. ఈమె శివుని స్త్రీ జనోద్ధారకుడుగా, స్త్రీకి సమాన ప్రతిపత్తినొసగిన ఔదార్యడుగా, ఇరువురు భార్యలకు తన్ను తాను ఆత్మార్పణ గావించుకొన్నవానిగా, ఆదర్శమూర్తిగా, గిరి తనయను వివాహమాడి బలహీనవర్గాలు అనగా గిరిజనుల సంక్షేమానికి నాంది పలికినవాడుగా, శ్రీహరి పాదమందు బుట్టిన శూద్రబాలికయగు, (హరిజన) గంగమ్మను స్వీకరించి అస్పృశ్యతను నివారించిన ప్రథమ అభ్యదయవాదిగా ఆమె భావించినది. అట్టి సభ్యసంస్కారాలకు దర్పణము పట్టిన శ్రమజీవి చుట్టూ అల్లిన కవితలో సామాజిక స్పృహ లేదనడం వట్టి మూర్ఖత్వమే అవుతుంది. ఈ దృష్టితో కవియత్రి తన హృదయ పీఠికపై శివుడు సలిపిన కాండవమునకు కవితా స్వరూపమిచ్చింది. ఆ భావననే పాఠకులు కలిగించుకొన్నప్పుడు ఇందలి విషయం మరింత అర్థస్ఫూర్తిని కలిగిస్తుంది. వీరి శివతాండవ రచన యిట్లు సాగినది.
కనకకిరీట ప్రకట నవరత్న – గణఘంటికావళి గణగణలాడ
షణ్ముఖగజముఖ చకిత సామీప్య – సన్మానమున సమక్షంబురంజిల్ల
నందీశ భృంగీశ న్రమానటాయభి – నందనోపశృతి నయగారమొలుక
అమరేందుబింబాననా బాహువల్ల రీముక్త సురపుష్పరింఛోళిగురియ

శారికాకోటులై సందడిచేయ ఈరేడు లోకాల ఏలికపూన్కి
ధారుణి గంగావతరణ శ్రీనెసగ గౌరీప్రియుండు గంగాధర నామ
బద్ధ ప్రసిద్ధికాస్పదుడయి వెలయ ఇద్ధ జలక్రీడ నేపుమీరంగ
విహరించి విహరించి విరమించిదరిని రహిమించు రాజమరాళంబు రీతి.

గురు, జటాజూటానుకూల, కూలముల సురకూలవతి విభాసురలీల నురికె
తదుపరి వీరి చంద్రగ్రహణ కావ్యము సమకాలీనతకు, సముజ్జ్వల భవిష్యత్తునకు నవ్యభావనలకు దర్పణము. భూగోళమునకు, ఖగోళమునకు వారధి నిర్మింపజేయడం ఈ కావ్య మందలి కథావస్తువు. ‘‘ఆర్యభట్ట’’ ఉపగ్రహాన్ని, 1975 లో భారత ప్రభుత్వం, ప్రప్రథమంగా అంతరిక్ష్లోనికి ప్రయోగించింద. దేశం సాధించిన వైజ్ఞానిక ప్రగతి కవయిత్రి హృదయాన్ని కుదిపివేసింది. భూమిచుట్టూ ‘‘ఆర్యభట్ట’’ పరిభ్రదమిస్తున్నది. చంద్రుడుకూడ అదే కక్ష్యలోనే భూమిచుట్టూ తిరుగుతున్నాడు. ఒకవేళ ‘‘ఆర్యభట్టకు’’ చంద్రుడు తటస్థపడితే వాళ్ల మధ్య జరిగే సంభాషణ ఎలా వుంటుంది? ఏయే అంశాలపై చర్చించుకొంటారు? అన్నదే ఈ కవయిత్రి ఊహ. ఆ ఊహా జగత్తుకు జరిగిన అంకురార్పణే ‘‘చంద్రగ్రహణ’’ కావ్యంగా వెలుగుచూసింది. ఈ రసమయ ఊహా చిరతణలో కవయిత్రి ‘‘చంద్రుణ్ణి’’ స్త్రీగా మార్చింది. అతనికి స్త్రీ పాత్రను కేటాయించింది. ఆ చంద్రమ్మ, తనకు పట్టిన గ్రహణాన్ని గూర్చి ఆర్యభట్టునకు మొరపెట్టుకొంటుంది. తననీ అవస్థనుండి తప్పింపుమని కోరుతుంది. అట్లే ఆవిడ (చంద్రమ్మ) తాను గమనిస్తన్న మానవ సమాజంలోని సమస్యలకు పరిష్కారమార్గం సూచిస్తుంది. నూత్న విజ్ఞాన విశేషాంశాలను గూర్చి ముచ్చటిస్తుంది. ఈ మూడు విశేషాల – త్రివేణీ సంగమమే ‘‘చంద్ర గ్రహణ’’ కావ్యము.
ఇదొక నవ్య కవితాప్రక్రియ. ఇట్టి కావ్యము ఆంధ్ర సాహిత్య చరిత్రలో అరుదు. నవ్యకవితా సంపుటాలలో భావాలు తొంగి చూడవలెనేగాని, ఛందస్సుకాదు. భావాన్ని బంధించే శక్తి ఛందస్సునకు లేదు. అందుకే ఈ కవయిత్రి కొన్ని వర్ణనలను అత్యాధునిక భావాలతో వర్నించింది. ఇది తప్పేమీకాదు. భావాలకు సంకెళ్ళు వేయడంగాని, యిట్టి వర్ణనలే సాంప్రదాయములు. సమంజసములని ఎక్కడా నిర్ణయింపబడడంగాని జరుగలేదు. సమాజపరంగా అల్లిన భావాలు సహజ సుందరంగా వుంటాయి. ఆ వర్ణనలు కొంతవరకు సమాజాన్ని ప్రగతి పథంలోకి పయనింపజేయగలవు. ఆ భావనతోనే, స్వరూపరాణిగారు వర్ణనలు గావించిరి.
సూర్తాస్తమయ వర్ణనకు చెప్పిన ఉపమాన మొకటి చూచిన చాలును, అది నేటి సమాజంలోని కొంతమంది వ్యక్తులపై ఎలా కొరడా ఝళిపించిందో విదితం కాగలదు.
మనువున కట్నమెల్ల తన మామ యొకేపరి క్రక్కడంచు, లా
ళి, నవల వైచియున్ విడచి లేజెలువన్ తరిలో చివాలునన్
జను, వరుడో యనంగ మలుసంజ ముహూర్తములోన, పద్మకాం
తను, నడియేటిలో వదలి తా నరిగెన్ రవి పశిచమాళకున్.
ఇట్టి మనోజ్ఒ భావయుక్తములగు పద్యములే గాదు, సుదీర్ఘ, సమాస భూయిష్ఠ, క్లిష్టతర పద్యములతో బాటు, ప్రాచీన ప్రబంధశైలి నేమరక అటనట వ్రాసిన రమ్యములగు పద్యసుమములను కూడ ఈ నవ్య కవితాకన్యక తన సిగలో నలంకరించుకొన్నది. ఇందు కవయిత్రి తన మనోభావముల నన్నింటిని వివిధ శీర్షికలుగా విభజించి తానే ఆర్యభట్టుకు (లోకానికి) వినిపించుకొన్నట్ల నిగూఢ భావనతో తెల్పినది. అందుకే ఆమె ఇందులో చంద్రమూర్తిని స్త్రీమూర్తిగా చిత్రీకరించింది. తుదకామె (చంద్రమ్మ) ఇట్లనుచున్నది.
నవలాజాతి యెడల తగు
అవగాహన కుదిరెనేని హక్కులు చట్టాల్
సవరించినంత పుణ్యము,
తెవు తెరుగని మందు లార్చి తీర్చునె రుజలన్?
పై రెండు కావ్యముల తరువాత స్వరూపరాని గారు ‘‘ప్రబోధం’’ అను ఒక గేయ సంపుటిని, ‘‘నన్నయమహిళ’’ అనబడు పరిశీలనా గ్రంథమును వ్రాసిరి. ఈ పరిశీలన గ్రంథములో ఈమె అనాదిగా స్త్రీకి స్వాతంత్ర్యము లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తపరుస్తూ అనేక ఉదాహరణలను మహాభారతంలోని నన్నయభాగం నుండి గ్రహించింది. ఆమె అభిప్రాయాన్ని ఈ గ్రంథములో యిలా వ్యక్తపరిచింది.
‘‘పుట్టింటి హక్కులను రద్దుచేస్తూ, ఇటు భర్తకు భార్యపై సంపూర్ణాధికారాన్ని కట్టబెడుతూ, స్త్రీని రిక్తహస్తురాలిగా పడగొట్టుతుంది వివాహవ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థకు ప్రతిబింబాలు భారతంలోని స్త్రీపాత్రలు. ఈ సకెళ్ళనుండి స్త్రీకి విమోచనం కావాలి’’ అనే భావాన్ని రచయిత్రి తేల్చి చెప్పింది.
సారస్వతోపనాయసములు, రేడియో ప్రసంగాలు, పత్రికలలో రచనలు లెక్కలేనన్ని చేసిన ఈ కవయిత్రి ధ్యేయం వసుధైక కుటుంబమైన సమసమాజ స్థాపన, కులమత వర్గాతీత సమాజకాంక్ష. కవయిత్రీకాంక్ష్ ఈడేరేకాం వచ్చింది.
‘‘విద్యాధర ప్రభాస’’ అనబడే సాహిత్య సంస్థ నెలకొల్పి తద్వారా తమ ప్రచురణలను వెలుగులోనికి దెచ్చిన శ్రీమతి కొలకలూరి స్వరూపరాణి గారికి వారి కుటుంబమునకు భగవంతుడు సుభశాంతులను ఆయురారోగ్య భాగ్యములను యిచ్చి సర్వదా కాపాడుగాత.

———–

You may also like...