డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు (Dr.Revuru Anantapadmanaabharao)

Share
పేరు (ఆంగ్లం)Dr.Revuru Anantapadmanaabharao
పేరు (తెలుగు)డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు
కలం పేరు
తల్లిపేరుశారదాంబ
తండ్రి పేరులక్ష్మీకాంతరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1947
మరణం
పుట్టిన ఊరుకొవ్వూరు తా. నెల్లూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికడాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు
సంగ్రహ నమూనా రచనఉ. కాంచన పద్మమందు చిలుకల్ మదికింపుగఁ బాడుచుండ, నీ
వంచిత వేడ్కతోడ చతురాసమ సంకము చేరబోవ, చే
లాంచిత మంట పద్మభవుడంగజ భృత్యుడుగాగ నీకటా
క్షాంచల వీక్షణమ్ముల సమాదర ముంచుము తల్లి, భారతీ

డాక్టర్ శ్రీ రేవూరు అనంతపద్మనాభరావు

కడప కాశవాణి కేంద్రమునుండి ప్రసారమగుచున్న ‘బావగారి కబుర్లు’ విని నందించని శ్రోతలు లేరు, సామాజిక జీవితములోని లోటుపాట్లను సామాన్య ప్రజాదృష్టికి దెచ్చు ఈ హాస్య ప్రసంగమును వినిపించు భావమరదులతో శ్రీ రేవూరు అనంత పద్మనాభరావుగారొకరు.
వీరు 1975 నుండి కడ ఆకాశవాణిలో తెలుగు శాఖా ప్రొడ్యూసరుగా ఉన్నారు. కీ.శే. దేవులపల్లి కృష్ణశాస్త్రి, జాషువా పింగళి లక్ష్మీకాంతం, మున్నగు ప్రముఖులు, నిర్వహించిన ఈ ప్రొడ్యూసరు, పదవిని అతి చిన్న వయస్సునకే వీరు పొందియుండుట అదృష్టము.
వీరు నెల్లూరులో బి.ఎ., ముగించి, తిరుపతి శ్రీ వేంకటేశ్వర విద్యాలయములో యం.ఏ, (తెలుగు) పరీక్షలో కృతార్థులైరి. వీరు కళాశాల విద్యార్థిగా నున్నప్పుడే కవిత చెప్ప నారంభించిరి. నెల్లూరు కళాశాలలో, ఆంధ్ర శాఖాధ్యక్షులైన శ్రీ పోలూరి హనుమజ్ఆనకీ రామశర్మగారికి శిష్యుల సాహిత్యములో ప్రకాశించిరి 1967 నుండి 1975 వఱకు వీరు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో, తెలుగు అధ్యాపకులుగా పనిచేసిరి. అప్పుడు వీరికి అష్టావధానములపై అభిరుచి ఏర్పడి, అవధానములు చేయనారంభించిరి. కందుకూరు తాలూకా రచయితల సంఘము నేర్పరచిరి, ఆ మండల కవులను ప్రోత్సహించి’ వారి సాహిత్య వికాసమునకు తోడ్పడిరి. ఎఱ్ఱన, పిల్లలమఱ్ఱి రుద్రకవి మున్నగు ప్రాచీనకవుల జయంతుల నెఱపిరి. కళాశాల విద్యార్థులలో సృజనాత్మకశక్తి వినుమడింప జేయుటకై విరసీవిరియని మొగ్గలనబడు కవితాసంపుటమును, తాలూకా రచయితలను ప్రోత్సహించు నుద్దేశ్యముతో ‘కుసుమ మంజరి’ – ‘శారద నవ్వింది’ అనుకవితా సంకలనములను వెలువరించిరి. వీరు గావించిన సాహిత్యసేవకిని తార్కాణములు.
తదుపరి వీరు 1969 సంవత్సరం జనవరి 31వ తేదీన కందుకూరులో శ్రీ అన్నా ప్రెగడ లక్ష్మీనారాయణగారి అధ్యక్షతన తొలుత అష్టావధానము గావించి పలువురి పండితుల ప్రశంసలను పొందిరి. అదే సంవత్సరము నవంబరులో, కందుకూరు ప్రభుత్వ కళాశాలలో రెండవసారి అవధానమును దిగివజయముగా కొనసాగింది. అవధాన రంగమున నుంచి అవధానులుగా లెక్కింపబడిరి. 1976వ సం. నాటికి ఈ కార్యక్రమములను కాశవాణి ఉద్యోగ నిర్వహణ ఒత్తిడివల్ల మానుకొనిరి.
ఏడేండ్లు సాగిన ఈ అవధాన కార్యక్రమములో వీరు తీర్చిన కొన్ని సమస్యలు కూర్చిన కొన్న దత్తపదులు, ఒప్పించిన కొన్ని ఆశ్రువులు, మెప్పించిన కొన్ని అప్రస్తుత ప్రసంగ సమాధానములు శ్రీ పద్మనాభరావు ఆశుధోరణికి, సమయస్పూర్తికి, ధారణకు నిదర్శనములుగా చాటుచున్నవి. అందు కొన్నింటినైనను ఇందు పొందుపరచు టెంతేని అవసరము. వారు శ్రీ సరస్వతినిట్లు స్తుతించిరి.
ఉ. కాంచన పద్మమందు చిలుకల్ మదికింపుగఁ బాడుచుండ, నీ
వంచిత వేడ్కతోడ చతురాసమ సంకము చేరబోవ, చే
లాంచిత మంట పద్మభవుడంగజ భృత్యుడుగాగ నీకటా
క్షాంచల వీక్షణమ్ముల సమాదర ముంచుము తల్లి, భారతీ
ఏడు అవధానము నందివ్వబడిన కండ, రండ, దండ, ముండ కద ………… రాయిబార ఘట్టము నిట్లు, అభివర్ణించిరి.
ఉ. కందలు పొంగ, సంధిపనిగాదని యన్నను యుద్ధబూమికే
రండనికృష్ట వేగిరము రావలె; అహనభూమి పార్థుకో
దండకు ధార్తరాష్ట్రుల మదంబడపం గలదంచు రౌద్ర భీ
షాందరీ భీమడంచనము ముందు సుయోధను డాలకింపగ.
ఈ విధముగా శ్రీరావుగారు అవధానములను నిర్వహించి డాక్టర్ శ్ర బెజవాడ గోపాలరెడ్డి గారిచేత నెల్లురు వేద సంస్కృత కళాశాలలో సన్మానింపబడుట వీరి జీవితమున ఒక మధురస్మృత కళాశాలలో సన్మానింపబడుట వీరి జీవితమున ఒక మధురస్మృతి. బెంగళూరు ఆంధ్రసారస్వత సమితి పక్షమున శ్రీ నరాల రామిరెడ్డిగారి అధ్యక్షతన జరిగిన అవధానము మరొక మైలురాయి.
శ్రీ పద్మనాభరావుగారు, ‘రుద్రకవి’ వారి రచనలపై ఒక సిద్ధాంత వ్యాసము పరిశోధించి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమునకు సమర్పించి, ‘డాక్టరేట్’ పట్టమును పొందిరి. కందుకూరులో పనిచేయుచున్నప్పుడే కందుకూరి రుద్రకవి రచనలపై ఆసక్తి జనించి, వారినగూర్చి పరిశోధన సాగించి సత్ఫలితము నొందిరి. ప్రబంధములోగల ప్రకృతి వర్ణనలు గూర్చి, వీరు వ్రాసిన ‘ప్రకృతికాంత’ వీరి బహుముఖ గ్రంథ పరిచయమునకు తార్కాణము. శ్రీ పద్మనాభరావుగారు నవలలు వ్రాయుటయందు కూడా ఆరితేరిన వారే. ‘మారని నాణెము’ నవల నేటికళాశాల ఆద్కపకవృత్తికి దర్పణము పట్టినది. ‘సంధ్య వెలుగు’ నవల గ్రామీణ జీవితమును, ‘వక్రించిన సరళలేఖ’ నవల విశ్వవిద్యాలయాలలో మురా రాజకీయములను దూయబట్టుచున్నవి.
శ్రీ పద్మనాభరావుగారు ఆకాశవాణి కడప కేంద్రములో తెలుగు శాఖ ప్రొడ్యూసరుగా చేరిన తరువాత చేసినకృషి సర్వదా ప్రశంసింపదగినది, 1975 అక్టోబరు2, గాంధీజయంతి నుండి ‘సూక్తి ముక్తావళి’ కార్యక్రమమును ఆకాశాణి ద్వారా ప్రసారముచేయ రూపొందించిరి. ప్రసంగముల ద్వారా, కవితల ద్వారా రాయలసీమలో మరుగుపడిన మాణిక్యములను ఆకాశవాణి ద్వరా ప్రకాశింపజేసిరి. ధ్వని సాహిత్య సంచిక కార్యక్రమద్వారా ఉత్తమ ప్రసంగములను ప్రసారము చేసిరి. 1977-1980 సంవత్సరములలో సుప్రసిద్ధ కవులనందరిని ఆంధ్ర దేశపు నలుమూలల నుండి రావించి, కవి సమ్మేళనములను ఆహూతుల సమక్షమున ఏర్పాటు చేసి, ఆకాశవాణి ద్వరా ప్రసారము గావించిరి. ఈ రేడియో కార్యక్రమములన్నియు సాహితీ ప్రియుల శ్రోతల మన్ననలను పొందినది. వృద్ధ కవిపండితుల కంరములను భధ్రపఱచు కార్యక్రమములను వీరు చేపట్టుట శ్లాఘింపదగిన విషయము. విజయవాడలో పనిచేసిన కొద్ది కాలములోనే వీరెందరినో కళాకారుల నాహ్వానించి, ‘భువన విజయ’ మను కార్యక్రమమును ప్రసారము చేసిరి. ‘ధర్మంసదేహాల’ కార్యక్రమములో ‘హరివంశం’ అను వచన కావ్యమును ధారావాహికగా శ్రోతల కందించిరి అది పుస్తక రూపంలో వెలువడినది. ‘రాయలసీమ రత్నాలను’ పేర సుప్రసిద్ధ వ్యక్తుల జీవిత విశేషములను సంక్షిప్తముగ ప్రతివారము శ్రోతలకు వినిపించిరి. ఇది కూడ పుస్తక రూపము దాల్చబోవుచున్నది. ఈ విధముగా ఆకాశవాణి ద్వారా వీరు సాహిత్యకృషి గావించిరి. శ్రీ రేవూరు అనంతపద్మ నాభరావుగారి వయస్సు నేటికి ముప్పది నాలుగువత్సరములు మాత్రమే. పిట్టకొంచెము కూతఘనమన్నట్లు’ ఇంత చిన్న వయస్సునకే వీరు తమ ప్రతిభా పాండిత్యములను చాటి చెప్పుట పూర్వపుణ్య భాగ్య విశేషమనియే, చెప్పవచ్చును.
శ్రీ రేవూరి అనంతపద్మనాభరావుగారి ఎడతెగని సాహిత్య కృషి సాగించుచున్న యువకవులలో అగ్రగణుయలు. వీరు 1980 లో ‘డిప్లొమా ఇన్ జర్నలిజం’ పట్టాను సంపాదించి, ప్రస్తుతము ‘లా’ న్యాయపట్టాను సంపాదించు కృషిలోనున్నారు. వీరి కృషి ఫలించుగాక; నవలా రచయితగా, కథకుడుగా, కవిగా, అష్టావధానిగా, విమర్శకుడుగా డాక్టర్ పద్మనాభరావు గారు మూడుపదుల జీవితములోనే పత్రిభా పాండిత్యములను చాటి చెప్పినారు. వీరి ధర్మపత్ని శ్రీమతి సౌ. శోభాదేవి, భి.ఏ.,చ పట్టభద్రురాలు. భర్తగారి రచనలకు శుద్ధ ప్రతులు తయారు చేయుటలో, ఈ విదుషీమణి సిద్ధహస్తురాలు. ఈ దంపతులు చిరకాలమిట్లే సాహిత్యసేవ నొనర్చుచు అల్లారు ముద్దుగా, సంతాన భాగ్యముచే శోభించుచు, ఆయురారోగ్య సౌభాగ్యములంది, యశోవంతులై వర్థిల్లెదరుగాత.

———–

You may also like...