పేరు (ఆంగ్లం) | Mula Ghatika Ketana |
పేరు (తెలుగు) | మూల ఘటిక కేతన |
కలం పేరు | – |
తల్లిపేరు | సంకమాంబ |
తండ్రి పేరు | మారయ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1200 |
మరణం | 1280 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | – |
మూల ఘటిక కేతన
తెలుగులోతొలి కథా కావ్యం ………
కథా కావ్యమంటే కథకీ, కథా రచనకీ ప్రాధాన్యంగలది. చిత్ర విచిత్రాలైన మహిమలు, మలుపులు, వినోదాలు-వింతలు, నీతులు గల కథల సంపుటిగల కావ్యాలు కథాకావ్యాలు. సమకాలీన సాంఘిక పరిస్థితుల చిత్రీకరణ వుంటుంది. కథాకథన శిల్పం ముఖ్యం. ఒక విధంగా చెప్పాలంటే చందమామ కథల్లో భేతాళ కధల్లాగా, కాశీమజిలీ కథల్లాగా వుంటాయనవచ్చు. తిక్కన కాలంలో ప్రారంభమైన కథా కావ్యరచన శ్రీనాధ యుగంలో విస్తృతికెక్కింది. కథా కావ్యాలు చాలవరకు అనువాదాలు కావు-అనుసరణలు తప్ప.
తెలుగులో తొలి కథాకావ్యంగా ఎక్కువమంది అంగీకరిస్తున్నది కేతన రాసిన ‘దశకుమార చరిత్ర’.ఈ మూల ఘటిక కేతన తిక్కన శిష్యుడు. అంతేకాదు-ఈ దశకుమార చరిత్రను తిక్కనకే అంకితమిచ్చాడు! ఒక కవి మరొక కవికి, ఒక శిష్యుడు ఒక గురువుకు ఇచ్చిన తొలి రచన కూడా ఇదే! కవిత్రయంలో ఒక్క తిక్కనకి మాత్రమే కృతిభర్త అయ్యే అవకాశం లభించింది.
‘‘వివిధ కళానిపుణుడు, నభి
నవ దండియానాగ బుధజనంబుచేతన్
భువిపేరుగొనినవాడను’’ అని తన గురించి ప్రకటించాడు.
సంస్కృతంలో దండి ‘కావ్యాదర్శము’తోపాటు ‘దశకుమార చరిత్ర’ అనే గద్య కావ్యం రాసాడు. దీనికి ఇంచుమించుగా అనువాదమే కేతన దశకుమార చరిత్ర. అందుకే ఒకరిద్దరు అనువాదం కాబట్టి తొలి కథా కావ్యంగా అంగీకరించలేదు. ఆ దండి రచననుబట్టి కేతనకు ‘అభినవదండి’ అనే పేరు వచ్చింది. ఈ కేతన రాసిన ‘ఆంధ్ర భాషాభూషణం’ తెలుగులో రాయబడిన మొదటి వ్యాకరణ గ్రంథం. ఇతని ‘విజ్ఞానేశ్వరీయం’ కూడా తొలి ధర్మ శాస్త్ర గ్రంథం.
‘‘పదలాలిత్యముతో, మనోహరమైన వర్ణనలతో, సజీవమైన పాత్రలతో, సమకాలిక జీవితమును చిత్రించు ఘట్టములతో, హాస్య వ్యంగ్య సంభాషణములతో, రసోచితమైన కథనముతో…’’ దశకుమారుల సాహస చర్యలను, వారి ప్రేమ వృత్తాంతములను మనోహరంగా రాసాడని విమర్శకులు తెలిపారు. పనె్నండు ఆశ్వాసాలలో, సుమారు 1625 గద్యపద్యాలలో రాసాడు. తిక్కన మెప్పుపొందానని చెప్పాడు. తన కాలంనాటి ఆభరణాలను, కోడిపోరును, శృంగార వీర రసాలను హృదయంగమంగా వర్ణించాడు. ‘‘తేనియబడ్డ ఈగగతి’’, ‘‘కుక్కకు టెంకాయ దక్కదు’’ వంటి కొత్త పలుకుబడులు, వయ్యాళి (షికారు), సురంగము (సొరంగం) వంటి వాడుక పదాలూ దశకుమార చరిత్రలో కనిపిస్తాయి. కేతన పద్య రచనా వైభవానికి ఒక్క పద్యం-
‘‘చెఱుకటెవిల్లు! పువ్వులటె చిక్కని చక్కనియమ్ములేయుచో
గఱియటె చిత్తముల్! హరుడు కోపమునంగనుగొన్న నంగముం
బఱిపఱిమయ్యెనట్టె! తల ప్రాణము తోకకు వచ్చె! నెవ్వరిం
గఱచుననంగు డేమిటికి కంపము చెందెదవంబుజాననా!’’
రెండవ ప్రకరణము
నాకనదీసుతు డనియె వ
నౌకోధ్వజ మెఱుగవచ్చు నరుజూపి తగన్.(విరాట పర్వము.)
శా. తృష్టాతంతు నిబద్ధబుద్దు లగు రాధేయాదులంగూడి శ్రీ
కృష్ణుం గేవలమర్త్యుగా దలచి మర్థింపంగ నుత్సాహవ
ర్థిష్ణుండయ్యె సుయోధనుం డకట ధాత్రీనాధ యూహింపుమా
యుష్ణంబున గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.(ఉద్వోగ పర్వము)
క. పదిదినము లయిదు ప్రొద్దులు
పదవడి రెణ్ణాళ్లు నొక్క పగలున్ రేయిన్
గదనంబు చేసి మడిసిరి
నరిసుత గురు కర్ణ శల్య నాగపురీశుల్. (భీష్మ పర్వము)
కేతన మహాకవి.
కేతనకవి తిక్కన సోమయాజి కాలమునందుండి యీతనికి దన దశకుమార చరిత్రము నంకితము చేసి మొప్ప గాంచిన వాడు. ఈతడు దండి విరచిత మైన దశకుమార చరిత్రమును దెనిగించుట చేత బండిత లీతని నభినవ దండి యని పొగడిన ట్లీ క్రింది యాంధ్ర భాషా భూషణములోని పద్యములో గవియే చెప్పు కొను చున్నాడు.
క. వివిధకళానిపుణుడు నభి
నవదండి యనంగు బుధజనంబుల చేతన్
భువి బేరుగొన్న వాడను
గని జనమిత్తృడను మూల ఘటికాన్వయుడన్.
ఈ కవి యింటి పేరు మూల ఘటిక వారని పై పద్యమును బట్టి దెలియు చున్నది. ఇతడు శివ భక్తుడు, కవిత్వము చెప్పి తిక్కన సోమయాజిని మెప్పించుట
———–