వేములవాడ భీమకవి (Vemulavada Bhimakavi)

Share
పేరు (ఆంగ్లం)Vemulavada Bhimakavi
పేరు (తెలుగు)వేములవాడ భీమకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుఇతడు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంకు సమీపములొనున్న వేములవాడ
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురాఘవ పాండవీయము
ఇతర రచనలుశతకంధర రామాయణం
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవేములవాడ భీమకవి
సంగ్రహ నమూనా రచన

వేములవాడ భీమకవి

తాను “నానా కావ్య ధురంధరుడను” అని భీమకవి చెప్పుకొన్నాడు. కాని భీమకవి రచనలు ఏవీ లభించడంలేదు. అతని రచనల ప్రస్తావన కూడా ఇతర కావ్యాలలో స్పష్టంగా లేదు. రాఘవ పాండవీయం, శతకంధర రామాయణం, నృసింహ పురాణం (కస్తూరి కవి తన “ఆనంద రంగ రాట్ఛందం”లో ఉదహరించిన దానిని బట్టి), బసవ పురాణం వంటి రచనలు చేశాడని చెబుతున్నారు. “కవి జనాశ్రయం” అనే లక్షణ గ్రంథాన్ని వ్రాశాడని కూడా ఒక నానుడి ఉంది.
కేవలం చాటుపద్యాల ద్వారానే సాహితీలోకంలో చిరస్థాయిగా నిలిచిన దిట్ట వేములవాడ భీమకవి. పైన కొన్ని చాటువులు ఉదహరింపబడ్డాయి. అతని పలుకు బలాన్ని చెప్పే ఒక చాటువుఇది.
రామునమోఘ బాణమును, రాజ శిఖామణి కంటిమంటయున్
భీము గదా విజృంభణ ముపేంద్రుని చక్రము వజ్రి వజ్రమున్
తామర చూలి వ్రాతయును దారకవి ద్విఘఘోరశక్తియున్
వేములవాడ భీమకవి వీరుని తిట్టును రిత్తపోవునే!
ఇదే చాటువుకు పాఠాంతరం ఇలా ఉంది
బిసరుహ గర్భు వ్రాతయును విష్ణుని చక్రము వజ్రి వజ్రమున్
దెసలను రాము బాణము యుధిష్ఠిరు కోపము మౌని శాపమున్
మసకపు పాము కాటును గుమారుని శక్తియు గాలు దండమున్
బశుపతి కంటి మంటయును పండిత వాక్యము రిత్తపోవునే!
భీమకవి మరొక చాటువు ఇది. ఇందులో తిక్కన ప్రస్తావన ఉండడం గమనించాలి. చాలా చాటువులు ఇలానే ఒక కవికి ఆపాదింపబడుతాయి. అవి కల్పితమో కాదో తెలియడం కష్టం.
ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

———–

You may also like...