పేరు (ఆంగ్లం) | Madiki Singana |
పేరు (తెలుగు) | మడికి సింగన |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1425 |
మరణం | 1500 |
పుట్టిన ఊరు | తూర్పుగోదావరి జిల్లా మడికి గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | కవి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తొలి తెలుగు సంకలన గ్రంధం, తొలి భాగవత భాగాన్ని (దశమస్కంధం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మడికి సింగన |
సంగ్రహ నమూనా రచన | – |
మడికి సింగన
సింగన తాను రచించిన పద్మ పురాణము ద్వారా రచనా కాలం శాలివాహన శకం సుమారు 1342 అని పేర్కొన్నాడు. దీని ప్రకారం సింగన 1375 ప్రాంతములోనివాడుగా చరిత్రకారులు చెపుతారు. అతడు తన 45 వ యేట పద్మపురాణం రచించాడు. తండ్రి అయ్యలమంత్రి గోదావరికి ఉత్తర దిక్కున పెద్దమదికిలో స్థిరమైన తోటలూ, పొలాలూ చాలా ఆర్జించి అఖిల జగత్తుకు అన్నదాత అన్న పేరుతో జీవించాడు. ఈ అయ్యల మంత్రి తొయ్యేటి అనపోతనాయకుని మంత్రిగా ఉన్నాడు. ముసునూరి కాపయ నాయకునికి ప్రతినిధిగా అనపోతనాయకుడు రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. కాపయనాయకుని కాలం క్రీ.శ.1345 నుండి క్రీ.శ. 1367 వరకు, ఆ తరువాతి తరంతో లెక్క చేసినా మడికి సింగన 1377 ప్రాంతం వాడవుతాడు.
తొయ్యేటి అనపోతభూపతిని చోడ భక్తీ రాజు క్రీ.శ. 1355 లో వధించాడు. ఆ సంవత్సరం నుండి రాజమండ్రి ప్రాంతాలు చోడ భక్తీ రాజు స్వాధీనంలో ఉన్నాయి. అంతదాకా రాజమహేంద్ర వారంలో మంత్రులుగా ఉన్న మడికి వంశం వారు రామగిరి దుర్గానికి వలస పోవలసి వచ్చింది. ఈ వంశంలో వలసలు వెళ్ళడం కొత్త కాదు. అసలు మడికి వారి వంశానికి ఆ పేరు రాక పూర్వం వాళ్ళు గుంటూరు జిల్లా గుంటూరు తాలూకా రావెల గ్రామంలో నివసించేవారు. మడికి సింగన తాతగారు అల్లాడ మంత్రి కృష్ణా నదికి దక్షిణ దిక్కున రావెల అగ్రహారాన్ని ఏక భోగ్యంగా ఏలుతూ ఉండేవాడు. రావెలలో కోవెల కూడా కట్టించాడు. అయితే వీరు ఆశ్రయించిన తొయ్యేటి అనపోతభూపతి యొక్క పెదతండ్రి కుమారుడైన కాపయ నాయకుడు, ప్రతాప రుద్రుని రాజ్యం అంతరించాక ఓరుగల్లుకు ప్రభువయ్యాడు. రాజ్యానికొచ్చాక కాపయ నాయకుడు తన బంధువులను వివిధ ప్రాంతాలను పరిపాలించడానికి నియమించాడు. అలా తొయ్యేటి అనపోతనాయకుణ్ణి గోదావరి ప్రాంతానికి పాలకునికిగా నియమించడంతో, అల్లాడ మంత్రి, అతని కొడుకు అయాలమంత్రి కృష్ణానది దక్షిణ తీరం నుంచి గోదావరి ఉత్తర తీరానికి వలస వచ్చారు. అయితే తొయ్యేటి అనపోతనాయకుడు పోయాక, మడికివారి వంశం మరో కొమ్మ పట్టుకోవలసి వచ్చింది. అందుకే రాజమండ్రి నుంచి రామగిరి దుర్గానికి వలస వెళ్ళారు. అది తెలంగాణలో నేటి కరీంనగర్ జిల్లాలో ఉంది. అప్పటికి రామగిరి దుర్గం రాజాదానిగా సబ్బినాడుని పాలిస్తున్న ముప్పు భూపతి వారు, వారి దగ్గర మంత్రులుగా ఉన్న వాణస వారు మడికి వంశస్థులకు బంధువులు అయ్యి స్నేహ బంధుత్వం నెరిపారు. అలా రామగిరి దుర్గానికి వలస వెళ్ళిన సింగన కందనామాత్యుడుతో స్నేహం నెరిపి తన కృతులు వెలయించి ఆతనికి అంకిత మిచ్చాడు.
మడికి సింగన పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమస్కంధం, జ్ఞానవాశిష్ట రామాయాణం ప్రముఖ రచనలుగా తెలుస్తున్నాయి.
———–