పేరు (ఆంగ్లం) | Daggupalli Duggaya |
పేరు (తెలుగు) | దగ్గుపల్లి దుగ్గయ |
కలం పేరు | – |
తల్లిపేరు | ఎర్రమ్మ |
తండ్రి పేరు | దగ్గుపల్లి తిప్పన |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | కవి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నచికేతోపాఖ్యానం – కఠోపనిషత్తు లోనిది. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దగ్గుపల్లి దుగ్గయ |
సంగ్రహ నమూనా రచన | – |
దగ్గుపల్లి దుగ్గయ
దగ్గుపల్లి దుగ్గన (దగ్గుబల్లి దుగ్గన అని కూడా ప్రచురంగా ఉంది) 15 వ శతాబ్దంలో జీవించిన తెలుగు కవి. అతని తండ్రి దగ్గుపల్లి తిప్పన, తల్లి ఎర్రమ్మ. దుగ్గన నాసికేతోపాఖ్యానము (నాచికేతోపాఖ్యానము) అనే పద్యకావ్యాన్ని రచించాడు.
శ్రీనాథునితో బంధుత్వం
దుగ్గన ప్రసిద్ధ తెలుగు కవి శ్రీనాథునికి బావమరిది. శ్రీనాథుని వద్దనే పెరిగి అతని శిష్యరికం లోనే కవిత్వ రచన మొదలుపెట్టాడు. దుగ్గనకు ఇద్దరు అన్నయ్యలు – పోతన, ఎర్రన. ఈ పోతన, బమ్మెర పోతన వేరు. అలాగే ఈ ఎర్రన, కవిత్రయం లోని ఎర్రన వేరు. పోతనను బమ్మెర పోతనగా భావించి అల్లిన కథలు కేవలం కల్పనలే.
రచనలు
దుగ్గన అనేక రచనలు చేసినప్పటికీ నాసికేతోపాఖ్యానం ఒక్కటి మాత్రమే లభ్యమౌతోంది. చెన్నై లోని ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఇది భద్రంగా ఉంది. నేటి నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి రాజ్య పాలకుడు బసవరాజు వద్ద మంత్రిగా ఉన్న చెందలూరు గంగన మంత్రికి ఈ కావ్యాన్ని అంకితమిచ్చాడు. ఈ కావ్యంలో బ్రహ్మదేవునిపై దండకం రచించాడు.
కాంచీపుర మాహాత్మ్యము, దుగ్గన రచించిన మరొక పద్య కావ్యం. ఈ కావ్యాన్ని చెందలూరు గంగన మంత్రి కుమారుడైన చెందలూరు దేవయామాత్యునికి అంకితమిచ్చాడు.
———–