Share
పేరు (ఆంగ్లం)Nandi Mallaya
పేరు (తెలుగు)నంది మల్లయ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీక్రీ.శ.1450
మరణంక్రీ.శ.1520
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజ్ఞానం అనే చంద్రుని ఉదయం ,ప్రబోధ చంద్రోదయం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులురాచమల్లు కవి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనంది మల్లయ
సంగ్రహ నమూనా రచన

నంది మల్లయ్య

ఇప్పటి వరకు మనం చూసిన తెలుగు సాహిత్య రంగం లో తొలి జంట కవులు నంది మల్లయ్య ,ఘంట సింగన ..అదేవీరి నవ్యతా ,నాణ్యత .వీరిద్దరూ ‘’శరీరం ,ప్రాణం ‘’లాగా ఉన్నారని.ప్రతి పద్యాన్ని ‘’చారు ఫణితి ‘’లో చెప్పగలరని ,వీరిద్దరూ కలిసి రాసిన ‘’వరాహ పురాణాన్ని ‘’అంకితం పొందిన సాళువ నరస రాజు అన్నాడట .వ్యర్ధ పదాలు (జల్లులు )లేకుండా అల్పాక్షరాలతో ,అనల్పార్ధం గా రచించారని ఈ జంట కు పేరుంది .ఈ జంట అరాసిన మరో కావ్యం ‘’జ్ఞానం అనే చంద్రుని ఉదయం ‘’అయిన ‘’ప్రబోధ చంద్రోదయం ‘’అనే నాటకం .ఇది ‘’విశ్వ సాహిత్యం లోనే అపురూప నాటకం ‘’గా పరిగణింప బడింది .జీవన వేదాంతానికి చెందిన అతి సులభ ,సరళ రచన ‘’.వేదాంత రస పాకాన్ని గ్రోలిన వారెవరూ ,మళ్ళీ తల్లి పాలు గ్రోలరు –కోరరు ‘’అన్నారు విజ్ఞులు .అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు అని నిశ్చితాభి ప్రాయం .అద్వైత సిద్ధాంత బోధకం గా ఉన్న నాటకం ఇది .’.దీన్ని ‘’ప్రబంధం ‘’లా రాసి నవ్యత ను ,నాణ్యత ను సాధించారు వీరు .కనుకనే వారిద్దరిని స్మరిస్తున్నాం .సంస్కృతం లో ‘’కృష్ణ మిశ్రుడు ‘’రాసిన ఈ నాట కాన్ని ప్రబంధం గా మార్చి నూత్న వరవడి సృష్టించిన తొలి జంట కవులు వీరు .వ్యక్తులు వేరైనా ,కవిత్వం మాత్రం ఒక్కరే రచించి నట్లు రాయటం మహా గొప్ప విషయం .నవతను కవిత లో సృష్టించారు .జంట కవిత్వానికి ఆద్యులై వంద నీయు లైనారు .వీరి రచన లో ‘’సూక్తి వైచిత్రి ‘’అధికం ..ఉదాత్త మైన రచనను సముదాత్తం గా పోషించారు .ఈ జంట కవుల రచన ‘’సూక్తి భాండారం ‘’అన్నారు మహా పండితులు శ్రీ మల్లం పల్లి శరభేశ్వరార్యుల వారు ..ఇలా నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు ఎందరో కవులు తెలుగు సాహిత్యం లో ఎన్నో నవ్య రీతులను వెలయింప జేసి , మలుపులు తిప్పి ,అభ్యుదయ మార్గం లో ప్రయాణం చేసి మహా గౌరవాన్ని పొందారు .తాము ధన్యులై .మనల్నీ ధన్యులను చేశారు .ఎప్పటికప్పుడు తెలుగు సాహిత్య సరస్వతి కి నూతన అలంకారాలను సంత రించి వినూత్న శోభ ను చేకూర్చారు .’’జయంతి తె సుక్రుతినో రస సిద్ధాః కవీశ్వరః ‘’.

———–

You may also like...