పేరు (ఆంగ్లం) | Krishnamacharyudu |
పేరు (తెలుగు) | కృష్ణమాచార్యుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సింహాచల నరసింహస్వామికి భక్తుడై అతని పేర అనేక సంకీర్తనలు రచయించెనని సింహాచలక్షేత్ర మహత్యము తెలుపుచున్నది |
ఇతర రచనలు | సిమ్హగిరి నరహరి వచనములు |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కృష్ణమాచార్యుడు |
సంగ్రహ నమూనా రచన | తెలుగున తొలి వచనకావ్యకర్తయు, వచన సంకీర్తన వాజ్మయమునకు మూల పురుషుడును, వైష్ణవభకతాగ్రేసరుడు నగు ఈ శ్రీకాంత కృష్ణామాచార్యుడు కాకతీయులు చక్రవర్తులలో కడపటి వాడగు రెండవ ప్రతాపరుద్రుడు కాలమున, అనగా క్రీ.శ.1295 నుండి 1326 వరకు గల కాలమున వెలసిల్లె నని ప్రతాపచరిత్రము, ఏకశిలానగర వృత్తాంతమును చెప్పుచున్నవి. తిరుపతి దేవస్థానమున సంకీర్తనాచార్యులలో ప్రథములు తాళ్ళపాక అన్నమాచార్యులు గారు కృష్ణమాచార్యుని తమ సంకీర్తనలక్షణము న పేర్కొనుటచే ఈకాలము ధ్రువమగుచున్నది. |
కృష్ణమాచార్యుడు
తెలుగున తొలి వచనకావ్యకర్తయు, వచన సంకీర్తన వాజ్మయమునకు మూల పురుషుడును, వైష్ణవభకతాగ్రేసరుడు నగు ఈ శ్రీకాంత కృష్ణామాచార్యుడు కాకతీయులు చక్రవర్తులలో కడపటి వాడగు రెండవ ప్రతాపరుద్రుడు కాలమున, అనగా క్రీ.శ.1295 నుండి 1326 వరకు గల కాలమున వెలసిల్లె నని ప్రతాపచరిత్రము, ఏకశిలానగర వృత్తాంతమును చెప్పుచున్నవి. తిరుపతి దేవస్థానమున సంకీర్తనాచార్యులలో ప్రథములు తాళ్ళపాక అన్నమాచార్యులు గారు కృష్ణమాచార్యుని తమ సంకీర్తనలక్షణము న పేర్కొనుటచే ఈకాలము ధ్రువమగుచున్నది. అన్నమయ్యగారి మనుమడు చిన్నన్న తన పరమయోగివిలాసము న ఈతననిని ప్రశంసించియున్నాడు. ఇంతేకాక ఆచార్య సూక్తి ముక్తావళి యందు ఈతని ప్రశంస కలదు. వీనిని బట్టి చూడ కృష్ణమాచార్యుడు వైష్ణవమత వాజ్మయమున ఆంధ్రదేశమున ప్రథమాచార్యుడని చెప్పవచ్చును.
కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన’ లో తాను `తారణ’ నామ సంవత్సరం,భాద్రపద కృష్ణ చతుర్దశి ,మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ,తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ ,ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు
ఈతడు సింహాచలం క్షేత్ర నివాసి అని, సింహాచల నరసింహస్వామికి భక్తుడై అతని పేర అనేక సంకీర్తనలు రచయించెనని సింహాచలక్షేత్ర మహత్యము తెలుపుచున్నది. సింహగిరి నరహరివచనము లను పేర సంకీర్తనలు కృష్ణమాచార్యుల వారివి నేటికిని వెలయచుండుటచే నిది నిజమని చెప్పవచ్చును.
తిరుపతి క్షేత్రముపై మహమ్మదీయులు దండెత్తివచ్చినప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని సంబోధించుచు చెప్పిన వెంకటాచల విహారశాతకమున కూడ
“కృష్ణమాచార్యు సంకీర్తనంబుల జిక్కె సింహాద్రియప్పని చేతగాదు”
అను వాక్యము కృష్ణమాచార్యుల స్మిహాచలక్షేత్రవాసమును, అతని సంకీర్తనని ప్రశస్తిని తెలుపుచున్నది.
లక్షణశిరోమణి మతమున తెలుగున వచన రచన 5 విధములు : 1. గద్య 2. బిరుదుగద్య 3. చూర్ణిక 4. వచనము 5. విన్నపము. వీనిలో కడపటి మూడు తెరగుల రచనములను కృష్ణమాచార్యుల వారు రచించియున్నారు. కృష్ణమాచార్యునికి ముందు గద్య, బిరుదుగద్య లున్నను వచనములు, విన్నపములున్నట్లు కానరాదు. కావుననే కృష్ణమాచార్యుని తొలి వచన కావ్యకర్త అని పేర్కొనవచ్చును.
1. చూర్ణికలు
కృష్ణమాచార్యుడు వీనిని రచయించినట్లు తాళ్ళపాక అన్నమయ్య గారు సంకీర్తన లక్షణమున నిట్లు చెప్పినారు. చూర్ణికలక్షణము నీ పద్యమున కలదు.
ధర కృష్ణమాచార్యాదిక
పరికల్పితపదము తాళబంధచ్చందో
విరహితమై చూర్ణాఖ్యం
బరగును నిర్యుక్తనామభాసితమగుచున్.
2. వచనములు
ఇవి “నమో నమో లక్ష్మీవల్లభా” అను మకుటము కలవి. ఈ విన్నపములు శఠకోపముని ద్రావిడవేదమునకు తెనుగు. కృష్ణమాచార్యుడీ ద్రవిడవేదమును తెలుగు కావించి నట్లు తాళ్ళపాక చిన్నన్న పరమయోగి విలాసావతారికలో నిట్లు చెప్పినాడు.
శైవ వైష్ణవవాజ్మయమున నిట్టి ప్రశాస్త రచనము గల వచనము లెన్నియేని ఉన్నాయి. శైవమున పురాతన శంకరవచనము లను పేర “నను రక్షింపవే భవానీమనోహరా” అను మకుటము గల వచనములు ప్రచారమున ఉన్నాయి. వష్ణవమున వేంకటేశ్వర వచనము కొన్ని ఉన్నాయి. సింహగిరినరహర వచనములు – సింహగిరి నరసింహ
నమోనమో దయానిధీ – అను మకుటముతో నున్న వచనములు కృష్ణమాచార్య విరచితములు. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో ఉన్నాయి. ఇవియే విష్ణునామ సంకీర్తనఫల మనుపేర తంజావూరి పుస్తకశాలలో ఉన్నాయి.
3. విన్నపములు
ఇవి “నమో నమో లక్ష్మీవల్లభా” అను మకుటము కలవి. ఈ విన్నపములు శఠకోపముని ద్రావిడవేదమునకు తెనుగు. కృష్ణమాచార్యుడీ ద్రవిడవేదమును తెలుగు కావించి నట్లు తాళ్ళపాక చిన్నన్న పరమయోగి విలాసావతారికలో నిట్లు చెప్పినాడు.
” శఠమతరాద్ధాంతసంహారి యైన
శఠకోపముని బోలు శఠకోపమౌని
వేదంబు తెనుగు గావించి, సంసార
ఖేధంబు మాంచిన కృష్ణమాచార్యు. “
అని ప్రత్యేకముగ పేర్కొనినాడు.
విన్నపము మచ్చుతునక – “అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! మీకు పునః పునః ప్రదక్షిణ నమస్కారంబు చేసి నా తుచ్చమనస్సున మిమ్ము వర్ణించెద. వాక్పతి బృహస్పతి దివస్పతులకైనను వర్ణింపవలనివి మీదివ్యతిరునామములు వర్ణించుచునాడనే దేవ! అచ్యుత! అనంత! ఆశ్రితరక్షక! అఖిలాండకోటి బ్రహ్మాండనాయక! ఆదిమధ్యాంతరహిత….
శారణాగతవజ్రపంజరా! నాదురితంబులు ఖండించి మీదాసానుదాసులకు దాసుండనై వర్తించె బుద్ధి పుట్టించి నాదుర్గణంబులు చూడక మీ పతిత పావన బిరుదు ప్రతిష్టించి పతితుండనైన నన్ను రక్షించవే ఆశ్రితజనమందార ! అఖిలలోకధార! అఘుదూర! నమో నమో లక్ష్మీ వల్లభా!
———–