పేరు (ఆంగ్లం) | Veligamdala Naraya |
పేరు (తెలుగు) | వెలిగందల నారయ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | వెలిగందుల |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీమహాభాగవతంబను మహాపురాణంబు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | |
పొందిన బిరుదులు / అవార్డులు | |
ఇతర వివరాలు | |
స్ఫూర్తి | |
నమూనా రచన శీర్షిక | వెలిగందల నారయ |
సంగ్రహ నమూనా రచన | – |
వెలిగందల నారయ
ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్యప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబు నందుఁ గృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరానుబంధంబుఁ గల్పించి, వారల హతంబు గావించుటయు, విదేహర్షభ సంవాదంబును, నారాయణ ముని చరిత్రంబును, నాలుగు యుగంబుల హరి నాలుగువర్ణంబులై వర్తించుటయు, బ్రహ్మాది దేవతలు ద్వారకానగరంబునకుం జని కృష్ణుం బ్రార్థించి నిజపదంబునకు రమ్మనుటయు, నవధూత యదు సంవాదంబును, నుద్ధవునకుఁ గృష్ణుం డనేకవిధంబు లైన యుపాఖ్యానంబు లెఱింగించుటయు, నారాయణప్రకారం బంతయు దారకుం డెఱింగివచ్చి ద్వారకానివాసులకుం జెప్పుటయుఁ, గృష్ణుండు దన దివ్యతేజంబుతోఁ బరమాత్మం గూడుటయు నను కథలు గల యేకాదశ స్కంధము.
భావము:
ఇది పరమేశ్వరుని దయచేత లభించిన విచిత్రమైన కవిత్వము కలవాడు కేసనమంత్రి కుమారుడు సహజపాండిత్యుడు అయిన పోతనామాత్యుని ప్రియశిష్యుడు వెలిగందల నారయ అను నామధేయునిచే రచించబడిన శ్రీ మహాభాగవత మనే పురాణంలో కృష్ణుడు భూభారం పోగొట్టి, యాదవులకు పరస్పర శత్రుత్వాలు కల్పించి, వాళ్ళను నాశనం చేయటం; విదేహ ఋషభ సంవాదం; నారాయణమహర్షి చరిత్ర; నాలుగు యుగాలలో హరి నాలుగు వర్ణాలై వర్తించటం; బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు ద్వారకానగరానికి వెళ్ళి శ్రీకృష్ణుని తన స్థానానికి రమ్మని ప్రార్ధించడం; అవధూత యదు సంవాదం; ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు అనేకమైన ఉపాఖ్యానాలు తెలపటం; కృష్ణుడి విషయమంతా తెలుసుకుని దారుకుడు వచ్చి ద్వారకలోని వారికి చెప్పటం; శ్రీకృష్ణుడు తన తేజస్సుతో పరమాత్మను కలవటం అనే కథలు కల పదకొండవ స్కంధము.
———–