నటరాజ రామకృష్ణ (Nataraja Ramakrishna)

Share
పేరు (ఆంగ్లం)nataraja ramakrishna
పేరు (తెలుగు)నటరాజ రామకృష్ణ
కలం పేరు
తల్లిపేరుదమయంతి దేవి
తండ్రి పేరురామ్మోహనరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1923 మార్చి 21
మరణంజూన్ 7, 2011 వ తేదీన హైదరాబాదులోని నిమ్స్
పుట్టిన ఊరుబలీ ద్వీపం
విద్యార్హతలు
వృత్తినాట్యాచార్యుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు40 కి పైగా పుస్తకాలు రాసారు . నర్తన భూమి , నర్తన జ్యోతి ,నృత్యాంజలి ,ఆంధ్రుల నృత్య కళ ,నర్తన మురళి ,పేరిణి శివతాండవం , నవజనార్ధన పారిజాతం ,ఆంద్ర నాట్యం ,నాట్య శాస్త్రాలు ,ఆంద్ర నాట్యం అభినయం ,రుద్ర గణిక,దేవ నర్తకి ,నర్తన వాణి ,నర్తన శోభ ,నాట్య రాణి ,నృత్య జ్యోతి ,నర్తన బాల , దాక్షిణాత్యుల నాట్య కళ ,ఆంద్ర నాట్యం ఆలయాలు .
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకళా ప్రపూర్ణ , భరత కళా ప్రపూర్ణ , భరత కళా సవ్యసాచి , కళా సరస్వతి , ఆస్థాన నాట్య చార్యుడు , ఉత్తమ నాట్య చార్యుడు , కళా సాగర్ , శ్రీ రాజ్య లక్ష్మి పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనటరాజ రామకృష్ణ
సంగ్రహ నమూనా రచన

నటరాజ రామకృష్ణ

భరత శాస్త్రం ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న : భరత శాస్త్రం , భరతుని నాట్యం శాస్త్రం , ఈ రెండూ ఒక ఒకటేనా ?
సమాధానం : రెండూ ఒకటి కావు, “భ” అనగా భావం, “ర” అనగా రాగం “త” అనగా తాళం. భావ, రాగ, తాళాల మూడింటితో గూడి ప్రదర్శింపబడే కళా రూపం భరతం ఈ కళారూపానికి గల క్రమపద్ధతిని, పొందవలసిన శిక్షణను, పదర్శించే తీరును తెలియజేసేది భరత శాస్త్రం. ఇది ఒక గ్రంధం కాదు. దీనిని ఎవరూ ప్రత్యేకంగా రచించ లేదు. అనేక మంది శాస్త్రకారులు, విద్యావేత్తలు, పండితులు తెలియజేసిన అభిపాయాల, వ్యాఖ్యానాల సంకలనం ఇది. భరతుడనే ఒక ఋషీశ్వరుడు “నాట్యశాస్త్రం” అనే గంధాన్ని వ్రాశాడు. భారతదేశంలో ఆనాడు ప్రచారమందుండిన భరత విద్యలో ఒక భాగంగా నుండిన నాట్యకళ గురించి ఇతడు తన గ్రంథంలో తెలియజేశాడు.
బహుపాత్రలు గల నృత్యనాటక పద్దతిని గురించి ఈ గ్రంథంలో అతడు ప్రధానంగా వివరించాడు. కవితా రీతిలో రచించబడిన ఒక బహుపాత్రల పారాణిక కధలోని పాత్రలు వివిధ తాళ గతులలో వివిధ రాగాలలో పాడుతూ, పాత్రోచితమైన వేషధారణతో ప్రదర్శించే రీతిని గురించి భరతముని తన నాట్య శాస్త్రంలో వివరించాడు. ఈ కథలోని పాత్రధారుల వేషధారణ గురించి, అలంకరణ గురించి , రంగస్థలం పైకి వార వచ్చి, వెళ్లే విధానం గురించి, ప్రస్తారం గురించి సంభాషణా విధానం మొదలైనవాటి గురించి అతడు వివరంగా తెలియజేశాడు. ప్రతిపాత్ర తన హోదానుబట్టి రంగస్థలంపైని ఏ విధంగా ప్రవర్తించాలో వివరించాడు. మహారాజు మహారాణి, మహామంత్రి , యువరాజు, దుష్టుడు; కులటలు, సేవకులు మొదలైనవారు తమ తమ పాత్రలకు ఉచితమైన రీతిని నడవడం, అంగవిక్షేపం చేసికొనడం, పాత్రోచితమై రీతిని సంభాషించడం, ఆయా పాత్రలకు తగిన ఛందస్సును, సంగీతాన్ని కూర్చడం, హావభావ ప్రకటనలు చేయడం మొదలైన వాటినన్నింటిని భరతముని తెలియచేళాడు.


భరతముని నాట్య శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను వివరించినా “నాట్యం “ అనే అంశానికే తన రచనలు పరిమితం చేసినట్లు మనం భావించ వచ్చును . బహు పాత్రలు గల నృత్య నాటకాలను మాత్రమే భరతుని నాట్య శాస్త్రం వర్తిస్తుంది . నృత్య కళాకారులు సర్వ సాధారణంగా ఉపయోగించే “ భరత శాస్త్రం “ అనే పదం ఈ భరతుని నాట్య శాస్త్రానికి వర్తించదు . నృత్తం , నృత్యం , అభినయం , లాస్యం , తానడవం , రసం , భావం వీటన్నింటిని చర్చించే ప్రత్యేక శాస్త్రం “ భరతం “ . దీనిలో అనేక ఇతర శాస్త్ర విషయాలు కలిపి యుంటాయి .
నందికేశుడు ఆనే మరొక శాస్త్రవేత్త “భరతార్ణవం”, “అభినయ దర్పణం ” అనే రెండు గ్రంథాలను రచించాడు. భరతార్ణవం బృహత్ గ్రంధం . అభినయ దర్పణం సంక్షిప్త గ్రంథం. వీటిలో అతడు ఏకపాత్ర నృత్య కేళికా విధానం గురించి ప్రధానంగా చర్చించాడు. ఒకే నర్తకి లేక నర్తకుడు ప్రదర్శించే నృత్యకళా విధానానికి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు ఇవి. బహుపాతల నృత్య నాటకాల గురించి వీటిలో ప్రస్తావించబడలేదు. నృత్త, నృత్య అభినయాలలో తనకు గల పాండిత్యాన్ని ఒక కళాకారిణి లేక కళాకారుడు ప్రదర్శించడాన్ని ఏకపాత్ర కేళిక అంటారు. ఇది వేరు, బహుపాత్రల నృత్యనాటక ప్రదర్శన వేరు . అందువల్ల ఇవి విభిన్న సంప్రదాయాలు. నృత్యనాటక సంపదాయాన్ని శాస్త్రబద్ధం చేసినవాడు భరతముని, ఏకపాత్ర నృత్య కేళికను శాస్త్రీకరించిన వాడు నందికేశుడు. ఈ సంప్రదాయాలకు భరతుని నాట్యశాస్త్రం, నందికేశుని భరతార్ణవం, ఆభినయ దర్పణం మూల గ్రంధాలుగా మనం పేర్కొనవచ్చును.

ప్రశ్న : భరతముని, నందికేశుల గంథాలకు గల సారూప్య, వ్యత్యాసాలను వివరించండి ?
సమాధానం : బహుపాత్రలు గల నృత్యనాటకానికి సంబంధించినది భరతముని రచించిన నాట్యశాస్త్రం. ఇక్కడ “నాట్యం” అంటే నృత్యనాటక మని భావించవలసి యుంటుంది.
ఏకపాత కేశికకు సంబంధించినవి నందికేశుడు రచించిన భరతార్ణవం, అభినయ దర్పణాలు.
నృత్యనాటకంలోని బహుపాత్రల నర్తనం వాచికం, సంగీతం, ఆహార్యం, అంగవిన్యాసాలు, రసభావ ప్రకటనలు మొదలైనవాటి గురించి భరతుడు తన నాట్యశాస్త్రంలో చర్చించాడు. నందికేశుడు తన రచనలలో ఏకపాత్ర నృత్త, నృత్య, అభినయాల గురించి చర్చించాడు. ఈ రెండింటిలో ఆంగికాభినయం , హస్త ముద్రలు కొంత వరకు ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల నృత్య కళా కారులు ఈ రెండింటిని అధ్యయనం చేసేటప్పడు కొన్ని విషయాలను ముఖ్యంగా గమనించవలసి యుంటుంది.

ఏకపాత్ర కేళికా కళాకారులు వారికి అవసరమైన అంశాలనే వారు స్వీకరించాలి. నృత్యనాటక కళాకారులు వారికి వర్తించే అంశాలనే వారు స్వీకరించాలి. కొన్ని విషయాలలో ఈ ఇద్దరి గ్రంధాలలో కొంత తేడా ఉంది. ఆందువల్ల కళాకారులు తమకు అనువైన వాటినే గ్రహించడం ఉత్తమం. అయితే ఈ యిరువురి గ్రంథాలను కళాకారులందరూ విధిగా చదవడం అవసరం.
ఈ యుభయుల గ్రంథాలను చదువుతున్నప్పడు కొన్ని వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఆ వ్యత్యాసాలకు కారణ మేమిటి ? ఈ గ్రంధకర్తల అభిమతమేమిటి ? అన్న విషయాలను కళాకారులు చర్చించుకొని, అర్థం చేసికొనవలసి యుంటుంది. ఉదాహరణకు, ఈ యిరువురి రచనలలోను కరణ, చారీ, రేచక విన్యాసాల గురించి ఉంది . కాని వాటి ప్రయోగాలలో తేడా కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి . ఇలాగే నృత్త, నృత్య హస్తాల ప్రయోగ, ప్రయోజనాలలో తేడా కన్పిస్తుంది. ఈ తేడాలు ఎందువల వచ్చాయి ? అని మనం విమర్శనాత్మకంగా పరిశీలిస్తే, ఈ రెండు సంప్రదాయాలు రెండు తీరులలో రూపొందినట్టు, వీటి పరిధులు విస్తృతులు వేరు అని మనకు తెలుస్తుంది. విధంగా మనం నిశిత పరిశీలన చేయకుండా యిరువురి రచనలను చదివితే మనకు గందరగోళంగానే ఉంటుంది.
నృత్యనాటకం, ఏకపాత కేళికా ఏ మూల సిద్ధాంతాల మీద ఆధారపడి యున్నాయో మనం తెలుసుకొనాలి, ఉదాహరణకు మనం రసాభినయాన్ని తీసుకొందాం.

భరతుని నాట్యశాస్త్రానుసారం వివిధ పాత్రలకు అనుగుణమైన రసాభి నయనాన్ని మనం నృత్యనాటకంలో కూర్చవలసియుంటుంది. ఆభినయాన్నే విస్తృత పరచడానికి స్థాయిూ భావాన్ని నిరూపించి, సంచారులతో అభినయాన్ని అలంకరించి, వికసింపజేస్తూ ఉంటాం. బహుపాత్రల నృత్యనాటకంలో ఏయే పాత్రలకు ఏయే రసం ఎంతవరకు అవసరమో అంతవరకే దానిని అభినయంతో పోషించేటట్లు మనం కూర్చవలసి యుంటుంది. అంతకు మించి దానిని కూర్చకూడదు. ఒక్కొక్క సంచారీ భావానికి పది రకాలైన విన్యాసాలు ఉన్నా ఏ ఘట్టంలో ఏ పాత్రకు ఏ విన్యాసం రసపోషణకు అవసరమో ఆ విన్యాసాన్నే ప్రదర్శించి, మిగిలినవాటిని విడిచిపెట్టవలసి యుంటుంది.
పదాలను, పద్యాలను శ్లోకాలను ఏకపాత్ర కేళికలో ఆభినయించేటప్పడు ఇందుకు భిన్నంగా ఉంటుంది .
ఒక పాత్ర పోషణలో స్థాయిూ భావ నిరూపణ జరిగిన తర్వాత ఆ స్థాయిని ఎన్ని విధాలైన సంచారులతో ఆలంకరించవచ్చునో ఆ యన్నిటితో దానిని అలంకరించి, అభినయించి, ఆ భావాన్ని విస్తృతపరచవలసి యుంటుంది. ఇటువంటి భిన్నవిషయాలు ఈ గ్రంధాలలో మనకు గోచరిస్తాయి.

ప్రశ్న :భరతముని, నందికేశుడు తెలియజేసిన నృత్త, నృత్య, నాట్యాలలోని తీరులను గురించి వివరించండి?.
సమాధానం : బహుపాత్ర లుండే నృత్యనాటక రీతిని గురించి భరతుడు తన నాట్యణాస్త్రంలో తెలియజేశాడు. నాట్యానికి సంబంధించిన రీతుల గురించే అతడు తన నాట్యశాస్త్రంలో వివరించాడు. అందువల్ల అతడు నృత్త , నృత్యాలను వేరు వేరుగా విడదీసి చర్చించలేదు. రసభావంలేని శుద్ధ నృత్తం అంటే హస్త , పాద విన్యాసాలు నృత్యనాటకాలలో ఉన్నప్పటికీ దీనిని ప్రత్యేకించి అతడు వివరించలేదు. కరణముల అధ్యాయంలో అతడు తెలియజేసిన ఆంగిక విన్యాసమంతా నృత్యనాటకాలకు ఉపయోగపడేదే కాని శుద్ద నర్తనానికి ఉపకరించేది కాదు. ఏ విన్యాసాన్ని ప్రదర్శించినా అది ఆ పాత్రపోషణకు అలంకారంగా ఉండాలి . ఏ వాయిద్యాన్ని వాయించినా, ఏ రాగాన్ని ఆలపించినా ఆది ఆ
పాత్రను ప్రకాశింపజేయడానికి ఉపకరించాలి అన్నది భరతుని సిద్ధాంతం. అతని సిద్ధాంతమంతా నృత్యనాటక రీతికి పరిమితమై యుంది.

నందికేశుని శాస్త్ర చర్చంతా ఏకపాత్ర “కేళికా రీతికి సంబంధించినది. ఒకే
పాత్ర తన కేళికలో నృత్త నృత్య, అభినయాలను విశిష్ట కళా రూపాలుగా ప్రదర్శించాలన్నది నందికేశుని సిద్ధాంతం. అందువల్లనే అతడు వీటిని వేరు వేరుగా విభజించి వివరించాడు.
ఏకపాత కేళికలో నృత్తం, నృత్యం వేర్వేరు అంశాలు గనుక భరత కళలో ఇవి రెండూ ప్రత్యేక విభాగాలుగా రూపొందినాయి. ఆందువల్లనే నందికేశుడు నృత్త హస్తాలను, నృత్య హస్తాలను వేర్వేరుగా పేర్కొన్నాడు.
భరతంలో నృత్తం ఒక ప్రత్యేక కళ నృత్యం . ఒక ప్రత్యేక కళ అభినయం ఒక ప్రత్యేక విశిష్ట కళారూపం. భరతంలో దేని కది ప్రత్యేకంగా ఇవి రూపొందించ బడ్డాయి. ఈ మూడింటిలో అభినయం విశిష్ట రీతిలో రూపొందింది.

నందికేశుని సిద్దాంతానుసారం, వివిధ ఛందస్సుల్లో, వివిధ గతి భేదాలలో, యతి భేదాలలో, జాతి భేదాలలో, జతి కట్టుబాట్లలో, బంధరచనా ముక్తాయి తీర్మానం , మొహరలతో నృత్తం ప్రత్యేకంగా అలంకరించబడి , బంధించబడి రూపొందించబడింది . అడవులు , అడగులు క్రమం రూపిందింది . అడవులు ప్రత్యేకంగా నృత్తంలోను , అడుగులు నృత్యంలోను ప్రత్యేకంగా ఉపయోగించబడతాయి . ఈ రెండింటిలోను హస్తాలు ఉన్నాయి . అయితే నృత్యంలో అవి భావాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించబడితే , నృత్తంలో తాళ లయలను తెలియజేసే శబ్ద చిత్రాల నిరూపణకు మాత్రమే అవి వినియోగింప బడుతున్నాయి . అందువల్ల ఏకపాత్ర కేళికా కళాకారులు ఈ రెండింటిని వేర్వేరుగా అభ్యాసం చేయవలసి యుంటుంది . ఎందువల్ల నంటే నృత్త , నృత్యాలు వేర్వేరుగా ప్రత్యేక శాఖలుగా రూపొందించబడ్డాయి .
ఇదే విధంగా అభినయంలో వివిధ స్థాయి నిరూపణ , సంచారులను పూర్తిగా వినియోగించుకొనే క్రమం , వికసింపజేసే తీరులు పెంపొందాయి .

రచయిత : నటరాజ రామకృష్ణ
సేకరణ : భరత శాస్త్రం ప్రశ్నలు – సమాధానాలు .

 

———–

You may also like...