ముళ్ళపూడి వెంకటరమణ (Mullapudi Venkataramana)

Share
పేరు (ఆంగ్లం)Mullapudi Venkataramana
పేరు (తెలుగు)ముళ్ళపూడి వెంకటరమణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుసింహాచలం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/8/1931
మరణం2/24/2011
పుట్టిన ఊరుధవళేశ్వరం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుహాస్య నవలలు, కథలు
ముళ్ళపూడి వెంకటరమణ రచనలలో ప్రసిద్ధమైనవి కొన్ని

బుడుగు – చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన
ఋణానందలహరి (అప్పుల అప్పారావు – అప్పుల ప్రహసనం
విక్రమార్కుని మార్కు సింహాసనం – సినీ మాయాలోక చిత్ర విచిత్రం
గిరీశం లెక్చర్లు – సినిమాలపై సెటైర్లు
రాజకీయ బేతాళ పంచవింశతి – రాజకీయ చదరంగం గురించి
ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం –
అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
కోతి కొమ్మచ్చి: ఆయన జీవిత చరిత్ర. స్వాతి పత్రికలో ప్రచురితమైంది.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నారు.
ఇతర వివరాలువారి పూర్వీకులు బరంపురానికి చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్థిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు.

1945లో “బాల” పత్రికలో రమణ మొదటి కథ “అమ్మ మాట వినకపోతే” అచ్చయ్యింది. అందులోనే “బాల శతకం” పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే “ఉదయభాను” అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయాడు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నాడు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. 1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరాడు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికముళ్ళపూడి వెంకటరమణ
సంగ్రహ నమూనా రచననేను చాలా రోజులుగా కష్టపడి చేస్తూ తయారు చేస్తూ వచ్చిన ”కొసరు కొమ్మచ్చి” పుస్తకం తయారై మార్కెట్లోకి వచ్చింది. ప్రింటు వెర్షన్‌ నవోదయా, హైదరాబాదు వారు పంపిణీ చేస్తూండగా, ఈ-బుక్స్‌, ఆన్‌లైన్‌ సేల్స్‌ కినిగె డాట్‌కామ్‌ వాళ్లు చూస్తున్నారు. ఈ పుస్తకం ఉద్దేశం ఏమిటో, దానికి నేను పడిన శ్రమ ఏమిటో పాఠకులతో పంచుకోవాలని, యీ క్రమంలో రమణగారి సాహిత్యం, వ్యక్తిత్వం గురించి తెలియనివారికి కాస్త పరిచయం చేద్దామని ఉద్దేశం. ముళ్లపూడి వెంకటరమణగారి ఆత్మకథ ”కోతి కొమ్మచ్చి” స్వాతి వీక్లీలో సీరియల్‌గా వచ్చి సంచలనం సృష్టించింది. దాన్ని మేం ”హాసం” బ్యానర్‌లో మూడు భాగాలుగా ప్రచురించాం. అంత రాసినా రమణగారు కొన్ని విషయాలు వదిలేశారు. (కారణాలేమిటో నా వ్యాసంలో రాశాను). వాటి గురించి రమణగారు పోయిన తర్వాత వాళ్లమ్మాయి అనూరాధ ”స్వాతి” వీక్లీకై ‘నాన్నా మామా మేము అను తోకకొమ్మచ్చి’ అనే వ్యాసంలో సరదాగా ప్రస్తావించారు –

ముళ్ళపూడి వెంకటరమణ

చాలా దశాబ్దాల నాటి సంగతి. ముళ్ళపూడి వెంకటరమణ అనే ఒకానొక రచయిత ఉన్నట్టుండి ఆశేష పాఠక హృదయాల్లోకి ఝామ్మని దూసుకుపోయి తిష్ఠవేసుకుని కూర్చున్నాడు. హాస్యం ఆయన వచన శైలి చేత మనోహర లాస్యం చేయించింది; అది సెటైరును ఒక ఆయుధంగా ప్రయోగించింది. మధ్య తరగతి మనుషుల లేనిపోని భేషజాలను తన కథలలో ఆయన వేళాకోళం చేశాడు. మాటలతో గారడీ చేశాడు. కలాన్ని మంత్రదండంలో ప్రయోగించాడు. పేదరికంతో చెట్టాపట్టాలు వేసుకుని అరకప్పుటీ కోసం, ఒక ప్లేటు సానుభూతి కోసం వీథుల వెంట వెదుకుతూ తిరిగే నిరుద్యోగ యువకులతోను, తమ క్లాసు అమ్మాయిల మీద మధుబాలను, సావిత్రిని సూపర్ ఇంపోజ్ చేసుకుని, వేడి నిట్టూర్పులు విడుస్తూ విరహవీణలు వాయించుకుంటూ తిరిగే అపర దిలీప్‍కుమార్లతోను, అభినవ నాగేశ్వరరావులతోను కిటకిటలాడే ఒక కొత్త ప్రపంచాన్ని ఆ మంత్రదండంతో ఆమంత్రించాడు.
ఆయన మొదటి కథలలో రెండోదో, నాలుగోదో “ఆకలి ఆనందరావు”. అది ఆంధ్రప్రభ వార పత్రికలో అచ్చు అయింది. బహుశా 1953 లో. కథా సాహిత్య భవనం బాల్కనీలో కాలరెత్తుకుని నిలబడిన ఆ కథ చదివిన పాఠకులు “ఎవరా రైటరు, ఏమా స్టోరీ” అని చాలాసేపు ఆశ్చర్యపోయారు, వెనక్కి తిరిగొచ్చారు; ఆనందపడ్డారు, లేచి కూర్చున్నారు.
ఒకానొక వేసవి రోజున మండుటెండలో మద్రాసు నగర వీధులలో ఒకానొక నిరుద్యోగ యువకుడు కప్పెడు వేశి తేనీరు కోసం, వేడకపోయినా దొరికే నీరు కోసం లోపలా బయటా చేసే సాహసాల ఇతివృత్తం అది. వాక్యాలు కొత్తరకంగా ఉన్నాయి. ఇదివరకు ఎక్కడా ఎవరూ రాయని శైలిలో ఉన్నాయి. హాస్య తరంగాల వేషం ధరించినా, జీవిత గాంభీర్యాన్ని, విషాదాన్ని అంతర్వాహినిగా దాచుకున్న శైలి అది.
ఆనందరావుకీ ఆనందరావుకీ మధ్య నడిచే డైలాగులు చిరునవ్వుల పువ్వులు పూయిస్తూనే గుండెని పట్టేస్తాయి. ఆ ఇడియమ్ ఎక్కడిదబ్బా? ఆ అదీ, చార్లీ చాప్లిన్ చూడండి: ఎంత విషాద గంభీర సన్నివేశాన్నయినా బుజాలెగరేసో, ఏడవడానికి సిద్ధంగా ఉన్న పెదవులపైకి రాని నవ్వును లాక్కువస్తూనో దులిపేసుకుంటాడే! అదీ ఆ టెక్నిక్కు. కథానాయకుడైన ఆనందరావు ఒక వైపు విషాద వీచికలతో పేచీ పడుతూనే, మరో వైపు మధురోహల మృదుడోలలలో ఉయ్యాల లూగుతూ, తన కష్టాల కన్నీళ్ళకు సుఖాంతాల ఇంద్రధనుస్సుల్ని తగిలించాలని ప్రయత్నిస్తాడు. కరుణ, హస్యరసాల కలనేతతో కథ నడిపించడం అప్పటికింకా పూర్తిగా కాదుగాని, చాలావరకు కొత్త. తెల్లవారేసరికి ముళ్లపూడి వెంకటరమణ పేరు పొందిన రచయితగా మేలుకున్నాడు.
ఆనందరావు ఎవరంటే ముళ్లపూడే. బాల్యం ఆఖరై యౌవనపు గుమ్మంలో అడుగుపెట్టే రోజుకి ముళ్లపూడికి ఆకలి కొత్తకాదు. ఆకలీ, ఆయనా కలిసి ఒకే హైస్కూల్లో చదువుకున్నారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడాయన. గోర్కీ లాగా ఆరంభయౌవనంలోనే తన జీవితపథం తాను వెతుక్కోవాల్సివచ్చింది. పేదరికంతో చుట్టరికం ఏర్పడింది. ఎంతటి కష్టాన్నయినా తేలికగా నవ్విపారేసే తత్వం, ఎప్పటికయినా రచయితగా పేరు తెచ్చుకోవాలనే తపన ఆయన్ని నిస్పృహకు లోను కాకుండా కాపాడాయి. ఉన్నత విద్య అభ్యసించలేదు. కాని, తిరిగి గోర్కీ లాగా తన చుట్టూ జీవితమే ఆయనకు యూనివర్శిటీ అయింది. ఇక పుస్తకాల సంగతి చెప్పనక్కరలేదు. తెలుగులోను, ఇంగ్లీషు లోను చెప్పుకోదగిన రచయితలెందరి గ్రంథాలో చదివి ఆకళించుకున్నారు. హైస్కూలు రోజుల్లోనే రచనా వ్యాసంగం ప్రారంభించారు. బాపుతో స్నేహం కలిసింది. అరవై ఏళ్ళ నాడు అవిచ్చిన్నంగా అలాగే కొనసాగింది.
ఒక లక్ష్యం, గమ్యం లేకుండా తిరిగారు. రకరకాల ఉద్యోగాలు చేశారు. మద్రాసులో అప్పుడే క్రొవ్విడి లింగరాజు ఎడిటరుగా ప్రారంభమైన ప్రకాశంగారి ’ప్రజాపత్రిక’ లో చేరారు. ఆనాటి సహోద్యోగులలో వాకాటి పాండురంగారావు, కోటగిరి విశ్వనాథరావు, తుర్లపాటి కుటుంబరావు ప్రభృతులు ఉండేవారు. అప్పుడే జర్నలిస్టుగాను, కథా రచయితగాను పేరు తెచ్చుకోవడం ప్రారంభించారు. కొద్ది కాలం తర్వాత(1954 లో) ఆంధ్రపత్రికలో చేరారు. మొదట కొన్ని కథలు ఆంధ్రప్రభలో పడిన తర్వాత, ఆంధ్ర పత్రిక వారపత్రికలో వరసగా కథ తర్వాత కథ, సీరియల్ తర్వాత సీరియల్ ప్రచురించడం ప్రారంభించారు. ఆనాటి వారి సహోద్యోగులలో ఈ రచయితతోపాటు సూరంపూడి సీతారాం, గోళ్లమూడి రామచంద్రరావు, ఎం. ఎస్ శర్మ, సిహెచ్.వి.రాజగోపాలరావు, దాసు వామనరావు, పిలకా గణపతిశాస్త్రి లుండేవారు.
ఆయన ఆ రోజులలో రాసిన కథలు యువతరం పాఠకులను ఉర్రూతలూగించాయి. కల్పనా చాతుర్యం, భావనా వైచిత్రి, పందెపు గుర్రంలా పరిగెత్తే వచనం, మానవ స్వభావ పరిశీలన, ముఖ్యంగా చాప్లిన్ లాగా దగాపడిన తమ్ముళ్ల పాత్రల చిత్రణ ఆయనకొక ప్రత్యేకత సంతరించి పెట్టాయి.
మళ్లీ మొదటికి వెడితే, అంటే వెనక్కి నడిస్తే, మన దృష్టిని ఆకర్షించే కథ “ఛాయలు”. ఇది “ఆకలీ-ఆనందరావు” తర్వాత కథ. ఇందులో కూడా అదే టెక్నిక్, ఊహాతరంగాలలో ఉయ్యాలలూగే కథన శిల్పం. కథా నాయకుని పేరు సుబ్రహ్మణ్యం. ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా కాసిని డబ్బులు “అరువు” తీసుకుని వెళ్లిపోయిన తమ్ముడిని వెతుకుతూ రాత్రి తొమ్మిదిగంటల వేళ మద్రాసు సెంట్రల్ స్టేషన్ కు వెడతాడు. అతడు అటూ ఇటూ తిరగడాన్ని అనుమానంగా చూస్తున్న పోలీసు తన వృత్తికి సజమైన భాషలో పలకరిస్తాడు. సుబ్రహ్మణ్యం ఎందుకేనా మంచిదని మైలాపూరులో స్వగృహంకేసి తిరుగు ముఖం పడతాడు. దారిలో రకరకాలుగా ఆలోచిస్తాడు. పో్లీసువాడికి ఎలా బుద్ధి చెప్పాలీ అని. దారిలో ఒక సినిమా హాలు దగ్గర ఆగుతాడు. పోలీసువాడు వాడిన భాషతో ఇంకా కుతకుత లాడిపోతున్న సుబ్రహ్మణ్యం టిక్కెట్ కొనుక్కుని, హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. సినిమా మీదా ఆసక్తితో కాదు, జరిగినదంతా తలుచుకుంటూ, పోలీసు వాడికి విధించవలసిన రకరకాల శిక్షలు ఊహించుకుంటూ, రైల్వే స్టేషన్ లో తారసిల్లిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయితో తీరికగా రొమాంటిక్ సన్నివేశాన్ని టెక్నికలర్ లో మనోయవనికపై చిత్రించుకుంటూ, కాలం గడపడానికే అతడు హాలులో కూర్చుంటాడు.
ఇలా ముళ్లపూడి కలంనుంచి కథ తర్వాత కగా వరుసగా ఎన్నో కథలు వెలువడ్డాయి. నాలాంటి కొందరు అతడిని మార్క్ ట్వేన్ ప్లస్ వుడ్‍హౌస్ అనిన్నీ హాస్యమూ ఇంటూ సెటైర్ డివైడెడ్ బై వర్డ్ పన్నింగ్ ఇజీక్వల్టు ముళ్లపూడి కథలు అనిన్నీ అనుకునేవారు, అనేవారు. ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలూ, ఏకలవ్యుడు, సెరిబ్రల్ సినేమియా, రాధా గోపాలం కథలు, ఋణానందలహరి, విక్రమార్కుడి మార్కు సింహాసనం, ఇంకా బోలెడు కథలూ 1950లలో ఆంధ్రవార పత్రికలో వెలువడి ముళ్లపూడిని అశేషపాఠకుల అభిమాన రచయితగా చేశాయి. రమణ రమణీయ రచలన్నిటిని బాపు అంతకంటే రమణీయమైన చిత్రాలతో అలంకరించేవాడు. జంటగా చేసిన ఈ కృషితో వీరిద్దరూ పాఠకులకు మరింతగా అభిమాన పాత్రులయ్యారు. నిజానికి ఆ రోజుల్లో (1950లలో) బాపు-రమణ అంటే పాఠకులకి చలనచిత్ర తారలంత గ్లామర్ ఉండేది.
ముళ్లపూడి ఆ రోజుల్లో ఆంధ్రవారపత్రికలో సినిమా శీర్షిక ఎడిటర్ గా వారం వారం చిత్ర సమీక్షలు వ్రాసేవార. ఎంత అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడు, నటి, నటుడు అయినా ముళ్లపూడి నిశిత విమర్శక దృష్టి నుంచి తప్పించుకునే వారు కాదు. అయితే ఆయన విమర్శ ధోరణి వేరు. అది గుచ్చుకునే విమర్శ కాదు. సరదాగా వేళాకోళం చేస్తూ సమీక్షించడం ఆయన పద్ధతి. ఆయన ఎవరిని వేళాకోళం చేసినా, వారే నవ్వుకొనే వారు. నిర్మాతలను, డైరెక్టర్లను సన్నిహితంగా స్టడీ చేసిన వాడైనందునే, వారి లోపాలను సెటైర్ చేస్తూ గిరీశం లెక్చర్లు లాంటి ఉత్తమ రచన చేయగలిగారు.
ఇలాగే సెటైర్ అనే అయుధాన్ని అవినీతిపరులు, వంచకలు అయిన రాజకీయవాదులపై విజయవంతంగా ప్రయోగిస్తూ ముళ్లపూడి చేసిన రాజకీయ భేతాళ పంచవింశతి. కాని, ముళ్లపూడి రచనలన్నింతికి తలమానికమైనది బుడుగు. చిచ్చరపిడుగులాంటి బుడుగును ప్రధాన పాత్రగా చేసి రాసిన కథలు ఆ రోజుల్లో పిల్లలను, పెద్దలను ఎంతగా ఉర్రూతలూగించాయో, ఎంతగా అలరించాయో చెప్పనలవి కాదు.
బుడుగు కాక, పాఠకుల మనస్సులలో కలకాలం నిలిచిపోయే పాత్రలను ఇంకా ఎన్నిటినో ముళ్లపూడి సృష్టించారు. రాధ, గోపాలం, (అప్పుల) అప్పారావు, వరహాల రాజు (సినేమియా వ్యాధిపీడితుడు), రెండు జెళ్ల సీత, బుడుగు బాబాయ్, లావుపాటి పక్కింటి పిన్నిగారు, సీగాన పెసూనంబ – ఇలా ఎందరో తెలుగు పాఠకుల నిత్య వ్యవహారంలో అభిమాన పాత్రలుగా నిలిచిపోయారు.
ముళ్లపూడి వారి అత్యుత్తమ కథగా “కానుక” ను పలువురు పేర్కొంటారు. అది గోపన్న అనే అమాయకుడైన ఒక ఆల కాపరి కథ. శ్రీ కృష్ణుని మీద అపార ప్రేమతో అతని పుట్టిన రోజు కానుకగా ఒక మంచి పిల్లన గ్రోవిని బహుకరించాలని గోపన్న తలపోస్తాడు. ఒక దాని తర్వాత ఒకటిగా పిల్లన గ్రోవులు తయారుచేస్తాడు. ఏదీ సంతృప్తికరంగా రాలేదు. ఎక్కడో ఏదో లోపం ప్రతిదానిలోను. సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీ కృష్ణునికి అలా అపశ్రుతులు పలికే పిల్లనగ్రోవి ని ఎలా బహుకరిస్తాడు? సంవత్సరాలు దొర్లిపోయాయి. గోపన్నకు వార్థక్యం వచ్చేస్తోంది. సత్తువ ఊడిగిపోతుంది. చివరికి నిస్సహాయుడై పోయి, ఏమీ చేయలేక, ఆఖరిసారిగా చేసిన పిల్లనగ్రోవిని కృష్ణుడికి కానుకగా పంపిస్తాడు. కృష్ణుడు ఆ కానుకను స్వీకరించి పిల్లనగ్రోవిని ఊదుతాడు. అతిలోక మనోహరమైన సంగీతం వెలువడుతుంది. ఆ సంగీత స్వరాలను అందుకుని, గోపన్న అంతవరకు ఏళ్ల తరబడిగా చెక్కి, అపశ్రుతులు పలుకుతున్నాయని పారేసిన వందలాది వేణువులన్నీ ఒక్కసారిగా శ్రుతిబద్ధంగా, సుస్వరాలను పలికించడం మొదలెడతాయి. చక్కగా ఒకదానితో ఒకటి సమన్వయమై అధ్బుతమైన దివ్య సంగీతాన్ని వినిపిస్తాయి. మానవునిలో ఎప్పుడైతే తనే కర్తననే అహంకారం నశించి, భగవంతుని పట్ల ప్రపత్తి పెరుగుతుందో అప్పుడు అతడి భక్తిని భగవంతుడు ఆమోదిస్తాడన్నమాట.
ఈ కథ గొప్పదే. కాని, నా దష్టిలో ముళ్లపూడి కథలన్నిటికి మకుటాయమైనది “మహారాజు-యువరాజు”. ఇందులో మహారాజు వివాహితుడు, నడి వయస్కుడు, చిరుద్యోగి. యువరాజు యువకుడు, అవివాహితుడు, నిరుద్యోగి. ఇరువురూ ఒక వృద్ధురాలి వద్దకు అప్పుకోసం వెడతారు. (ఆమె దాస్తొయేవెస్కీ “క్రైం అండ్ పనిష్‍మెంట్” లో రాస్కోల్నికోవ్ హత్య చేసిన తాకట్టు వ్యాపారస్తురాలి పాత్రను జ్ఞాపకం చేస్తుంది.) ఒకడు తన ఫౌంటెన్ పెన్ తాకట్టు పెడతాడు. రెండో వాడు ఒక ఇత్తడి పాత్రను తాకట్టు పెడతాడు. ఇద్దరికీ చెరొక రూపాయిన్నరా చేతిలో పెడుతుంది. చాలా రోజులుగా నిర్బధ నిరాహార దీక్షలో ఉన్న యువరాజు కడుపునిండా భోజనం చేయాలనుకుంటాడు. మహరాజు తనలాగే ఒక పూట తినీ, ఒక పూట తినకా, పస్తులుంటున్నభార్యాబిడ్డల కోసం కాస్త బియ్యం, ఉప్పు, పప్పులూ కొని ఇంటికి తీసుకుపోదామనుకుంటాడు. కాని చేతికందిన డబ్బుకాస్తా (యూజీన్ ఓనీల్ “లాంగ్ వాయేజ్ హోమ్” నాటకంలో నావికునికి జరిగినట్టు) అనవసరంగా, వృథాగా ఖర్చు అయిపోతుంది. పెద్ద పాము నోటిలో పడి మొదట బయలుదేరిన గడిలోకే ఇద్దరూ వస్తారు. యువకుడు తన గదికి పోయి, నడి వయస్కుడిని తలచుకుని “అతనికేం మహరాజు! ఇంటికెళ్ళే సరికి ఆప్యాయంగా స్వాగతం చెప్పడానికి పెళ్లాం బిడ్డలున్నారు. నాకెవరున్నారు?” అని అసూయపడతాడు. నడి వయస్కుడు చిన్నవాడిని తలచుకుని “అతనికేం బ్రహ్మచారి! ఉద్యోగం లేకపోయినా, డబ్బు లేకపోయినా పెళ్లాం బిడ్డల బాదరబందీ ఏం లేదు. హాయిగా ముసుగుపెట్టుకుని ముడుచుకుని పడుకుంటాడు” అని ఈర్ష్య పడతాడు. నిరుద్యోగి హాయిగా ఉన్నాడని చిరుద్యోగి, వివాతుడిదే సుఖమంటే అని బ్రహ్మచారీ భావిస్తారు. ఆ నిర్భాగ్యులిద్దరి ధౌర్భాగ్యపు బ్రతుకల్ని రచయిత ముళ్లపూడి ఎంతో హృదయంగమంగా చిత్రిస్తారు.
ఇలాంటి రచనలతో మన గొప్ప కథా రచయితల శ్రేణిలో సముచిత స్థానం సంపాదించుకున్న ముళ్లపూడి చలనచిత్ర రచనలోను, చిత్ర పరిశ్రమలోను కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకున్నారు. జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన ముళ్లపూడి జర్నలిస్టుగానే కొనసాగి ఉంటే, బహుశా ఏ అత్యధిక ప్రచారం గల వార పత్రికకో సంపాదకుడిగా పేరు తెచ్చుకుని ఊరుకునే వారు. కానీ 1960 లో ఆయన జీవితపథం ఒక మలుపు తిరిగింది. జర్నలిజం కంటే ఆకర్షణీయమైన సినిమారంగంలో ఆయన ప్రవేశించారు. మొదటగా డి.బి.నారాయణ గారు తమ “దాగుడు మూతలు” సినిమాకు సంభాషణల రచయితగా ముళ్లపూడిన బుక్ చేశారు. కాని ఆ తర్వాత ఆయన్ని చేసిన డూండి “రక్తసంబంధం” చిత్రం ముందుగా విడుదల అయింది. ఈ రెండు చిత్రాల తర్వాత ముళ్లపూడి ఇక వెనుదిరిగి చూడలేదు. ఒక దశలో కథ, సంభాషణల రచయితగా ముళ్లపూడి పట్ల నిర్మాతల మోజు ఇంతింతని చెప్పవీలులేనంతగా ఉండేది. అయితే ఆయన ఎప్పుడూ రెండు మూడు చిత్రాల కంటె ఎక్కువ ఒప్పుకునే వారు కాదు. వాటికి కూడా తీరుబడిగా పని చేసేవారు తప్ప హడావుడిగా గిలికెయ్యడం ఆయనకు చేతనయ్యేది కాదు. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి స్క్రిప్టు ని చిత్రిక పట్టడం ఆయన పద్ధతి. అందుకే సంభాషణల రచయితగా అరడజనుకు పైగా అవార్డులు సంపాదించుకున్నారు ఇన్నేళ్లలోను.
రచయితగా చిత్రరంగంలో ప్రవేశించిన కొద్ది సంవత్సరాలకే ముళ్లపూడి చిత్ర నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఆ రంగంలోకి ఆయనతోపాటు చిన్ననాటి స్నేహితుడు బాపు కూడా వచ్చి కలిశారు. వారి మొదటి చిత్రం “సాక్షి”. ఆ చిత్రంతో ప్రారంభించి చలన చిత్ర దర్శకుడుగా బాపు ప్రతిభా పారమ్యాన్ని ప్రదర్శించారు.
చిరకాలం జ్ఞాపకం పెట్టుకోదగిన మంచి చిత్రాలనేకం బాపు, రమణ నిర్మించారు. అన్నీ బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టాయని కాదు. ఆర్థికంగా విజయం పొందినవి, పొందనవి కూడా వారి చిత్రాల జాబితాలో ఉన్నాయి. కాని, ఎక్కువ భాగం చిత్రాలు వారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. వాటిలో “బుద్ధిమంతుడు” ఒకటి. ఆర్థిక విజం సంగతి ఎలా ఉన్నా వారి చిత్రాలలో పెక్కింటికి ప్రభుత్వ బహుమతో, ఆభిమానుల ఆదరణో విధిగా లభించింది. వారి “సీతా కళ్యాణం” చిత్రాన్ని సెల్యులాయిడ్ కవిత్వంగా పలువురు పరిగణించారు. లండన్ లో దాన్ని ప్రదర్శించినప్పుడు, సినీ క్రిటిక్స్ బహుధా మెచ్చుకున్నారు.
కాగా, దర్శకునిగా బాపు, రచయితగా రమణ అగ్రతమశ్రేణిని అందుకున్న చిత్రం “ముత్యాలముగ్గు”. ముఖ్యంగా ముళ్లపూడి సినీ జీవితంలో అదొక సువర్ణ ఘట్టం. ఎంతో భావుకత్వంతో కూడిన బాపు దర్శకత్వం, ముళ్లపూడి రసవంతమైన సంభాణలు దాన్ని తెలుగులోని అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా తీర్చిదిద్దాయి. కామెడీ, విలనీ కలగలిసిన కంట్రాక్టరు పాత్రలో ముళ్లపూడి సృజనాత్మకత పరవళ్ళు తొక్కింది. రావుగోపాలరావు ఆ పాత్రలో చూపిన నటనా ప్రతిభతో మన చిరస్మరణీయులైన చలనచిత్ర నటులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.
’పెళ్ళి పుస్తకం’, ’మిస్టర్ పెళ్ళాం’ వారి పూర్వ చిత్రాల కంటె భిన్నమైనవి. అవి ప్రేక్షకుల హృదయాలలో నవ్వుల పంట పండించిన చక్కని కామెడీలు. దర్శకత్వంలోను, రచనలోను ఒక సారళ్యం, సినీ మీడియం పై ఒక మాస్టరీ, పరవళ్ళు తొక్కే హాస్యం ఆ చిత్రాలలోని విశిష్ట లక్షణాలు. ఆ రెండింటికి రాష్ట్రంలోను, కేంద్రంలోను అవార్డులు లభించాయి.
బాపు, రమణల మైత్రి చిత్రమైనది. ఆరవై ఏళ్ళ పాటు సాగిన అవిచ్చిన్న స్రవంతి. ఒకరు మాటలతో ఇంద్రజాలం చేస్తే మరొకరు బొమ్మలతో మంత్రనగరం సృష్టిస్తారు. ఒకరు తన జీవితానుభవాల నుంచి మానవతావాదాన్ని కాచి వడబోసి అందించారు. రెండవవారు కొద్ది పాటి సుతారపు గీతలతో అతిలోక సౌందర్యం పండిస్తారు. ప్రవృత్తులలో వారు భిన్నధ్రువాలు. ఒకరిది జలపాతంలా హోరెత్తే ఉద్విగ్న ప్రకృతి. రెండవవారిది మైదానంలో ప్రశాంతంగా, గంభీరంగా ప్రవహించే నదిలాంటి స్వభావం. ఒకరిది తనకు నచ్చని వాటితో రాజీ పడలేని మనస్తత్వం. రెండవవారిది మానవుల ఔన్నత్యాలను. బలహీనతలను ఒకే విధంగా సాక్షి మాత్రంగా పరికించే సమ్యక దృష్టి. ఈ భిన్నత్వమే వారి చిరమైత్రిలోని ఏకత్వానికి ప్రాతిపదిక అయింది.

నండూరి రాంమోహన్ రావు
నేను చాలా రోజులుగా కష్టపడి చేస్తూ తయారు చేస్తూ వచ్చిన ”కొసరు కొమ్మచ్చి” పుస్తకం తయారై మార్కెట్లోకి వచ్చింది. ప్రింటు వెర్షన్‌ నవోదయా, హైదరాబాదు వారు పంపిణీ చేస్తూండగా, ఈ-బుక్స్‌, ఆన్‌లైన్‌ సేల్స్‌ కినిగె డాట్‌కామ్‌ వాళ్లు చూస్తున్నారు. ఈ పుస్తకం ఉద్దేశం ఏమిటో, దానికి నేను పడిన శ్రమ ఏమిటో పాఠకులతో పంచుకోవాలని, యీ క్రమంలో రమణగారి సాహిత్యం, వ్యక్తిత్వం గురించి తెలియనివారికి కాస్త పరిచయం చేద్దామని ఉద్దేశం. ముళ్లపూడి వెంకటరమణగారి ఆత్మకథ ”కోతి కొమ్మచ్చి” స్వాతి వీక్లీలో సీరియల్‌గా వచ్చి సంచలనం సృష్టించింది. దాన్ని మేం ”హాసం” బ్యానర్‌లో మూడు భాగాలుగా ప్రచురించాం. అంత రాసినా రమణగారు కొన్ని విషయాలు వదిలేశారు. (కారణాలేమిటో నా వ్యాసంలో రాశాను). వాటి గురించి రమణగారు పోయిన తర్వాత వాళ్లమ్మాయి అనూరాధ ”స్వాతి” వీక్లీకై ‘నాన్నా మామా మేము అను తోకకొమ్మచ్చి’ అనే వ్యాసంలో సరదాగా ప్రస్తావించారు –
”నేను… ముళ్లపూడిగారి అమ్మాయిని. నాన్న ఒక పుస్తకం రాశారు. ”కోతికొమ్మచ్చి”.
దానికి రెండు తోక కొమ్మచ్చిలు కూడా రాశారు. దాంట్లో నాన్న, మామ – అదే బాపుగారు- తీసిన సినిమాలు, కలిసిన నేస్తాలు, చేసిన అల్లర్లు, పాడిన రాగాలు… వీటి గురించి చాలానే రాశారు.
ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, సంజీవరెడ్డి, పి.వి.ఎన్‌.లాంటి పెద్దవారి దగ్గర్నించి, రోడ్‌సైడ్‌ బుక్‌సెల్లర్స్‌, లైట్‌బాయ్స్‌, వంటాళ్లు… అందరికీ స్పాట్‌లైట్‌ ఇచ్చారు.
”మరి మాకో?” అని మేము అడిగితే ”… అబ్బే, మన ఫ్యామిలీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సింది యేముందమ్మా… అందరి ఫ్యామిలీ లాగానే మనం కూడా..”
కావొచ్చు, కాని… మాలాంటి గ్రేట్‌ ఫెల్లోస్‌ గురించి కూడా చెప్తే ఇంకా బాగుంటుందేమో? అని అడిగాను…
రాస్తానమ్మా… ఇదిగో రాస్తున్నా… రాయాలా..! అని అడుగుతూనే వెళ్లిపోయారు… చెప్పకుండా మాయమైపోయారు…
రాముడి పనిపూర్తిచేశారుకాని… మరి నా పనో?
లోగడికి విష్ణుమూర్తి కల్లో కనిపించి, ఏం వరం కావాలో కోరుకోమంటే, మా నాన్నని ఓ రచయితని చేసెయ్‌, మిగతాది నేను చూస్కుంటా అన్నాను.
…. మరి, యేం చూస్కున్నా?? ఆయనని ఎంత వేడుకున్నా, మా ఫ్యామిలీ గురించి ఒక్క ముక్క రాయలేదు కదా… అందుకనే, తెగించేసి, నేను తెలుగూస్‌ అయినా కూడా, తెలుగులో కొన్ని నిజాలే రాసేయాలని సాహసించాను…” యిలా మొదలుపెట్టి బాపురమణల కుటుంబ విషయాలు కొన్ని రాశారు.
xxxxxx
మా హైదరాబాదు హాసం క్లబ్‌ 100 వ సమావేశం 2012 జూన్‌ 28 న జరిగింది. ఆ రోజు రమణగారి జయంతి. ఆ సందర్భంగా శ్రీ బివియస్‌ రామారావుగార్ని (‘సీతారాముడు’) గారిని సన్మానించాం. ఆయన రమణగారికి హైస్కూలు రోజుల్నుండి స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోను పాలుపంచుకున్నారు. మంచి రచయిత, సినిమా కళపై అవగాహన కలిగినవారు. ఆ సభలో మా వరప్రసాద్‌ (శాంతా బయోటెక్నిక్స్‌, ‘హాసం’) ప్రసంగం యిలా సాగింది –
”……..కోతికొమ్మచ్చి” సీరియల్‌ అర్ధాంతరంగా ముగిసిపోయిందని బాధపడిన పాఠకుల్లో నేనూ ఒకణ్ని. కంటిన్యూ చేయమని ఆయన్ని బతిమాలి, బామాలి, కోప్పడి, బుంగమూతి పెట్టి.. నానా రకాలుగా ఒత్తిడి చేశాం. ఆయన పోవడానికి మూడు రోజుల క్రితమే ఫోన్‌ చేసి అడిగాను – ”చెప్పాల్సినదెంతో వుంది కదా, చెప్పరేం..?, మీ ఆత్మకథలో మా గురించి కూడా చెప్తారని ఎదురుచూస్తున్నాం” అని కూడా అని చూశాను.
”మీ మీద ప్రేమ గుండెల్లో దాచుకున్నాను. దాన్ని కాగితంపై కక్కడానికి ఓపిక లేదు” అన్నారు.
బద్ధకిస్తున్నారేమో అనుకున్నాను. కానీ నిష్క్రమించాక నిజమే అని తెలిసింది… అలసిపోయారు. ఇక చాలనుకున్నారు.
కానీ అది మనకు చాలలేదు. నా సంగతి వదిలేయండి, ఆయన సంగతులే ఆయన చాలా చెప్పలేదు. సినిమాలు తగ్గిన థలో ”సాహితీసర్వస్వం” మార్కెట్‌లోకి వచ్చి అదరగొట్టింది. ”భాగవతం” టీవీ సీరియల్‌ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా ఆయన క్రియేటివిటీ తగ్గలేదు. ప్రజాదరణ కోల్పోలేదు. ఇవన్నీ చెప్పాలి కదా అని మన ఘోష. అప్పుడే కథానాయకుడికి న్యాయం చేసినట్టవుతుంది.
అందుకే ”కోతికొమ్మచ్చి”లో ఆయన వదిలేసిన విషయాలతో ”కొసరు కొమ్మచ్చి” తయారుచేయాలన్న ఊహ వచ్చింది. ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి, కుమారుడు వరా ముళ్లపూడి, కుమార్తె అనూరాధ రాయాలని…ఆయన సాహిత్యం గురించి ఎమ్బీయస్‌ ప్రసాద్‌ రాయాలని… ఇక ఆయన సినిమాల గురించి, టీవీ సీరియల్స్‌ గురించి రాయమని సీతారాముడుగారిని కోరాం. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాక రమణ రచన చేసిన సినిమాలన్నిటినీ చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు – అన్నిటితోనూ రచన చేస్తూ వాటిని తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించమని కోరాం. ఆ పుస్తకం త్వరలోనే విడుదల అవుతుంది…..”
xxxxxxx
”కొసరు కొమ్మచ్చి”కి బీజం అలా పడింది. రమణగారి భార్య శ్రీదేవి గారు నండూరి రామమోహనరావుగారి సోదరి. విచక్షణ గల పాఠకురాలు. ఆవిడ తన జ్ఞాపకాలను బ్లాగ్‌లో రాస్తున్నారు. వరా ముళ్లపూడి సినీదర్శకుడు. అనూరాధ కాపీ రైటర్‌. భర్తతో కలిసి అమెరికాలో యాడ్‌ ఏజన్సీ నడుపుతారు. సీతారాముడు గారు ఎంత మంచి రచయిత అంటే రమణగారు ఆయన పుస్తకానికి ముందుమాట రాస్తూ ‘వాణ్ని చూస్తే నాకు కుళ్లు’ అని రాశారు. వీరందరితో బాటు నేనూ ఓ వ్యాసం రాశాను. సమాచారం సేకరించడం కంటె ఫోటోలు సేకరణ, అమరిక పెద్ద యజ్ఞమే అయింది. కోతికొమ్మచ్చిలో వచ్చిన ఫోటోలు రిపీట్‌ చేయకూడదన్న పట్టుదలతో నేను బాపురమణల ఫ్యామిలీ ఫోటోలు వాళ్లను సతాయించి, సతాయించి సంపాదించాను. మన గురించి వద్దండి అంటారుగా వాళ్లు. అందుకని సతాయింపు అన్నమాట. అవి చూస్తే వాళ్ల కుటుంబాలు ఎలా పెనవేసుకుని పోయాయో వేరే ఎవరూ చెప్పనక్కరలేదన్నమాట.
ఇక పాత విజయచిత్రలు, సినిమారంగంలు సంపాదించి, వాటిలోని సినిమా స్టిల్స్‌ సేకరించి వేశాను. ”బంగారు పిచిక” సినిమాకు మొదట్లో ”స్వయంవరం” అనే పేరు పెట్టారన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. ఇప్పటిదాకా ఎవరూ ప్రస్తావించలేదు. అలాగే ”ఇంటి గౌరవం” సినిమా ఒరిజినల్‌ సినిమా పేరు.. యిలా చాలా, చాలా తెలిసి వచ్చాయి. అంతా చూసి బాపుగారు మెచ్చుకుని ‘మేమూ మా సినిమాలూ’ అని ముందుమాట చేర్చారు. అన్ని ఆర్టికల్స్‌కు డ్రాయింగ్స్‌ వేసిచ్చారు. నాబోటి అభిమానుల కడుపు నిండేలా పుస్తకాన్ని చాలా శ్రమ కోర్చి తయారుచేశాను. సీతారాముడు గారు రమణ స్కూలు రోజుల నుండి రాసుకుని వచ్చారు. అప్పట్లోనే ఆయన నిర్వహణాదక్షత ఎలా వుండేదో మనకు తెలుస్తుంది. అంతటితో ఆగలేదు, రమణగారి సినిమాల్లో వున్న లోపాలు, అవి ఎత్తి చూపితే రమణగారికి కోపం రావడాలు.. అన్నీ రాశారాయన. ఇంతకంటె ఎక్కువ చెపితే పుస్తకం అమ్మకాలు దెబ్బ తింటాయి కాబట్టి చెప్పను.
అయితే రమణగారి సాహిత్యం గురించి, నాతో ఆయన పరిచయం గురించి రాసినది మాత్రం పాఠకులతో పంచుకుంటాను. ఎందుకంటే యీ పుస్తకం చదివినా చదవకపోయినా రమణగారి సాహిత్యం మాత్రం చదివి తీరాల్సిందే. ఎందుకు చదివి తీరాలో, వాటిలో ఏముందో యీ వ్యాసం చెపుతుంది. 2011 ఫిబ్రవరిలో రమణగారు పోయినప్పుడు ‘ఒక అభిమాని ప్రస్థానం’ పేర నేను నివాళి రాశాను. అది చదివిన పాఠకులు 5 వ భాగం వరకు వదిలేయవచ్చు. అలాగే సినిమా డైలాగుల రచనలో రమణ శైలి గురించి నేను రాసిన వ్యాసం చదివినవారు మధ్యలో 13 వ భాగం వదిలేయవచ్చు. మొత్తం 16 భాగాలు చదివితే మాత్రం రమణగారి సాహిత్యం, వ్యక్తిత్వం రెండూ అర్థమవుతాయి. 

———–

You may also like...