కూచిమంచి జగ్గకవి (Kuchimanchi Jaggakavi)

Share
పేరు (ఆంగ్లం)Kuchimachi Jaggakavi
పేరు (తెలుగు)కూచిమంచి జగ్గకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుపిఠాపురం సమీపంలోని కందరాడ
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచంద్రలేఖా విలాసం, చంద్రలేఖా విలాపం, , రాధాకృష్ణ చరిత్ర, సుభద్రా పరిణయము,సోమదేవరాజీయము,పార్వతీ పరిణయము
ఇతర రచనలురామా భక్తమందారమా శతకము,నర్మదా పరిణయము
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకూచిమంచి జగ్గకవి
సంగ్రహ నమూనా రచన

కూచిమంచి జగ్గకవి

కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దపు కవి. పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామానికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవికి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్. చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. చింతలపాటి నీలాద్రిరాజు మీద మొదట చంద్రరేఖా విలాసం అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో చంద్రరేఖా విలాపం అనే కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ కవి వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. రామా! భక్తమందారమా! అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
మ. గడియల్ రెండిక సైచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా.
విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
ఎడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుండీ గతిన్
మడతల్ పల్కుచు త్రిప్పు కా సిడక రామా ! భక్తమందారమా !
ఈయన అన్న కూచిమంచి తిమ్మకవి నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్ అని ఇతడిని వర్ణించాడు.

———–

You may also like...