వక్కలంక వీరభద్రకవి (Vakkalanka Veerabhadrakavi)

Share
పేరు (ఆంగ్లం)Vakkalanka Veerabhadrakavi
పేరు (తెలుగు)వక్కలంక వీరభద్రకవి
కలం పేరు
తల్లిపేరుజగ్గాంబ
తండ్రి పేరుభాస్కరమంత్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకాళిదాస ‘కుమారసంభవము’ను నాలుగు ఆశ్వాసముల కావ్యముగా తెలుగులోనికి అనువదించారు,
సేతుఖండము’ అనే సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు,
వాసవదత్తా పరిణయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఏనుగు లక్ష్మణకవి ఇతనికి సమకాలీనుడు. ఇతడు మేనమామ వెణుతురుబల్లి వేంకటాద్రి వద్ద సంస్కృతాంధ్రాలలో సాహిత్యజ్ఞానాన్ని పొందాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవక్కలంక వీరభద్రకవి
సంగ్రహ నమూనా రచన

స్వీయచరిత్రము

మొదటిప్రకరణము  –   బాల్యదశ

భరతఖండమునందలి పురాతనము లయిన పట్టణములలో నొక్కటియయి, రాజరాజనరేంద్రాది చాళుక్య చక్రవర్తులకు రాజధాని యయి, ఆంధ్రకవితా కల్పలత కాలవాలమయి, నన్నయభట్టారకాది కవిగ్రామణులకు వాసభూమి యయి, గోదావరీతీరమునందు సర్వవిధముల బ్రసిద్ధికెక్కి యున్న రాజమహేంద్రవరమునందలి యస్మత్పితామహార్జితమైన స్వగృహమునందు కీలకనామ సంవత్సర చైత్రశుద్ధత్రయోదశీ భానువారమునాడు (అనగా క్రీస్తుశకము  1848 సంవత్సరం ఏప్రిల్ నెల  16 తేదిన) సూర్యోదయానంతరమున మూడుగడియలకు నేను జననమొందితిని. మా ఇల్లు  రాజమహేంద్రవరములో నున్న పెద్దయిండ్లలో ఒకటి. దానితో సమాన మయిన యిండ్లా పట్టణములో రెండుమూడికంటే నధికముగా లేకుండెను. నా పెదదండ్రిగారును, నేనును సమభాగాలుగా బంచుకొన్నను, నా పాలికి వచ్చిన యర్ధభాగమే రాజమహేంద్రవరములోని బహుగృహములకంటే మిక్కిలి పెద్దదిగాయున్నది. నేను జన్మించిన గది నా పాలికి వచ్చిన మేడయింటిలోనే యుండి నా యధీనములోనే యున్నది. గదికిని మా గృహములోని యొకచావడికిని నడుమ గల గోడను దీసివేసి యేకముగా నొక విశాల భోజనశాలను గా మార్చి మేమిప్పుడు దానిని  భోజనగృహముగా వాడుకొనుచున్నాము. నా రాజశేఖరచరిత్రము నందలి రాజశేఖరుడు గారి గృహవర్ణన యించుమించుగా మా గృహవర్ణనమే. పూర్వార్జితమైన యంత విశాలభవనమును గలిగియుండుటయే కొంతవరకు మా పూర్వులున్నతస్థితిలో  నున్నవారని తెలుప వచ్చును. గృహరాజమును గట్టించిన మా తాతగారు మహా సుప్రసిద్ధులయి కొంతకాలము సంస్థానాధిపతుల యొద్ద దివానుగా నుండిరి. మా పూర్వుల సహితము సంస్థానాధిపతులును  “దేశపాండ్యాలును నయి పెక్కు కావ్యములను ముఖ్యముగా శైవగ్రంధములను, గృతుల నందినవారయి యుండిరి. స్వయోగ్యత లేకయే పూర్వుల గొప్పతనమున బట్టి తమకు గౌరవము కలుగ వలయునని భావించెడు మనీషి కోటిలోని వాడను గాకపోవుటచేత వారియుత్కృష్టతను వర్ణించుటకు నేనిందు బ్రయత్నింపను. మా తాతగారగు వీరేశలింగముగారు మిగుల ధర్మాత్ములనియు, భూదానాదులు చేసి కీర్తివడసినవారనియు, చెప్పుట మాత్ర మిప్పటి కథాంశమునకు జాలియుండును. అయినను నాబుద్ధిచాపలమేమో కాని మాతాతగారి ఖ్యాతినిగూర్చి స్వానుభవము వలన నేనెరిగిన యొకచిన్న యంశము నిచ్చట సంక్షేపరూపమున నైనను జెప్ప మానజాలకున్నాను. ఇరువదైదుసంవత్సరముల ప్రాయమప్పుడు నేను ధవళేశ్వరములో నాంగ్లో దేశభాషా పాఠశాలకు బ్రధానోపాధ్యాయుడనుగా నుండి మండు వేసవికాలములో నా సహపాఠియు, బాల్యసఖుడును నగు నొక మిత్రుని జూచుటకయి కాకినాడకు బోయి యచ్చటి నుండి పడవలో నెక్కి మరల వచ్చుచుంటిని. అప్పుడు కాకినాడ కాలవలో దగినంత నీరులేదు. పడవవాండ్రు  ఎంతో ప్రయాస పడి మోకాలిలోతు నీటిలో పడవ నీడ్చుచుంటిరి.ఇట్లు పడవ మెల్లగా నొక గ్రామ సమీపమునకు వచ్చునప్పటికి మిట్టమధ్యాహ్నమయ్యెను; దుస్సహమయిన ఎండ వేడిమిచేత నిప్పులు చెరుగుచూ వడగాడ్పులు వెచ్చగా నొక చెవినుండి యొకచెవికి గొట్టుచుండెను; తీక్ష్ణాతపతాపముచే బడవలోనున్నవారికి తడియారి నోళ్ళెండుచుండెను; ఆకలికి దాళజాలక మలమలమాడుచు శిశువులు విలపింపజొచ్చ్చిరి; సాయంకాలమగునప్పటికిగాని పడవ ధవళేశ్వరము చేరునట్టు కనబడలేదు. ఇట్టిస్థితిలో బడవవాండ్రను బతిమాలుకోగా, వాండ్రు  గ్రామములోనికి బోయి భోజనము చేసి వచ్చువరకును పడవ నక్కడ కట్టిపెట్టి యుంచుట కొప్పుకొనిరి.

మా వారు నన్ను గారాబముతో బెంచి మొదటినుండియు పని చేయనీయకుండుటచే వ్యర్థుడనైన వాడనగుటచేత వంట చేసికొనుటయైనను నాకు జేత కాకుండెను. భోజనము పెట్టినచో దాను వంట చేసిపెట్టెద నని పడవలోని బ్రాహ్మణుడొకడు నాతో జెప్పెను. నేనా బ్రాహ్మణుని వెంటబెట్టుకుని నిప్పులు గురియుచున్న యాఎండలో పావుక్రోసుదూరంలోవున్న యా యూరికి నడిచి కరణముయొక్క యిల్లుచేరితిని. ఆయూరి పేరిప్పుడు జ్ఞప్తికి రాలేదు. ఆయూర నొక్క కరణము యొక్క యిల్లు దక్క , వేరు బ్రాహ్మణ గృహము లేదట. ఎండలో నెట్లో యాగృహమునకు దేహములు చేరవైచి, రామాయణ పారాయణము చేయుచున్న గృహపతిని జూచి భోజనార్థమై వచ్చితిమని చెప్పితిమి. వారియింట నింకను భోజనములు కాకపోయినను తాము డబ్బు పుచ్చుకుని యన్నము పెట్టువారము కామనియు, ఊరక పెట్టుటకు వలను పడదనియు, ధనము గైకొను భోజనము పెట్టు  పూటకూటియిల్లు తమ గ్రామమున లేదనియు చెప్పిశ్రీఘ్రముగా నింకొక యూరికి బొండని మాకాయన హితోపదేశము చేసెను. కోమటి యింటికి బోయి బియ్యము మొదలయినవి కొని తెచ్చుకొనెద మనియు, కొంచెము తావుచూపి పాకము చేసికొనుటకు పాత్రసామాగ్రియైన నియ్యవలసినదనియు మేమాగృహస్థుని వేడుకొంటిమి. అతడు వలసినచో మృణ్మయపాత్రములను దెచ్చుకొని యొకపంచను వంట చేసికొనవచ్చునని యనుజ్ఞ యిచ్చెను. అప్పుడేమి చేయుటకును తోచక యాలోచించుచున్న నన్నుజూచి, కుండలములు వేసికొని యొకపీటమీద గూరిచుండి వాల్మీకిరామాయణమున కర్థము చెప్పుచున్న యొకవృద్ధబ్రాహ్మణుడుమీయింటిపేరేమి?” అని యడిగెను. “కందుకూరివారుఅని బదులు చెప్పితిని. “మీపేరెవరు?” అని యాయన మరల ప్రశ్నవేసెను. నా పేరు చెప్పితిని. అప్పుడాయన మాతాతగారి పేరు చెప్పిమీకాయన బంధువులా?” అని యడిగెను. “ఆయన మా తాతగారేయని చుట్టరికమును దెలిపితిని. మాట వినగానే  యాయన పీటమీదనుండి లేచి నాకు పీట వేసి, యంతవరకును నిలబడియున్న నన్ను గూర్చుండ వేడికొని, గౌరవముచూపి, మా తాతగారిని బహువిధముల శ్లాఘించి తనకాయన మాన్యమిచ్చి సత్కరించిన వార్తను కరణముగారితో జెప్పెను. ఆయన తాను పారాయణముచేయుచుండిన రామాయణమును పీటపై బెట్టి తక్షణమే లొపలికి బోయి యేమేమో యేర్పాటుచేసి యయిదారు నిమిషములలో మరలవచ్చి, నాయెడల నతిమాత్రాదరమును జూపుచు దానెరుగక చేసిన యవజ్ఞను క్షమింపుమని నన్ను వేడుకొనెను. సంభాషణమునకు ఫలముగా మాకు గంట లోపలనే, కమ్మని యావునేతితోనూగట్టి పెరుగుతోను, రెండుకూరలతోనూ, పిండివంటలతోను సుఖభోజనము లభించెను. భోజనాంతరమున నేనా గృహపతికిముసలిబ్రాహ్మణునకు నమస్కారములు చేసి నా కృతజ్ఞతలు దెలిపి సెలవు గైకొనిపోయి పడవ యెక్కి సాయంకాలమునకు ధవళేశ్వరము చేరి గృహము ప్రవేశించితిని. నేను పుట్టుట కొక్క సంవత్సరము పూర్వమే లోకాంతరగతులగుట చేత నా తాతగారిని నేనెరుగక పోయినను, అటువంటి పితామహునకు బౌత్రుడనన్న గర్వమీవృత్తాంతము స్మరణకు వచ్చినప్పు డెల్ల నిప్పటికిని నామనస్సులో గలుగుచుండును.

నావివాహము మొదలైన శుభకార్యములకు ముందెల్లను నాపెదతండ్రిగారు నాజన్మపత్రమును  జ్యోతిష్కుల కెల్ల జూపుచు సుముహుర్తములు పెట్టించుచు వచ్చినను, జ్యోతిశ్శాస్త్రములోని ముహుర్తజాతక భాగముల యందలి నమ్మకము నాకు చిరకాలము క్రిందటనే చెడినందుకు నేను స్వతంత్రుడ నయినతరువాత నాజన్మపత్రమును జూచుటకయినను నేనెన్నడును బ్రయత్నము చేసియుండలేదు. నాజన్మపత్రిక నాయొద్దనున్నదని కూడా నేనెరుగకుంటిని. కొన్ని సంవత్సరముల క్రిందట నొక పనికయి మాయింటనున్న ప్రాత కాగితములను వెదుకుచుండగా నాపెదతండ్రిగారి మామగారయిన బుద్ధిరాజు కనకరాజుగారి చేత వ్రాయబడిన నా జన్మపత్రిక యొకటి యాకస్మికముగా నాకంటబడెను. దాని ఫలవి`షయమయి నాకెంత మాత్రమును విశ్వాసము లేకపోయినను సత్యాన్వేషుల విమర్శకయి యుపయోగపడవచ్చునని నా జాతకచక్రము నిందు బొందుపరుచుచున్నాను .

———–

You may also like...