మరింగంటి సింగరాచార్యులు (Mariganti Singaracharyulu)

Share
పేరు (ఆంగ్లం)Mariganti Singaraacharyulu
పేరు (తెలుగు)మరింగంటి సింగరాచార్యులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరువేంగళాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుతెలంగాణలోని నల్లగొండ జిల్లా, దేవరకొండ
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునిరోష్ఠ్య రామాయణం (దశరథరాజ నందన చరిత్రం), సీతాకళ్యాణం(శుద్ధాంధ్ర ప్రబంధం), తారకబ్రహ్మ రామ శతకం, రామకృష్ణ విజయం(ధ్వ్యర్థి కావ్యం), నలయాదవ రాఘవ పాండవీయం(చతుర్థీ కావ్యం), శ్రీరంగ శతకం.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుశతఘంటావధాని, అష్టభాషా కవితా విశారదుడు
ఇతర వివరాలుఈయన తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి ముత్యాలహారాలు, గుర్రాలు, మదపు వెల్లగొడుగులు, అగ్రహారాలు కానుకలుగా పొంది సత్కరింపబడ్డారు. దశరథరాజనందన చరిత్ర అను నిరోష్ఠ రామాయణం, సీతాకళ్యాణం ఇతని ముద్రిత రచనలు. తెలుగులో తొలి చతురర్థి కావ్యం నలరాఘవ యాదవ పాండవీయం వ్రాసింది ఈయనే. ఏక కాలంలో నాలుగు కథలను బోధించే ఈ కావ్యం ప్రస్తుతం అలభ్యం. తెలుగులో మొట్టమొదటి నిరోష్ఠ్య కావ్యము కూడా ఇతని ఖాతాలోకి చేరుతుంది. ఇతడు రచించిన దశరథరాజ నందన చరిత్ర తెలుగు సాహిత్యంలో వెలువడిన మొట్టమొదటి నిరోష్ఠ్య కావ్యముగా పరిశోధకులు నిర్ణయించారు. ఈయనే రచించిన బిల్హణీయము అనే మరొక కావ్యంలో చిత్రకవిత్వం, బంధ కవిత్వం కనిపిస్తుంది. ఇంకా ఇతడు రామకృష్ణ విజయము అనే ద్వ్యర్థికావ్యాన్నీ, అనేక శతకాలను రచించాడు. ఈయన జీవితకాలము క్రీ.శ.1520-1590[4] అని మరింగంటి కవుల సాహిత్యసేవపై పరిశోధన కావించిన శ్రీరంగాచార్య నిర్ధారించారు. సింగరాచార్యులు అష్టభాషాప్రవీణుడు.తన సోదరుడు మరింగంటి జగన్నాథాచార్యులతో కలిసి జంటగా శతావధానాలు చేసెడివారు. ఈయన అబ్దుల్ కరీం, ఇబ్రహీం కుతుబ్‌షాల ఆస్థానములో కవిగా ఆశ్రయం పొందారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమరింగంటి సింగరాచార్యులు
సంగ్రహ నమూనా రచనకరకాచ్ఛిన్న దిగంత శాఖియయి నిర్ఘాతాహతాంగాళియై
హరినాగేంద్ర కరాతి చండ శర ధారాశ్లేష శేషాహి శే
ఖర గండస్థలియై ఘనాఘన తటిద్గర్జాతిరేక స్థితిన్
ధర యెల్లం జడి నిండసాగె జన చింతా కారణ స్థానియై

మరింగంటి సింగరాచార్యులు

 

కరకాచ్ఛిన్న దిగంత శాఖియయి నిర్ఘాతాహతాంగాళియై
హరినాగేంద్ర కరాతి చండ శర ధారాశ్లేష శేషాహి శే
ఖర గండస్థలియై ఘనాఘన తటిద్గర్జాతిరేక స్థితిన్
ధర యెల్లం జడి నిండసాగె జన చింతా కారణ స్థానియై

సురలను దోడుకొంచు నరిసూదనుఁడై తనరారు నిందిరా
ధరుఁడు చెలంగు నీరనిధి తట్టున కేగి నుతించు చుండఁగా
నెఱిఁగి సరోజ లోచనుఁడు నీ సురలుండిన చెంత కేగు దెం
చి రహిని నిల్చినన్ నతిని జేసిరి నిర్జరు లెల్ల నంతటన్!

(దశరథ రాజ నందన చరిత్ర కావ్యం నుండి)

తెలియక లెస్స సందె తఱి దీర్చఁగ నేఱక ఆకలాన నా
కలి యడిగించ నేఱ గెద గాడిన కాకల నాలి జాలిచే
నిలిచిన దారి నిల్చి గన నేఱక నల్కత లింత లేక చెం
తలఁ దిరగాడ సాగె జడదారియ గారెసరేగి డిందఁగన్

జిగి చన్గట్టసియాడ, తీఱయిన లేచెక్కిళ్ళ చక్కి న్నిగ
న్నిగ లీనంగ, కడాని కంటి సిరి డాల్నిండంగ, కై చిన్నియల్
తెగలై నల్దిస లాని చక్కఁగ చికిల్సేయ, న్నెరా సిగ్గెదం
దగలన్ రానెలఁ జేరి కాళ్ళకడ చెంతన్ సాగిలె న్నాతి దాన్!

( శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతా కళ్యాణము నుండి)

దివిజార్యగ్రణి పర్ణశాలకడ కేతేరన్ కృశానుండు గాం
చి వడిం జానకి నాత్మ భార్యల కడన్ శేష స్థలిం దాచి వే
దవతిం గల్పన చేయువాడుగొని సంథన్ లంకకుం బోవు లా
గవితానస్థితి నీదు కీలగు నయోధ్యా రామ! సీతాపతీ!

తన చే నంటిన బ్రహ్మహత్య విడ యత్నం జేమిటన్ లేని రు
ద్రుని సేతు క్షితి రావణార్థము జడాత్ముల్ నిల్పినా రందు రా
వన భూమీ స్థిత మౌని యోషితతి తీవ్ర క్రోధ వాక్యాను వ
ర్తన రూపంబని కాన రేమియు నయోధ్యా రామ! సీతాపతీ!

(తారక బ్రహ్మ రామ శతకము నుండి)

———–

You may also like...