పేరు (ఆంగ్లం) | Mallampalli Somashekhara Sharma |
పేరు (తెలుగు) | మల్లంపల్లి సోమశేఖర శర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/24/1891 |
మరణం | 1/7/1963 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని మినిమించిలిపాడు |
విద్యార్హతలు | మెట్రిక్యులేషన్ |
వృత్తి | పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అమరావతి స్తూపము, నా నెల్లూరు జిల్లా పర్యటన – శాసనాన్వేషణా యాత్రలలో ఎదుర్కొన్న సమస్యలు, కష్ట నష్టాలు, ప్రజల నమ్మకాలు గురించి, సోమశేఖర శర్మ విరచితము – ఆంధ్రవీరులు – 1920, రాగతరంగిణి – విచారకరమైన చిన్న కథ – 1916 , విజయ తోరణము – రేడియో నాటికలు, ఆంధ్ర సంస్కృతి తరంగిణి (Archaeological series) – 1976, ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము , రెడ్డి రాజ్యాల చరిత్ర (‘హిస్టరీ ఆఫ్ రెడ్డీ కింగ్డమ్స్’ ఆంగ్ల రచనకు ఆర్.వెంకటేశ్వరరావు తెలుగు అనువాదం), బౌద్ధ యుగము అంశంపై ఆయన రాసిన వ్యాసాలను చారిత్రకవ్యాసములు పుస్తకం రూపంలో 1944లో ప్రచురించారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవాడు. అహదహనకర శాసనంలోని ఒక అక్షరాన్ని శర్మ “ఱ”గా గుర్తించగా వేటూరి ప్రభాకర శాస్త్రి దానిని “ష+జ” (‘ష’ క్రింద ‘జ’ వత్తు) అని అన్నాడు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి. అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుఖోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవాడు. లిపి శాస్త్రంలోనే గాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతుడు. అమరావతీ స్తూపము అన్న అతని రచన ఇందుకు తార్కాణము. మొగల్రాజపురంలోని దుర్గ గుహలో మూలవిరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధ నారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించాడు. . కాకతీయులు అన్నా, తెలంగాణమన్నా శర్మకు ప్రత్యేక అభిమానం. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తెలుగు దేశ చరిత్ర |
సంగ్రహ నమూనా రచన | – |