పేరు (ఆంగ్లం) | Paranandi Jagannadhaswamy |
పేరు (తెలుగు) | పారనంది జగన్నాధస్వామి |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకట మహాలక్ష్మి |
తండ్రి పేరు | రామశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/11/1886 |
మరణం | – |
పుట్టిన ఊరు | శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామం |
విద్యార్హతలు | ఎం.ఏ. |
వృత్తి | ప్రధానోపాధ్యాయులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మనశ్శరీరాలపై పరిసరాల ప్రభావం, దేశభక్తి, విష్ణు పురాణం, ఆత్మ జిజ్ఞాస, సావిత్రి, సముజ్వాలాన, సుధాశ్రీ, వెల్ఫేర్ ఇన్ ఇంసియంట్ ఇండియా |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పారనంది జగన్నాధస్వామి |
సంగ్రహ నమూనా రచన | – |
పారనంది జగన్నాధస్వామి
పారనంది జగన్నాధ స్వామి ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు నాటక కర్త.
వీరు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి మరియు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరు తండ్రి వద్దనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. విజయనగరం మహారాజా కళాశాల నుండి పట్టా అందుకున్నారు. కలకత్తాలో ఎం.ఏ. పూర్తిచేశారు.
వీరు కొంతకాలం పర్లాకిమిడి కళాశాలలో లాజిక్ లెక్చరర్ గా, అనంతరం ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు.
వీరు ఆంధ్రపత్రిక దినపత్రికలో వారం వారం “కలగూరగంప” శీర్షిక ద్వారా ఎన్నో మనోవైజ్ఞానిక వ్యాసాలు చదువరులకు అందించారు. అలాగే “వాసనలు” పేరుతో మానసిక విజ్ఞాన సంబంధ వ్యాసాలు వ్రాశారు.
———–