ఐ.వి.చలపతిరావు (I.V.Chalapatirao)

Share
పేరు (ఆంగ్లం)I.V.Chalapatirao
పేరు (తెలుగు)ఐ.వి.చలపతిరావు
కలం పేరు
తల్లిపేరుదమయంతి
తండ్రి పేరుకృష్ణారావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ04/25/1923
మరణం04/27/2016
పుట్టిన ఊరుకాకినాడ పట్టణంలో గల పిఠాపురం
విద్యార్హతలుఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏ
వృత్తికళాశాలల్లో ఆంగ్లోవన్యాసకుడుగా ప్రిన్సిపాల్ గా పనిచేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమహాత్మాగాంధీ, శంకరాచార్య ధ్వన్యనుకరణ సమ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్, హర రాష్ట్రపతి- నీలం సంజీవరెడ్డి తదితర ప్రముఖుల జీవిత చరిత్రలు
స్వీయ జీవిత చరిత్ర వాట్ లైఫ్ టాట్ మి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు2010 లో, విద్యారంగంలో విశేష సేవలందించినందుకు గాను ముఖ్యమంత్రి రోశయ్య చేతులమిదుగా “ప్రతిభా రాజీవ్ పురస్కారం”
1992 లో అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు గారి చేతులమీదుగా సత్కారం.
1981 లో టి.అంజయ్య చేత, 1984 మరియు 1987 లలో ఎన్.టి. రామారావు చేతులమీదుగా సత్కారాలు.
1989 లో కుముద్‌బిన్ జోషి, 1990లో కృష్ణకాంత్ చేతులమీదుగా, మరియు 1998 లో రఘునాథరెడ్డి ద్వారా సత్కారాలు పొందారు.
ఇతర వివరాలుఅయ్యంకి వెంకట చలపతి రావు; (ఐ.వి.చలపతిరావు గా సుప్రసిద్ధులు) భారతీయ విద్యావేత్త, వక్త, ఉపాధ్యాయులు మరియు సంపాదకులు. ఆయన విద్య, సమాచార రంగం, మేనేజిమెంటు మరియు జీవితచరిత్రల గురించి 25 పుస్తకాలను వ్రాసారు. ఆయన సుమారు వంద పుస్తకాలకు ముందుమాట మరియు సమీక్షలను వ్రాసారు. ఆయన ఆంగ్లం మరియు తెలుగు రచయితగా సుప్రసిద్ధులు.

ఆయన దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలకు, జాతీయ శిక్షణా సంస్థలకు మరియు అకడమిక్ స్టాఫ్ కళాశాలలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన కమ్యూనికేషన్స్ స్కిల్స్, భారతీయ సంస్కృతి, జీవితావసరాల గురించి, పర్సనాలిటీ డెవలెప్ మెంటు కు సంబంధించిన అంశాలలో విశేష ప్రతిభావంతులు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఐ.వి.చలపతిరావు
సంగ్రహ నమూనా రచన

ఐ.వి.చలపతిరావు

కరీంనగర్‌ శ్రీరాజరాజేశ్వరీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స కళాశాలకు సుప్రసిద్ధ కవి – విశ్వనాథ సత్యనారాయణ తర్వాత ప్రిన్సిపాల్‌గా వచ్చి చలపతిరావు తన ముద్ర వేశారు. వారి ఆంగ్ల ప్రసంగం విన్నవారెవ్వరూ ఆయనను ఏనాటికీ మరచిపోలేరు. అది వారి ప్రతిభకు మచ్చుతునక.

ఆయన గురువులకు గురువు. వాస్తవానికి ఆయన మహామహోపాధ్యాయుడు, గొప్ప వక్త, రచయిత, అనువాదకుడు, విద్యావేత్త, పాలనాదక్షుడు, శిష్య వర్గానికి ఆయన ఆదర్శనీయుడైన నమూనా. ఆయన ఇంగ్లీషు నుడికారానికి, సరళ సుందరమైన, స్ఫూర్తిదాయకమైన
వాగ్దాటి వలలో పడిపోనివారు అరుదు. ఆయన ప్రత్యక్ష శిష్యులెందరో వివిధ విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్లు, వైస్‌ ఛాన్సలర్లు, వివిధ శాఖల ఉన్నతాధికార్లు, గవర్నర్లు కావడం పచ్చి నిజం. ఇంతటి వైశిష్ట్యం, స్ఫూర్తిదాయకమైన ఆయన అసలు పేరు – అయ్యంకి వెంకట చలపతిరావు. రెండు తెలుగు రాష్ర్టాల్లో, మేధావులు, విద్యావేత్తలు, రచయితలలో ఐ.వి. చలపతిరావుగా వారు సుప్రసిద్ధులు.
1923 ఏప్రిల్‌ 25వ తేదీన అయ్యంకి వెంకట కృష్ణారావు – దమయంతి దంపతులకు జన్మించిన చలపతిరావు తన తొంభై మూడేండ్ల నిండు జీవితాన్ని 2016, ఏప్రిల్‌ 27న మిట్టమధ్యాహ్నం చాలించారు. వారి అంత్యక్రియలు ఏప్రిల్‌ 28న జరిగాయి.

ఏడాది క్రితం స్నానాల గదిలో జారిపడిపోయినప్పటి నుంచి సభలు-సమావేశాల్లో ఆయన పాల్గొనలేకపోయారు. మహాత్మాగాంధీ అభిమాన పత్రిక మాత్రమే కాకుండా ఇంగ్లీషు సాహిత్య ప్రపంచంలో చెప్పుకోదగిన ప్రసిద్ధ త్రైమాసిక పత్రిక ‘‘త్రివేణి’’కి వారు చీఫ్‌ ఎడిటర్‌గా సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నారు. వయోధికుల కోసం ప్రచురిస్తున్న ‘‘ట్విలైట్‌ లైఫ్‌’’ మాసపత్రికను చలపతిరావు ఈ వయస్సులోనూ ఎడిట్‌ చేస్తూనే ఉన్నారు. ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏను నాగపూర్‌ విశ్వవిద్యాలయంలో చదివి 1946లో చలపతిరావు డిస్టింక్షనలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం నాగపూర్‌ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో ఆంగ్లోపన్యాసకుడుగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కరీంనగర్‌ శ్రీరాజరాజేశ్వరీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స కళాశాలకు సుప్రసిద్ధ కవి – విశ్వనాథ సత్యనారాయణ తర్వాత ప్రిన్సిపాల్‌గా వచ్చి చలపతిరావు తన ముద్ర వేశారు. వారి ఆంగ్ల ప్రసంగం విన్నవారెవ్వరూ ఆయనను ఏనాటికీ మరచిపోలేరు. అది వారి ప్రతిభకు మచ్చుతునక.

పిదప కొంతకాలం పబ్లిక్‌ ఇనస్ట్రక్షన డిప్యూటీ డైరెక్టర్‌గా, ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా, కాలేజియేట్‌ సెల్‌ ప్రధానాధికారిగా, రాష్ట్ర విద్యా పరిశోధన – శిక్షణా మండలి ప్రొఫెసర్‌, డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీయ విమానయాన శిక్షణా సంస్థ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అకాడమీ, భారత డైనమిక్‌ లిమిటెడ్‌, సర్వే ఆఫ్‌ ఇండియా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, విజయ ఎలక్ర్టికల్స్‌, రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఎనసీఈఆర్‌టీ (ఢిల్లీ), హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం వారి ఎకాడెమిక్‌ స్టాఫ్‌ కాలేజీలు, ఉస్మానియా, శ్రీవెంకటేశ్వర, ఆంధ్ర, జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు, మరికొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు, సంస్థల నిర్వహణ, శిక్షణకు సంబంధించిన నిపుణుడుగా, మేధావిగా, బోధకుడుగా వీరు అగణిత సేవలందించారు.

1978లో ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆచార్య ఐ.వి. చలపతిరావు ఇంగ్లీషు – ఫారిన లాంగ్వేజెస్‌ సెంట్రల్‌ ఇనస్టిట్యూట్‌ (సీఫెల్‌) రిజిస్ర్టార్‌గా, భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం సమన్వయకర్తగా పనిచేశారు. అంతేకాకుండా నూపోర్ట్‌ విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ ఉన్నత విద్యా కమిషనరేట్‌ కన్సల్టెంట్‌గా, ఆంధ్రప్రదేశ ఉన్నత విద్యామండలి సభ్యకార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలి దాకా ఉన్నత విద్యావేదిక అధ్యక్షులుగా కొనసాగారు.
మహాత్మాగాంధీని స్వయంగా కలుసుకుని స్ఫూర్తిపొందిన చలపతిరావు సాధారణ జీవితం గడుపుతూ, అసాధరణ చింతనాపరుడుగా, జీవిత చరిత్రకారుడుగా రూపొందాడు. భారతీయ చింతనను, సంస్కృతిని ప్రస్ఫుటం చేసే మహనీయులు, దేశభక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఇతర రంగాల తేజోమూర్తుల జీవిత చరిత్రలు ఇంగ్లీషులో రాసి, బయటి ప్రపంచానికి భారతీయులు, తెలుగువారి ప్రతిభా విశేషాలను చాటారు.
ముఖ్యంగా వీరు రచించిన మహాత్మాగాంధీ, శంకరాచార్య, ధ్వన్యనుకరణ సమ్రాట్‌ నేరెళ్ళ వేణుమాధవ్‌, పూర్వ రాష్ట్రపతి- నీలం సంజీవరెడ్డి తదితర ప్రముఖుల జీవిత చరిత్రలు చెప్పుకోదగినవి.

‘‘కల్చర్‌ క్యాప్సూల్స్‌’’ శీర్షికన ‘‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’’, కాలేజీ టీచర్స్‌, అడ్మినిస్ర్టేటర్స్‌ – హ్యాండ్‌బుక్‌, ఇండియన రినెజాన్స, ఏన్షియంట్‌ విజ్‌డమ్‌- మోడ్రన ఇనసైట్స్‌, గోల్డెన హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియన కల్చర్‌, లివింగ్‌ త్రూ ఛేంజింగ్‌ టైమ్స్‌, సంస్కృతి సౌరభాలు, జీవన సౌందర్యం ఇత్యాది డజను ప్రామాణిక గ్రంథాలు రచించారు. స్వీయ జీవిత చరిత్ర ‘వాట్‌ లైఫ్‌ టాట్‌ మి’ కూడా వీరు రాసుకుని ముందుతరాలకు అందించారు.

టి. ఉడయవర్లు
సీనియర్‌ జర్నలిస్ట్‌

———–

You may also like...