పేరు (ఆంగ్లం) | Ghandikota Brahmajirao |
పేరు (తెలుగు) | ఘండికోట బ్రహ్మాజీరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | మొదటి తరగతి గెజెటెడ్ ఆఫీసరుగా రైల్వే, 1980వరకు వర్క్స్ మేనేజరుగా ఖర్గ్ పూర్ లో Technical School Principal హల్దియా పోర్ట్ లో స్పెషల్ ఆఫీసరుగా ఒక సంవత్సరం |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పరుగిలిడే చక్రాలు, ప్రవహించే జీవవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, ఒక దీపం వెలిగింది , విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండి అంచు ప్రేమమూర్తి, రాగలత, గులాబీముళ్ళు, డాక్టర్ భాయి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఘండికోట బ్రహ్మాజీరావు |
సంగ్రహ నమూనా రచన | – |
ఘండికోట బ్రహ్మాజీరావు
సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పనాలుగా నిలుస్తాయి. ఈ మహా రచయిత ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న పొందూరు భ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబరు 23 1922 లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విధ్యను పూర్తిచేశారు. తన 16 యేళ్ళ వయస్సు నుంచే కలం ఝళిపించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతంభాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఈయన పశ్చిమ బెంగాల్ లో రైల్వే విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. 1980 లో పదవీ విరమణ చేసిన తరువాత హాల్డియా ఫోర్డ్ లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు. ఈయన 10కి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంధాలకు అనువాదం చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేసిన ఆయన సాహితీ సేవ చేశారు. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాన్ని జమిలి ముద్రణలో అందించారు.
ఘండికోట పేరు చెప్పగానే శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్ చప్పున స్ఫురిస్తాయి. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథా, నవలా రచయిత ఘండికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులిడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండి అంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీముళ్ళు, డాక్టర్ భాయి వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలికథ 1941లో ప్రజాబంధులో వచ్చిన ‘రాఘవయ్య’తో సాహితీ యాత్ర ఆరంభించారు. ‘ఒక దీపం వెలిగింది’ నవల సినీద్వయం బాపు-రమణల నేతృత్వంలో ‘గోరంత దీపం’ సినిమాగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్‌ను వేయిన్నొక్క రాత్రులు పేరుతో, తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం (6 భాగాలు) వెలువరించారు.
———–