ఎస్.వి.భుజంగరాయశర్మ (S.V.Bhujngaraya Sharma)

Share
పేరు (ఆంగ్లం)S.V.Bhujangaraya Sharma
పేరు (తెలుగు)ఎస్.వి.భుజంగరాయశర్మ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/05/1925
మరణం
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా, కొల్లూరు
విద్యార్హతలుబి.ఎ.(ఆనర్సు)
వృత్తివిశ్వోదయ’ కాలేజీలో తెలుగువిభాగం అధిపతిగా, ఆ తరువాత ప్రిన్సిపాల్‌గా పనిచేశా
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిధి వంచిత ద్రౌపది’ అనే వ్యాసం,
రంగులరాట్నం, ఎర్రమల్లెలు మొదలైన సినిమాలకు గీతాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఎస్.వి.భుజంగరాయశర్మ
సంగ్రహ నమూనా రచన

ఎస్‌.వి.భుజంగరాయశర్మ

ఈయన 1925, డిసెంబరు 15వ తేదీన గుంటూరు జిల్లా, కొల్లూరు గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్య, సెకండరీ విద్య కొల్లూరులో ముగిసింది. తరువాత నెల్లూరులోని వెంకటగిరిరాజావారి కళాశాలలో ఇంటర్‌మీడియెట్ చదివారు. ఇంటర్‌మీడియెట్ పరీక్ష్ ఉత్తీర్ణుడయ్యాక వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు అభిమాన విషయంగా బి.ఎ.(ఆనర్సు)లో చేరి డిగ్రీని పొందారు. ఈయనకి ఏటుకూరి వెంకట నరసయ్య, పింగళి లక్ష్మీకాంతం, దువ్వూరి వెంకటరమణశాస్త్రి గురువులు.
ఆనర్స్ డిగ్రీ సంపాదించిన తరువాత కొంత కాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. పిమ్మట తన మిత్రుడైన దొడ్ల రామచంద్రారెడ్డిని ప్రోత్సహించి కావలిలో 1951లో ‘విశ్వోదయ’ విద్యా సాంస్కృతిక సేవా సంస్థ స్థాపింపచేశారు. ఆ సంస్థ తరఫున నడిచిన ‘విశ్వోదయ’ కాలేజీలో తెలుగువిభాగం అధిపతిగా, ఆ తరువాత ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ కళాశాల లోగోను ఈయనే సృష్టించారు. కళాశాల ప్రార్థనాగీతం కూడా ఈయనే వ్రాశారు. ఆచార్య జి.ఎన్.రెడ్డి, వకుళాభరణం రామకృష్ణ మొదలైన వారు ఈయన శిష్యులలో కొందరు. ఈయన అధికార భాషా సంఘం సభ్యుడిగా వ్యవహరించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయనమండలి చైర్మన్‌గా కూడా సేవలనందించారు.ఈయనని ఆ విశ్వవిద్యాలయం డి.లిట్‌తో సత్కరించింది.
యూనివర్సిటీలో చదువుకునే రోజులలో eeyana అనేక నాటకాలలో వేషాలు వేశారు. ముద్దుకృష్ణ రచించిన అశోకం నాటకంలో ప్రధానపాత్ర, అనార్కలి నాటకంలో సలీం, విశ్వంభరనాటకంలో ప్రధాన పాత్ర, మెక్‌బెత్ నాటకంలో మెక్‌బెత్ పాత్ర ఈయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈయన రచించిన అనేక నృత్య రూపకాలను వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యబృందం దేశ విదేశాల్లో ప్రదర్శించింది. అప్పుడు ఆ బృందంతో పాటు ఇతడు కూడా అమెరికాలో పర్యటించారు. పట్రాయని సంగీతరావు, వెంపటి చినసత్యంలతో కలిసి కూచిపూడిత్రయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారు ముగ్గురూ కలిసి రాసిన శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, కల్యాణ శాకుంతలం, శ్రీనివాస కల్యాణం,కళ్యాణ రుక్మిణి వంటి నృత్యరూపకాలు పేరుగాంచాయి. ఇవి ఆధునిక యక్షగానాలుగా పేరుపొందాయి.
ఎవరూ ఇంతవరకూ దృష్టి పెట్టడానికి సాహసించని పరిశోధనాత్మక అంశాలను ఎంచుకోవడం భుజంగరాయశర్మ గొప్పతనం. ఇవి చాలా చిన్న అంశాలుగా పైకి కనిపించినా వీటికి పరిశోధన, అధ్యయనం ఎక్కువగా అవసరమవుతాయి. ఉదాహరణకు, ఒక భర్తను అర్థం చేసుకోవడమే కష్టసాధ్యమైన పరిస్థితిలో ద్రౌపది ఏకంగా అయిదుగురు భర్తలను ఎలా అర్థం చేసుకుందన్నది ఎవరికైనా ఆసక్తికరమే. ఈయన తన ‘విధి వంచిత ద్రౌపది’ అనే వ్యాసంలో ద్రౌపది మనోగతాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. అదే విధంగా ఇతడు శకుంతల, సత్యభామ, రాధ వంటి పాత్రలను కూడా విభిన్న కోణాల నుంచి విశ్లేషించారు. ఈ నాయికల బాహ్య సౌందర్యం గురించి కాకుండా వారి అంతస్సౌందర్యానికి ఈయన పెద్దపీట వేశారు. ఇక ఊర్వశి పాత్ర గురించి కూడా శర్మ అద్భుత విశ్లేషణ జరిపారు. పురాణ కథల్లో ఊర్వశి పాత్రను చిత్రీకరించిన తీరు నుంచి ఇటీవల రవీంద్రుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చలం వంటి వారు మలచిన తీరు వరకూ ఆయన వివిధ కవుల, భావ కవుల ఊర్వశి చిత్రీకరణను తన ‘సాహిత్యోర్వశి’ వ్యాసంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే ఆమె ఏ విధంగా స్త్రీపురుషుల మధ్య తరగని ఆకర్షణకు, కరగని అనురాగానికి ప్రతిరూపంగా నిలిచిందో చక్కని పదజాలంలో వివరించారు. ఈయన వ్రాసిన కవితా వాల్మీకం, తిక్కన్నగారివి సూర్యోదయాలు రెండు, నన్నయ్యగారి నాటకీయత, చిత్రాంగి, సత్య, ఆత్రేయపద్యకవిత, కృష్ణశాస్త్రి, ఆచంట శారదాదేవిగారి వానజల్లు వంటి వ్యాసాలన్నీ పాఠకులను, పరిశోధనాభిలాషులను ఓ కొత్త, వినూత్న తెలుగు సాహితీ ప్రపంచంలోకి తీసుకువెడతాయి. ఇతడు రంగులరాట్నం, ఎర్రమల్లెలు మొదలైన సినిమాలకు గీతాలను వ్రాశాడు. ఈయన రచనలన్నీ రెండు సంపుటాలలో వెలువడినాయి.

స్వాభిమానం.. దర్పం.. ఆధిపత్యభావం సమ్మిళితమైన సత్యభామ కోపతాపాలు, రుక్మిణిలోని నిజమైన భక్తిభావాల కలయికతో ప్రదర్శితమైన ‘శ్రీకృష్ణపారిజాతం’ నృత్యరూపకం ఆద్యంతం నవరసభరితంగా సాగింది. కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ సాంస్కృతికోత్సవాల్లో భాగంగా ప్రముఖ నాట్యగురువు డా.కె.శోభానాయుడు, తన శిష్యులతో కలిసి రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటసాల కళావేదికపై ఈ నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సత్యభామగా ప్రముఖ నాట్యగురువు డా.కె.శోభానాయుడు, కృష్ణుడుగా సుజాతామూర్తి, రుక్మిణిగా ఓలేటి హైమవతి, నారదుడిగా సాగరిక నల్లు అద్భుతంగా అభినయించారు. నృత్యరూపకాన్ని ఎస్‌.వి.భుజంగరాయశర్మ రచించగా, బి.మల్లిక్‌, ద్వారం భావనారాయణ సంగీతాన్ని అందించారు.

———–

You may also like...