పేరు (ఆంగ్లం) | S.T.Gyanananda Kavi |
పేరు (తెలుగు) | ఎస్. టి. జ్ఞానానంద కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | పాపమ్మ |
తండ్రి పేరు | సురగాలి ఎల్లయ్య |
జీవిత భాగస్వామి పేరు | సుగుణ మణి |
పుట్టినతేదీ | 07/16/1922 |
మరణం | 01/06/2011 |
పుట్టిన ఊరు | విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకి గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వసంతగానం (1947), గాంధీ (1950), దేశబంధు, పాంచజన్యము (1956), ప్రభంజనం, పర్జన్యం (తొలి భాగము) (1959), గోల్కొండ, క్రీస్తు చరిత్ర (1963), విజయాభిషేకం (1966), పర్జన్యం (రెండో భాగము) (1969), అక్షరాభిషేకం (1971), ఆమ్రపాలి (1972) అక్షరాక్షతలు (1973), అక్షరగుచ్చము (1975), వెలుగుబాట (1976), క్రీస్తు ప్రబంధం (1977) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | విజయనగరం జిల్లాలో 1987 డిసెంబరు 7న కవితా విశారద, విజయవాడలో 1950 మే 20వ తేదీన కవికోకిల, కాకినాడలో 1961ఏప్రిల్ 24న కవిలోక విభూషణ, 1968నవంబరు 10వ తేదీన విద్వత్కవిచూడామణి, 1968నవంబరు 15వ తేదీన సాహితీవల్లభ 1974 జనవరి 27న మహాకవి, విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1974 ఆగస్టు 3వ తేదీన కళాప్రపూర్ణ, విజయవాడలో 1974 సెప్టెంబరు 29వ తేదీన అభినవ జాషువ, 1974 నవంబరు 1న కాకినాడ పట్టణంలో కనకాభిషేకం, 1975లో ఆమ్రపాలి కావ్యానికి ఉత్తమ కవిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు, బొబ్బిలి చిలుకలపల్లిలో 1975సెప్టెంబరు 28వ తేదీన సాహితీ కృషి వల, 1979 అక్టోబరు 28న కవిసార్వభౌమ, రామచంద్రపురంలో 1982 సెప్టెంబరు 28వ తేదీన కవితాశ్రీనాధ, 1982లో పద్యవిద్యాప్రభు, 1991 ఫిబ్రవరి 7వ తేదీన బ్రహ్మీ విభూషణ, 1996లో డి.లిట్, 2001లో పద్మశ్రీ బిరుదులను స్వీకరించారు. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఎస్. టి. జ్ఞానానంద కవి |
సంగ్రహ నమూనా రచన | – |
ఎస్. టి. జ్ఞానానంద కవి
జ్ఞానానందకవి 1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు జన్మించారు[1].భీమునిపట్నం, విజయనగరం, కాకినాడలలో విద్యాభ్యాసం చేశారు. సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. వీరు సాహితీ సమాఖ్య, సాహిత్య కళాపీఠం అనే రెండు సంస్థలను స్థాపించారు. తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్.టి.జ్ఞానానందకవి. కూలీ నుండి కళాప్రపూర్ణ వరకూ ఎదిగిన ఈయన 2011 జనవరి 6 తేదీన శాశ్వతంగా కన్నుమూశారు.
మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన అవధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, అధ్యక్షత వహించిన ఆచార్య దివాకర్ల వేంకటావధాని, అవధానం నిర్వహించిన డా॥ సి.వి. సుబ్బన్న శతావధాని, డా॥ అరిపిరాల విశ్వం, డా॥ ఎస్.టి. జ్ఞానానంద కవి మొదలైన వారిని చిత్రంలో చూడవచ్చు.
———–