కంచి వాసుదేవరావు (Kanchi Vasudevarao)

Share
పేరు (ఆంగ్లం)Kanchi Vasudevarao
పేరు (తెలుగు)కంచి వాసుదేవరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ06/06/1930
మరణం05/12/2016
పుట్టిన ఊరుపశ్చిమగోదావరి జిల్లా ఏలూరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://www.logili.com/home/search?q=Kanchi%20Vasudevarao
స్వీయ రచనలువ్యక్తులూ వ్యక్తిత్వాలు , తెలుగు పత్రికా రంగం – 1832-2002, మహాత్ముని జీవితంలో కడపటి సంవత్సరం – పత్రికలో ధారావాహిక
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుజీవనసాఫల్య పురస్కారం
గంథం సీతారామాంజనేయులు స్మారక అవార్డు.
గంథం నాగ సుబ్రహ్మణ్యం స్మారక అవార్డు.
భోగరాజు నరసింహారావు స్మారక అవార్డు
జ్యేష్ట లిటరరీ అవార్డు
విశాఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ అవార్డు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకంచి వాసుదేవరావు
సంగ్రహ నమూనా రచనదాదాపు ఆరు దశాబ్దాల పాటు, తెలుగునాట సిద్ధాంత నిబద్దతకు, నిరుపమాన ప్రజాదరణకు నిలువుటద్దంలా నిలిచిన వార, మాస, దిన పత్రికలలో పాత్రికేయునిగా పనిచేసారు వాసుదేవరావు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1930, జూన 6న జన్మించారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో చదివారు. తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో డిప్లొమా ఇన ఫార్మసీ చేశారు. అయినా విద్యార్హతకు తగిన వృత్తిలో కాక, చిన్ననాటి నుంచి తనను ప్రభావితం చేసిన జాతీయోద్యమ పరిస్థితుల ప్రభావంతో, పత్రికా రచయితగా జీవితం ప్రారంభించారు.

కంచి వాసుదేవరావు

‘‘నాకు నా రచనలను పుస్తకాలుగా తీసుకురాగల తెలివితేటలు లేవు. పబ్లిషర్లను ఆశ్రయించడం నాకు చేతకాదు. స్వంతంగా ప్రచురించుకోగల ఆర్థిక స్తోమత కానీ, అచ్చయిన పుస్తకాలను అమ్ముకోగల చొరవగానీ లేవు. అందువల్లనే యాభై సంవత్సరాలు పైబడి కథలూ, నవలలూ, ఇతర వ్యాసాలూ రచించినా, ఎప్పుడో 1962లో ఆదర్శ గ్రంథమండలి వారు ప్రచురించిన ‘శాపగ్రస్తులు’ నవల తప్ప మరేవీ పుస్తకరూపంలో రాలేదు. ‘శాపగ్రస్తులు’ కాపీలు కొద్ది కాలంలోనే అమ్ముడయిపోయినా అది ద్వితీయ ముద్రణకు నోచుకోలేదు…’’ సీనియర్‌ పాత్రికేయులు, ఇటీవలే మృతిచెందిన కంచి వాసుదేవరావు తాను రచించిన తెలుగు పత్రికా రంగం – 1832-2002 .
దాదాపు ఆరు దశాబ్దాల పాటు, తెలుగునాట సిద్ధాంత నిబద్దతకు, నిరుపమాన ప్రజాదరణకు నిలువుటద్దంలా నిలిచిన వార, మాస, దిన పత్రికలలో పాత్రికేయునిగా పనిచేసారు వాసుదేవరావు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1930, జూన 6న జన్మించారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో చదివారు. తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో డిప్లొమా ఇన ఫార్మసీ చేశారు. అయినా విద్యార్హతకు తగిన వృత్తిలో కాక, చిన్ననాటి నుంచి తనను ప్రభావితం చేసిన జాతీయోద్యమ పరిస్థితుల ప్రభావంతో, పత్రికా రచయితగా జీవితం ప్రారంభించారు.

పాత్రికేయ దిగ్గజం ముట్నూరు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నడిచిన కృష్ణా పత్రికలో 1957లో సబ్‌ఎడిటర్‌గా వృత్తి జీవితానికి శ్రీకారం జరిగింది. పృధ్వీరాజ్‌ చౌహాన, రాణా ప్రతాప్‌ సింగ్‌, వీరశివాజీ వంటి వీరుల చరిత్రతో ప్రభావితులై, కొంతకాలం రాష్ర్టీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో పనిచేశారు. తర్వాత తన సహ విద్యార్థి, సుప్రసిద్ధ నటుడు, నాటక చరిత్రకారుడు మిక్కిలినేని సాహచర్యంతో విశాల ప్రపంచ దృక్పథంతో, కమ్యూనిజం, హిందూయిజం, గాంధీయిజం గురించిన అవగాహన పెంచుకున్నారు. మంచి సృజనాత్మకతతో 1946లోనే కథారచనకు శ్రీకారం చుట్టారు. ఆనాటి ‘ఆనందవాణి’లో తొలికథ ‘జాలి గుండె’ అచ్చయింది. ఆ స్ఫూర్తితో దాదాపు నూట యాభై వరకు కథలు, మూడు నవలలు రచించారు. వాటిలో ‘శాపగ్రస్తులు’ నవల పాఠకాదరణ పొందింది. కంచి వాసుదేవరావుకు మంచి రచయితగా, సాహిత్యవేత్తగా కూడా గుర్తింపు లభించింది. స్వీయ సంపాదకత్వంలో 1957 నుంచి 1967 వరకు ‘చుక్కాని’ పత్రిక ద్వారా పాత్రికేయునిగా ప్రసిద్ధులయ్యారు.
మహాత్మా గాంధీజీ జీవితంలో చివరి సంవత్సరం 1947-48 మధ్య అఖండ భారతావని విభజన, స్వాతంత్య్రసిద్ధి, మతకలహాల వంటి సంఘటనలలో మహాత్ముడు ఎదుర్కొన్న అనుభవాలు, సంఘర్షణలతో కూడిన యదార్థ విషయాలతో ‘మహాత్ముని జీవితంలో కడపటి సంవత్సరం’ పేరిట ఆనాటి ప్రముఖ పత్రికలో ధారావాహికగా రచించారు. ఆ రచన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ మన్ననలు, పురస్కారం పొందింది. ఆ రచనను ఇటీవల ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సహాయ సంచాలకులు ఎ.మల్లేశ్వరరావు స్వీయ పఠనంలో 22 ధారావాహికలుగా ప్రసారం చేస్తున్నది. విశాఖలో కె.ఎస్‌. శాస్ర్తి నేతృత్వంలోని ‘గాంధీ సెంటర్‌’, సి.ఎ్‌స.రావు ‘ప్రజాస్పందన’ సంస్థలు ద్వారా ప్రాయోజిత కార్యక్రమంగా ప్రసారమవుతున్నది. ఈనాటి తరం శ్రోతలను కూడా ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంటున్నది. ఈ తరానికి తెలియని ఆనాటి విలువైన సంఘటనలనెన్నింటినో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతున్నది.

గంథం సీతారామ ఆంజనేయులు నేతృత్వంలో వెలువడిన ‘సమాచారమ్‌’ పత్రికలో కొన్నాళ్ళు పనిచేశారు. 1976 నుంచి 1988 వరకు ‘ఈనాడు’ విశాఖపట్నం యూనిట్‌లో సబ్‌ఎడిటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తెలుగు పత్రిక, సాహిత్య రంగాలలో ఎందరో మేరునగధీరులతో కలసి పనిచేసిన అనుభవంతో, 1998లో ‘తెలుగు పత్రికారంగం’ పేరిట ఆయన రచించిన సుప్రసిద్ధ పత్రికా చరిత్ర పరిశోధనా గ్రంథం ఎంతో విలువైనది. తెలుగు పత్రికల చరిత్ర, పరిణామాలు, ఎందరో పాత్రికేయులు, చిరస్మరణీయుల గురించిన గొప్ప సమాచారాన్ని తెలుగు పత్రికాభిమానులకు అందించిన ధన్యజీవి. జీవితాంతం తాను నమ్మిన నీతి, నిజాయితీ, సమాజసేవ, పాత్రికేయ విలువల్ని పాటించిన ధీరోదాత్తుడు వాసుదేవరావు. పాత్రికేయునిగా తనకున్న పరపతిని, పలుకుబడిని స్వప్రయోజనాలకు ఏనాడూ వాడుకోలేదు. పాత్రికేయునిగా తాను పొందవలసిన న్యాయబద్ధమైన రాయితీలను కూడా సంపాదించుకోలేని అమాయకత్వం ఆయనది. వున్నంతలోనే ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో తన బాధ్యతలను నెరవేర్చారు.
గ్రేటర్‌ విశాఖ నగర శివారు ఆరిలోవలో సాధారణ ఆవాసంలోనే తన గంపెడు సంసారాన్ని నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన 87వ ఏట అడుగుపెట్టారు. ఆ సందర్భంగా, విశాఖలోని స్వచ్ఛంద సేవా సంస్థ ‘ప్రజాస్పందన’ అధ్యక్షులు సి.ఎ్‌స.రావు ఆధ్వర్యంలో ఒక అభినందన సభ జరిగింది. ఎందరో పాత్రికేయులు, ఉన్నత విద్యావేత్తల సమక్షంలో ‘జీవనసాఫల్య పురస్కారం’ పేరిట సత్కారం అందజేశారు. గంథం సీతారామాంజనేయులు, గంథం నాగ సుబ్రహ్మణ్యం, భోగరాజు నరసింహారావు స్మారక అవార్డులు, జ్యేష్ట లిటరరీ అవార్డు, విశాఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ అవార్డులను అందుకున్నారు. 87వ ఏట అడుగిడిన వారం రోజులకే ఈ నెల 12న మరణించారు. తొలి తరం పాత్రికేయుల లక్షణాలను, ఆదర్శాలను పుణికిపుచ్చుకున్న కంచి వాసుదేవరావు జీవితం ఎన్ని తరాల పాత్రికేయులకైనా ఆదర్శనీయం.
-బి.వి. అప్పారావు

———–

You may also like...