ఆచంట లక్ష్మీపతి (Achanta Lakshmipati)

Share
పేరు (ఆంగ్లం)Achanta Lakshmipati
పేరు (తెలుగు)ఆచంట లక్ష్మీపతి
కలం పేరు
తల్లిపేరుజానకమ్మ
తండ్రి పేరురామయ్య
జీవిత భాగస్వామి పేరురుక్మిణి లక్ష్మీపతి
పుట్టినతేదీ03/03/1880
మరణం08/06/1962
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరం
విద్యార్హతలుఎం.బి.బి.యస్
వృత్తిఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులు,
who later became Health Minister for the State of Madras
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆయుర్వేద విజ్ఞానం, ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము, భారతీయ విజ్ఞానము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆచంట లక్ష్మీపతి
సంగ్రహ నమూనా రచనప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు వీరికి ఉన్నత పాఠశాల లోని గురువు. ఎఫ్.ఎ పూర్తి చేసిన పిదప ఆయన దవులూరి ఉమామహేశ్వరవావు వద్ద కొంతకాలం క్లార్క్ బాధ్యతలు నిర్వహించాడు. ఉమామహేశ్వరరావు మద్రాసు కు బదిలీఅయిన పిదప ఆయన తో పాటు వెళ్లాడు. ఆ సమయంలో మద్రాసు రాష్ట్రం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. తరువాత ఆయన 1904 లో బి.ఎ పూర్తి చేసాడు

ఆచంట లక్ష్మీపతి

ఆచంట లక్ష్మీపతి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు ( నేటి చెన్నయ్) లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా (1920-1928) సేవలు అందించారు.
బాల్యం-విద్యాభ్యాసం
ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరం లో శ్రీ రామయ్య, శ్రీమతి జానకమ్మ లకు 1880 , మార్చి 3 న జన్మించారు. ఈయన తాతగారు సుబ్బారాయుడు గారు సంస్కృత పండితులు. ఈయన తండ్రి అతను వైద్య పాటు వ్యవసాయం నేర్చుకోవడం కలలు కన్నారు. అటు వైద్య శాస్త్రం , ఇటు వ్యవసాయం రెండింటి లో నూ మక్కువ గల లక్ష్మీ పతి మెట్రిక్యులేషన్, ఎఫ్ ఏ పూర్తి చేసి స్థానికంగా తహశిల్దారు కార్యాలయం లో గుమాస్తాగా పనిచేసారు. ఆపైన బి.ఎ చేసి స్కాలర్ షిప్ తో యం.బి.సి.యం ( ఆయుర్వేదం) కోర్సు చేసారు. ప్రముఖ వైద్య నిపుణులు పండిత దివి గోపాలాచార్య వద్ద శిష్యరికం చేసారు.
ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు వీరికి ఉన్నత పాఠశాల లోని గురువు. ఎఫ్.ఎ పూర్తి చేసిన పిదప ఆయన దవులూరి ఉమామహేశ్వరవావు వద్ద కొంతకాలం క్లార్క్ బాధ్యతలు నిర్వహించాడు. ఉమామహేశ్వరరావు మద్రాసు కు బదిలీఅయిన పిదప ఆయన తో పాటు వెళ్లాడు. ఆ సమయంలో మద్రాసు రాష్ట్రం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. తరువాత ఆయన 1904 లో బి.ఎ పూర్తి చేసాడు..
రచనలు
ఆంగ్ల భాష తో పాటు తెలుగు లోనూ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన డా. ఆచంట లక్ష్మీ పతి1922-27 కాలంలో తెలుగు లో “ధన్వంతరి” పత్రికనూ ఆంగ్లం లో ‘ఆంధ్రా మెడికల్ జర్నల్ ‘ ను ప్రచురించారు. ఆయన ఆంగ్లంలో “ఆంధ్ర మెడికల్ జర్నం” ను నడిపారు. ఈయన 63 పుస్తకాలను భారతీయ వైద్యం పై అనగా దర్శనములు, ఆయుర్వేద విజ్ఞానం,ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము , భారతీయ విజ్ఞానము వంటివి వ్రాశారు.ఆయుర్వేదంపై అనేక ఆంగ్ల పుస్తకాలను వ్రాశారు. చలిజ్వరము రోగ లక్షణాలు, దానికి ఆయుర్వేద వైద్యము గురించి చలిజ్వరము పుస్తకాన్ని రాశారు.

———–

You may also like...