పేరు (ఆంగ్లం) | Jasutram Rukminatha Sastry |
పేరు (తెలుగు) | జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 07/09/1914 |
మరణం | 07/20/1968 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | దేవయ్య స్వీయచరిత్ర (నవల), శబరి (నాటకం), కన్యకాపరమేశ్వరి (నాటకం), అక్షింతలు (పేరడీ) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914 సెప్టెంబరు 7 న బందరులో జన్మించారు.స్వయంకృషితో సంస్కృతాంధ్రాలలో పాండిత్యాన్ని,ఆంగ్లవాజ్మయంలో పరిచయాన్ని గడించారు.కృష్ణాపత్రికలో తరచుగా వ్యాసాలు వ్రాస్తూ ముట్నూరి వారి దర్బారులో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు.అంధ్రపత్రిక ,వాణి పత్రికలలో సంపాదక వర్గ సభ్యులుగా కొంతకాలం పని చేశారు..పేరడీ వంటి సరికొత్త ప్రక్రియలే గాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను చేపట్టి జెగజెట్టి అనిపించుకున్నారు.ఆయన పాడింది పాటగా పలికింది చెణుకుగా తెలుగునాట చెలామణి అయ్యింది.
తెనాలి రామకృష్ణుని తర్వాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి , వికటకవి శ్రీ జలసూత్రం రుక్మీనాథ శాస్త్రి.సమకాలీన కవులనీ , వారి రచనలనీ తన సునిశిత మేధాశక్తితో వ్యంగ్యంగా అనుకరించి పేరడీశాస్త్రిగా ప్రసిద్ధికెక్కారు. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి రచనల వైశిష్ట్యం గురించి చెప్పబోవడం సూర్యుణ్ని దివిటీతో చూపించడం వంటిది అవుతుంది.ఆయన కథల్లో సగటు మనిషి జీవితం వుంటుంది.వారి రచనల్లో దొర్లే మాటలు నిఘంటువులలో కంటే మన ఇళ్ళల్లో , మన సంభాషణల్లో ఎక్కువగా వినవస్తూ వుంటాయి .పేరడీ ప్రక్రియను మొట్ట మొదటగా తెలుగువారికి రుచి చూపించిన పాకశాసనుడు ఆయన !1968 జూలై 20న హృద్రోగంతో ఆయన కన్ను మూశారు.
తెలుగు సాహితీ రంగాన జరుక్ శాస్త్రిగా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరడీలకు ఆద్యుడన్న విషయం చాలా మందికి తెలియదు. పేరడీలతో తెలుగు సాహిత్యంతో ఆయన ఆడుకున్నారనడంలో సందేహం లేదు. 1914 సెప్టెంబర్ 7న జన్మించిన శాస్త్రి పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని చాలా విషయాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేవారు. తెలుగు సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది.
శాస్త్రి కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, వాణి వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. తెనాలి రామకృష్ణుని తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవిగా జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిని పేర్కొనవచ్చంటారు సాహితీ విమర్శకులు సైతం. ఆయన రచనల్లో కొన్ని జరుక్ శాస్త్రి పేరడీలు పేరుతోనూ, కథలు కొన్ని శరత్ పూర్ణిమ పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు.
———–