వింజమూరి శివరామారావు (Vinjamuri Shivaramarao)

Share
పేరు (ఆంగ్లం)Vinjamuri Sivaramarao
పేరు (తెలుగు)వింజమూరి శివరామారావు
కలం పేరుగౌతమి
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుపిఠాపురం తాలూకా చంద్రపాళెం
విద్యార్హతలు
వృత్తిఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటరుగా విజయవాడ కేంద్రంలో పనిచేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుపద్యాలను, గేయాలను సమప్రతిభతో వ్యాయగల నేర్పరి, ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర విశ్వకళా పరిషత్ వింజమూరి వారిని కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవింజమూరి శివరామారావు
సంగ్రహ నమూనా రచన

వింజమూరి శివరామారావు

వింజమూరి శివరామారావు ప్రముఖ తెలుగు కవి.
శివరామారావు పిఠాపురం తాలూకా చంద్రపాళెంలో 15-5-1908లో జన్మించారు. ప్రముఖ అభ్యుదయ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వీరి మేనమామ. శివ రామారావు కలం పేరు ‘ గౌతమి ‘.
శివరామారావు ఆకాశవాణిలో రెండు దశాబ్దాలు (1949-68) స్క్రిప్ట్ రైటరుగా విజయవాడ కేంద్రంలో పనిచేశారు. ఆకాశవాణిలో చేరడానికి ముందు పత్రికలలో పనిచేశారు. ‘ జ్వాల ‘ పత్రికలోను, నవోదయ పత్రికలోను సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. పద్యాలను, గేయాలను సమప్రతిభతో వ్యాయగల నేర్పరి. ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. ఈయన అనువాద రచనలో కూడా సమర్ధులు. అమరుకం, మొపాసా కథలు, గోర్కీ కథలు వీరి అనువాద సామర్థ్యాన్ని చాటిచెబుతాయి. కల్పవల్లి ఈయన ఖండ కావ్య సంపుటి. విజయపతాక, కళారాధన, రజకలక్ష్మి, కళోపాసన, కృష్ణదేవరాయలు, విశ్వామిత్ర నాటకాలుగా ప్రసిద్ధాలు. 1982లో వింజమురి శివరామారావు విజయవాడలోకాలధర్మం చెందారు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్ వింజమూరి వారిని కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.

———–

You may also like...