పేరు (ఆంగ్లం) | P.Yashodareddy |
పేరు (తెలుగు) | పి.యశోదారెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | సరస్వతమ్మ |
తండ్రి పేరు | కాశిరెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | పాకాల తిరుమల్ రెడ్డి |
పుట్టినతేదీ | 08/08/1929 |
మరణం | 10/07/2007 |
పుట్టిన ఊరు | మహబూబ్ నగర్ జిల్లా, బిజినేపల్లి |
విద్యార్హతలు | – |
వృత్తి | ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులుగా పనిచేశారు. |
తెలిసిన ఇతర భాషలు | హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు, జర్మన్ |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ద్విపద వాజ్మయం, ప్రబంధ వాజ్మయం, భారతీయ చిత్రకళ, భాగవత సుధ, మా ఊరి ముచ్చట్లు (1973) ఎచ్చమ్మ కథలు (1999), ధర్మశాల (2000), ఉగాదికి ఉయ్యాల, భావిక |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పి.యశోదారెడ్డి |
సంగ్రహ నమూనా రచన | – |
పి.యశోదారెడ్డి
యశోదారెడ్డి వందకు పైగా కథలు వ్రాసినా వాటిలో 63 మాత్రమే పుస్తక రూపంలో వచ్చినవి. ఈమె ప్రచురించిన మూడు కథా సంపుటాల్లో, మావూరి ముచ్చట్లు (1973) కథా సంపుటి 1920-40 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రీకరిస్తే, ఎచ్చమ్మ కథలు (1999) 1950-70 నాటి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు, ధర్మశాల (2000) కథా సంపుటి 1980-1990 నాటికి తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులకు దర్పణం పట్టింది. ఈ మూడు కథా సంపుటాల్లో ఈమె తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని, సామాజిక జీవితాన్నిఅక్షర బద్ధం చేసింది. మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, పాలమూరు జిల్లా మాండలికంలో వ్రాస్తే, ధర్మశాల కథా సంపుటిని మాత్రం వ్యవహారిక తెలుగు భాషలో వ్రాసింది.
యశోదారెడ్డి కథలు తెలంగాణ జనజీవనసంస్కృతిను, తెలంగాణా మాండలిక నుడికారానికి అద్దం పడుతున్నవి. ఎచ్చమ్మ కథలకు ముందుమాటలో “ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవనవిధానం ప్రతిఫలిస్తుంది. ఈ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఆ భాష ఆ జాతికి ప్రత్యేకమైన ఆచార వ్యవహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలధాతువులను జీర్ణించుకొని రససిద్ధిని పొంది జాతీయాల్లో, పలుకుబళ్లలో, సామెతల్లో పొందుపడి ప్రభుత్వాన్ని నెరుపుతుంది. ఒక భాషలో ఒక నానుడి కానీ, సామెత కానీ, జాతీయం కానీ అలవోకగా పుట్టదు. ఆయా జాతీయులు, తలలు పండినవారి అనుభవాన్ని వీడబోసి నిగ్గుదేల్చిన సారమే ఈ నుడికారపు ఇంపుసొంపులు. అందుకే అవి భాషకు జీవనాడి. ప్రాణ ధాతువుల వంటివి అని అభిప్రాయడిన యశోదారెడ్డి కథల నిండా తెలంగాణా నుడికారపు సొంపులకు పెద్దపీట వేసింది.
యశోదారెడ్డి కథారచయిత్రిగానే కాకుండా కవయిత్రిగానూ ప్రసిద్డులే. ఆమె రాసిన కవితలు అనేక పత్రికలలో ముద్రించబడ్డాయి. స్వయంగా తానే తన కవితలను ‘ ఉగాదికి ఉయ్యాల , భావిక అనే రెండు సంపుటాలగా వెలువరించారు.[8]. మలేషియాలో జరిగిన తెలుగు సమ్మేళనంలో కవయిత్రిగా పాల్గొని, ప్రశంసలందుంది.
———–