పేరు (ఆంగ్లం) | Y.Balasourireddy |
పేరు (తెలుగు) | వై.బాలశౌరిరెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | ఎద్దుల ఓబులమ్మ |
తండ్రి పేరు | గంగిరెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 07/01/1928 |
మరణం | 09/15/2015 |
పుట్టిన ఊరు | కడప జిల్లా గొల్లలగూడూరు |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బారిస్టర్ , లకుమ , కాలచక్ర |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వై.బాలశౌరిరెడ్డి |
సంగ్రహ నమూనా రచన | – |
వై.బాలశౌరిరెడ్డి
ఆయన 1928 జూలై 1 న కడప జిల్లా గొల్లలగూడూరులో ఎద్దుల ఓబులమ్మ, గంగిరెడ్డి దంపతులకు జన్మించాడు.ఆయన కడప, నెల్లూరు, అలహాబాద్, బెనారస్ లలో విద్యాబ్యాసం సాగించారు. ఆయన బాల్యంలోనే మహాత్మాగాంధీ ప్రభావానికి లోనయ్యాడు. ఆయన ఆదేశంతో హిందీ బోధన రంగంలో స్థిరపడ్డాడు. చెన్నై హిందీ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌గా, హిందీ చందమామ సంపాదకుడుగా, అనువాదకుడుగా, నాటక, వ్యాసరచయితగా పేరు పొందాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో వందకు పైగా రచనలు చేశాడు. హిందీలో 72 పుస్తకాలు రచించాడు. తెలుగునుంచి హిందీలోకి 23 పుస్తకాలు అనువాదం చేశాడు. బాలశౌరిరెడ్డి నవలల్లో బారిస్టర్ (1967), లకుమ (1969), కాలచక్ర (2002) వంటివి ఎంతో పేరు తెచ్చాయి. బాలశౌరిరెడ్డి రచనలపై ఇప్పటివరకు 18 పీహెచ్‌డీలు,11 ఎంఫిల్ డిగ్రీలు వచ్చాయి. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ కాశీవిద్యాపీఠం డిలిట్ పట్టాతో ఆయన్ని గౌరవించాయి. 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు. పలువురు ప్రధానులకు ఆయన సాహితీ సలహాదారుగా వ్యవహరించాడు. సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషుభాషల్లో సమాన ప్రతిభ కలిగిన బాలశౌరిరెడ్డి వ్యక్తిగతంగా నిగర్విగా పేరుపడ్డాడు.
ఆయన హిందీ శిక్షణ కళాశాలలో సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్ గా పనిచేశారు. హిందీ చందమామకు 23 సంవత్సరాలు సంపాదకత్వం వహించిన బాలకౌరిరెడ్డి, కోల్‌కతా లోని భారతీయ భాషా పరిషత్తుకు 1990-94 మధ్య డైరక్టరుగా, ఆంధ్ర హిందీ అకాడమీ- హైదరాబాదుకు చైర్మన్ గా పనిచేశారు. హిందీ సాహిత్య సమ్మేళన, ప్రయోగ, తమిళనాడు హిందీ అకాడమీకి అద్యాపకులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వందకుపైగా అందుకున్నారు. సాహిత్యంపై ఎనలేని ప్రేమతో హిందీ, తెలుగు బాషల్లో బాలశౌరిరెడ్డి అనేక రచనలు రాయటమే కాకుండా హిందీలో నుంచి తెలుగులోకి. తెలుగు నుంచి హిందీలోకి అనువాదాలు చేశారు.
హిందీలో 72 పుస్తకాలు, తెలుగు నుంచి హిందీలోకి 24 గ్రంథాలు అనువదించారు. శౌరిరెడ్డి రచనలపై దేశవ్యాప్తంగా అనేక విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 18 పీహెచ్‌డీలు, 11 ఎం ఫిల్ డిగ్రీలు వచ్చాయి. బాలకౌరిరెడ్డి అనేక తెలుగు నవలను హిందీలోకి అనువదించారు. రుద్రమదేవి, నారాయణ భట్ (నేరి) రాజశేఖర చరిత్ర (వీరేశలింగం పంతులు). అల్పజీవి (రాచకొండ), కౌసల్యా (పోలాప్రగడ) కేవయిరి (రావూరి బారద్వాజ) తదితర నవలలను తెలుగు నుంచి హిందీలోకి అనువదించారు.
సాహితీ రంగంలో శౌరిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ 2006లో సాహిత్య పురస్కారాన్ని అందించింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రారాకృష్ణన్ నుంచి సన్మానంతో పాటు ఇందిరాగాందీ, రాజీవ్ గాంధీ లాంటి ప్రముఖులు నుంచి సన్మానాలు పొందిన బాల శౌరిరెడ్డి సాహిత్య ప్రేమికుడిగా కొనసాగారు.
భారత ప్రధాని చైర్మన్ గా వ్యవహరించే కేంద్రీయ హిందీ సమితికి సలహాదారుడుగా స్థానం పొందడం ఆయన మేథస్సుకు నిదర్శనం. 88 ఏళ్ల వయస్సులో వృద్ధాప్యం మీదపడుతున్నా ఆయనలో సాహిత్యాభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే బోపాల్ కు వెళ్లి ఒక సదస్సులో పాల్గొని వచ్చారు. ఈసెలామియలో త్రివేండ్రంలో జరిగే ఒక సెమినార్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సెమినార్ కోసం అనేక అంశాలపై విరామం లేకుండా ఎడతెరిపి శోధనలు సాగించారు.
———–