బలిజేపల్లి లక్ష్మీకాంతం (Balijepalli Lakshmikantam)

Share
పేరు (ఆంగ్లం)Balijepalli Lakshmikantam
పేరు (తెలుగు)బలిజేపల్లి లక్ష్మీకాంతం
కలం పేరుబలిజేపల్లి లక్ష్మీకాంత కవి
తల్లిపేరుఆదిలక్ష్మమ్మ
తండ్రి పేరునరసింహశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/23/1881
మరణం6/30/1953
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడు
విద్యార్హతలుకర్నూలులో మెట్రిక్యులేషన్
వృత్తిగుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా చేశారు.
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశివానందలహరి శతకం (శంకరుని కృతికి ఆంధ్రీకరణం), స్వరాజ్య సమస్య (పద్య కృతి), బ్రహ్మరథం(నవల), మణి మంజూష (నవల), బుద్ధిమతీ విలాసము (నాటకము), సత్యహరిశ్చంద్రీయము (నాటకము), ఉత్తర గోగ్రహణము (నాటకము), సాత్రాజితీ పరిణయము (నాటకము), ఉత్తర రాఘవము (భవభూతి రచించిన నాటకానికి ఆంధ్రీకరణం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 926 లో గుంటూరు లో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో నక్షత్రకుడు పాత్ర వీరికిష్టమైనది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసత్య హరిశ్చంద్రీయము-ప్రథమాంకము
సంగ్రహ నమూనా రచనసత్య హరిశ్చంద్ర నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. ఉదాహరణకు ఒక పద్యం


మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.

సత్య హరిశ్చంద్రీయము

ప్రథమాంకము

నాంది

మ.  వనవిల్తుండు చలంబునన్ బయిపయి అన్మాతంగ కన్యావిలో

       కనసమ్మోహన బాణ మేసినను, న క్షత్రేశు డామీ ద జి

       క్కని రేయెండలు: గుప్పుచున్నను దదేక ధ్యానవిన్యస్త చిం

       తనుడై మాఱని రాజశేఖరుతపో • నైశ్చల్య మేలున్ మమున్. 

గీ.    భవన కారణ మీశ్వరు • మూర్తి యేది?

       ఆస్తిక నిరూఢికెయ్యది • యాది మూల?

       మఖిలధర్మంబులకునేది • యాటపట్టు?

        అట్టి సత్యంబె యందఱ • నాశ్రయించు.

(నాద్యంతమున)

సూత్రధారుడు – అహెూ! యేమి నాపుణ్యము. నిరంకుశ నాటకాలంకార సాహితీ రససరోనిమజ్జన సముజ్జితమనఃకలంకులగు నీ పరిషజ్ఞను లేకెలం కులంజూచినందామయై నాటకభవన మలంకరించిరి. ఇంకను మారిషుండు ప్రవేశింప కున్నాడేమి?

మారి –

(ప్రవేశించి) బావా! (నలుదిక్కులు బరికించి) అయ్యా ! నేడేదియో నాటక ప్రయత్నమువలె నున్నది. రంగమంతయు యధావిధిగా నలంకరింపబడి యున్నది. అదియునుగాక -………

You may also like...