పేరు (ఆంగ్లం) | Belluri Srinivasamurthy |
పేరు (తెలుగు) | బెళ్లూరి శ్రీనివాసమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | నరసమ్మ |
తండ్రి పేరు | బెళ్లూరి హనుమంతరావు |
జీవిత భాగస్వామి పేరు | తులశమ్మ |
పుట్టినతేదీ | 02/10/1910 |
మరణం | 02/05/1988 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తపోవనము (ఖండకావ్యము), కావ్యగంగ (ఖండకావ్యము), అమృతాభిషేకము (ఖండకావ్యము), విశ్వవైణికుడు (ఖండకావ్యము), జాముకోడి (ఖండకావ్యము), శిల్పవాణి (కావ్యము), వివేకానందము (ద్విపద కావ్యం), రెడ్డిరాజ్యమహోదయము జపమాల (స్మృతికావ్యము) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మధురకవి, రాయలసీమ కవికోకిల, అభినవకాళిదాసు, కవితా తపస్వి |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బెళ్లూరి శ్రీనివాసమూర్తి |
సంగ్రహ నమూనా రచన | చాల చిన్నదిరా! నాయిల్లు – చాల చిన్నదిరా! నామీది ప్రేమతో – నా వాకిటను నిల్చి నన్ను బిల్తువుగాని – ఆథిత్యమెటు సేతురా |
బెళ్లూరి శ్రీనివాసమూర్తి
బెళ్లూరి శ్రీనివాసమూర్తి తండ్రి బెళ్లూరి హనుమంతరావు కూడా సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు. శ్రీనివాసమూర్తి పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వద్ద శిష్యరికం చేశాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం ఇతని బాల్యమిత్రులు. ఈ ముగ్గురూ కొన్నాళ్ళు రాయలసీమలో ‘కవిత్రయంగా’ వాసికెక్కారు. ఇతని కవితలు భారతి సాహిత్య మాసపత్రికలో అచ్చయ్యాయి. 30 యేండ్లు అనంతపురం జిల్లా బోర్డు హైస్కూలులో ఆంధ్రపండితునిగా పనిచేసి అనేకమంది విద్యార్థులను సాహితీ ప్రియులుగా తీర్చినాడు. ప్రముఖ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ ఇతని శిష్యుడే. గీతావాణి పత్రికకు గౌరవ సహాయ సంపాదకుడిగా పనిచేశాడు. ఇతని కావ్యగంగను మైసూరు యూనివర్సిటీ వారు డిగ్రీ పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు.
చాల చిన్నదిరా!
నాయిల్లు – చాల చిన్నదిరా!
నామీది ప్రేమతో – నా వాకిటను నిల్చి
నన్ను బిల్తువుగాని – ఆథిత్యమెటు సేతురా
నాబ్రతుకు అంతటికి – నోచదయ్యెనురా!
కారు మబ్బుల లోన – కటిక చీకటి లోన
నాస్వామివగు నీవు – నా కొఱతనేతీర్ప
నావాకిటను నిల్చి – నన్నుబిల్తువుగాని
చిన్ని దివ్వెయు లేదురా
నీరాక చిత్తమున – వెతగూర్చురా!
మిత్రమై నాతోడ – మెలగి ముచ్చటలాడ
అరుదెంతువె గాని – చిఱుచాపయును లేదురా
కూర్చుండ, శిథిల భూభాగంబురా!
కనుల నిండుగ నీరు – గ్రమ్ముకొన నీచెంత
పాటలే వినిపింతురా – నాబ్రతుకు
పాటతో పయనించురా!
(అమృతాభిషేకము)
పరిమళింపని దొక్కపుష్పంబు లేదు
నేను విహరింపఁజనిన వనీతలాల
సుకృత వశమునఁ గలిగిన సుఖములందు
నోలలాడితి యౌవనోన్మీలనమున
ప్రకృతి యొడిలోన సుఖసుప్తి పడయు చుందు
కోయిలలు లేప నిదుర మేల్కొనుచు నుందు
అడవి కోనల సెలయేటి పడుచుఁగాంచి
పరమ సంతోష భరమున బలుకరింతు
మొగ్గనై, యాకు మఱుగున బొలుతు నేమొ?
పూవుగాఁబూచి పరిమళ మొలుకఁబోతు
నో విహంగమైన్ పరతునో? భావగీత
మగుదునో? నేను భావిజన్మములయందు
కాంక్షలేవేఱు, నా మనోగతులె వేఱు
పూరిగుడిసెలలోనైనఁ బుత్తుగాని
గీతమల్లక బ్రదుకు సాగింపలేను
భావగామంబె నాదు సర్వస్వమవని!
(తపోవనము)
———–