ఇఱ్ఱింకి నరసింహమూర్తి (Irrinki Narasimhamurthy)

Share
పేరు (ఆంగ్లం)Irrinki Narasimhamurthy
పేరు (తెలుగు)ఇఱ్ఱింకి నరసింహమూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1901
మరణం
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా తోలేరు గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశతావధానము, చాటువులు, శ్రీమదాంధ్ర భాగవతము, మణిరత్నమాల, తేటగీత భగవద్గీత, మహాభారత యుద్ధము, తీర్థయాత్రాదర్శిని, ఆంధ్రపుష్పబాణవిలాసము, యదార్థ రామాయణము
వేమగీతమ్‌ (సంస్కృతం), ప్రథమ సహస్రము, బాపూజీ సూక్తి రత్నావళి, మహాత్మాగాంధీ, ఆశ్రిత పారిజాత శతకము మొదలైనవి ఉన్నాయి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఇఱ్ఱింకి నరసింహమూర్తి
సంగ్రహ నమూనా రచన

ఇఱ్ఱింకి నరసింహమూర్తి

ఈయన 1901లో పశ్చిమ గోదావరి జిల్లా తోలేరు గ్రామంలో జన్మించాడు. ఇతడు కూడా ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడై పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయునిగా పనిచేశాru.
వీరు చేసిన అవధానాలలో తోలేరులో చేసిన శతావధానము వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఈ అవధానములోని కొన్ని పూరణలు:
వర్ణన: నదిని స్త్రీతో పోల్చి పద్యం

పూరణ:
వేణి భరాభిరామ, యరవింద సముజ్వల నేత్ర, సైకత
శ్రోణియు, చక్రవాక కుచశోభిత, రాజ మరాళయానయై
ప్రాణవిభున్ తమిన్ గవయఁబాల్పడి యేగెడు కాంతకైవడిన్
రాణమెయిన్ స్రవంతి జలరాశిని గూడఁగ నేగుదెంచెడిన్

సమస్య: వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్
పూరణ:
ఈ క్త్రా ప్రాసముఁజెప్ప నద్భుతమొకో యేంతేనియున్, జూడుడీ
వాక్త్రాసంబుల జంకు వారమనుచున్ భావింపఁగా బోకుడీ
దిక్త్రారాతికిఁబార్వతీ శివులకున్ తిగ్మ ప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్

సమస్య: మలము దినుము నీదు నోటి మలినము పోవున్
పూరణ:
చలువ కపురంపు పలుకులు
జలుబు మలపు జాజికాయ జాపత్రులు వ
క్కలు యేలకులం గూడు, త
మలము దినుము నీదు నోటి మలినము పోవున్

———–

You may also like...