గౌరావఝల సీతారామ శాస్త్రి (Gouraavajhala Sitarama Sastry)

Share
పేరు (ఆంగ్లం)Gouraavajhala Sitarama Sastry
పేరు (తెలుగు)గౌరావఝల సీతారామ శాస్త్రి
కలం పేరుగౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1904
మరణం01/01/1972
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిహైస్కూలు ప్రధానోపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీ కాశీవిశ్వనాథ శతకము, పయిడిపాటి మహాలక్ష్మి శతకము, వెంకటేశ్వర శతకము,శ్రీ కృష్ణ కథామృతము, సుబ్రహ్మణ్యేశ్వరీయము, శ్రీరామ నిర్యాణ నాటకము,కాఫీ పురాణము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుబాలకవిరత్న
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగౌరావఝల సీతారామ శాస్త్రి
సంగ్రహ నమూనా రచన

గౌరావఝల సీతారామ శాస్త్రి

ఒక మారేడు దళంబు నీ పదము లందుంచంగ సంతోషివై
యకలంకంబగు మోక్షమిత్తువట, పుష్పారామముంబెంచి, మా
లికలంగూర్చి సహస్ర నామముల హాళింగొల్చు నీ పుణ్యరా
శికేమిచ్చెదొ? తంగేడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ!


అకలంకంబౌ భక్తి నీ చరణ సేవాశక్తి వల్మీక మృ
త్తికచే లింగము జేసి నిత్యము “నమస్తే రుద్ర” యన్దివ్యవై
దిక మంత్రంబుల ధూపదీపముల నర్థింగొల్చునప్పుణ్య రా
శికి మోక్షంబిడు, తంగేడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ!


వ్యాసుడంతటివాడు, బిక్షకయి మధ్యాహ్నంబు నందేగియున్
గ్రాసంబెక్కడ లేక, కాశిపయి రౌద్రంబూని దూషింప, స
న్యాసీ! పొమ్మనినావు, కోపి యెటులందంజాలు నీ మోక్ష ల
క్ష్మీ సామ్రాజ్యము; తంగేడంచపుర కాశీ విశ్వనాథ ప్రభూ!
(శ్రీ కాశీ విశ్వనాథశతకము నుండి)

అతిథి వాకిటనుండ నాతని విడనాడి
కాఫీ త్రాగెడు కులకాంత యొకతె
తాను జిక్కని కాఫీ త్రాగి నీరిడి తక్కు
వారి కొసంగు నొయ్యారి యొకతె
అలవాటు మాకు లేదని; రహస్యంబుగా
జవిగొని యరుదెంచు జాణ యొకతె
చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష యం
చును త్రాగి మురియు శూర్ఫణక యొకతె

కాంతుడే కాఫీ గాచి పక్కకడ జేరి
నోటికందీయ ద్రాగి,కన్నులను విప్పి
చక్కగాలేదు పొమ్మని వెక్కిరించు
గర్వమానసయగు విషకన్య యొకతె!
(కాఫీ పురాణము నుండి)

బట్టలిస్త్రీ సేయవైచిన మఱకల
వైపు గన్గొని చాకివాడు దిట్టు
సరస ప్రసంగముల్సలుప గౌగిట జేరి
ముద్దిడు చెలి పెడమొగము బెట్టు
పసిపాప కనులలో బడన గేకలు వైచి
సారెకు సారెకు బోరుపెట్టు
తళతళలాడు గోడల మీద జీదిన
బనివాడు సూచి చీవాట్లు బెట్టు

నెత్తి కెక్కును, కనులకు నీరు దెచ్చు
గొద్ది కొద్దిగ ధనమెల్ల గొల్లవెట్టు
నాసికా చూర్ణమొక దురభ్యాస మగుట
తగదు సేవింప మీకు విద్యార్థులారా!
(సికిందరాబాదు అవధానములో నశ్యంపై ఆశువుగా చెప్పిన పద్యం)

———–

You may also like...