మద్దుకూరి చంద్రశేఖరరావు (Maddukuri Chandrashekhararao)

Share
పేరు (ఆంగ్లం)Maddukuri Chandrashekhararao
పేరు (తెలుగు)మద్దుకూరి చంద్రశేఖరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచంద్రం వ్యాసావళి, ఆంధ్రసాహిత్య పునర్వికాసం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమద్దుకూరి చంద్రశేఖరరావు
సంగ్రహ నమూనా రచన

మద్దుకూరి చంద్రశేఖరరావు

ఇతడు కృష్ణాజిల్లా, పెదపారుపూడి మండలం, వెంట్రప్రగడ గ్రామంలో 1907లో జన్మించాడు. ఇతడు విద్యార్థి దశలో జాతీయోద్యమంలో పాల్గొని దాని నుంచి కమ్యూనిస్టు ఉద్యమానికి వచ్చాడు. ఇతడు ఇంజినీరింగ్‌ విద్యార్థిగా 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1932లో వ్యష్ఠి సత్యాగ్రహంలో పాల్గొన్న సందర్భంలో పోలీసులు ఇతడిని చిత్రహింసలు పెట్టారు. రెండేళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. జైలులోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నాడు. తన పంథా నిర్ధారించుకున్నాడు. తనతోపాటు అనేక మంది యువకులను సమీకరించి పార్టీకి సుశిక్షితులైన సైనికుల్లా మార్చాడు. పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుతో కలిసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి తనదైన ముద్రతో పనిచేశాడు. క్షేత్రస్థాయిలో పనిచేయడంతోపాటు ఓ మేధావిగా శైశవ దశలో కమ్యూనిస్టు పార్టీకి కొన్ని విషయాల్లో ఇతడు మార్గదర్శకం చేశాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, మాతృదేశ దాస్య విముక్తి ఉద్యమాన్ని సమన్వయం చేసి పార్టీని నడిపించడంలో ఇతడు చూపిన మార్గమే దిక్సూచిలా నిలిచింది. సోవియట్‌ యూనియన్‌పై నాజీల దాడి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న వైఖరికి జాతీయవాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆంధ్ర కమ్యూనిస్టులు ఇతడి నాయకత్వాన సంయమనంతో ముందుకు సాగారు. సుభాష్‌చంద్రబోస్‌లాంటి పొరబడిన దేశభక్తులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడాన్ని తొలినుంచి ఇతడు వ్యతిరేకించాడంటే ఈయన ముందుచూపు, పరిస్థితులపై ఈయన అవగాహన స్పష్టమవుతోంది. ఇతడు రాసిన వ్యాసాలు ‘గాంధీ-ఇర్విన్‌ నాటినుంచి జమీందారీ పోరాటం వరకు’ కాంగ్రెస్‌ నిర్వహించిన రాజకీయాలు ఏమిటో అర్థమవుతాయి. ఒక దశలో కమ్యూనిస్టు పార్టీపై జరిగిన కువిమర్శలను తిప్పికొట్టడంలో ఇతడు తన వ్యాసాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టాడు.

తెలుగు సాహిత్యానికి, జర్నలిజానికి మార్క్సిస్టు చూపునిచ్చిన దార్శనికుడు… స్వాతంత్య్ర సమరయోధుడు.. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన నిర్మాత మద్దుకూరి చంద్రశేఖరరావు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, విస్తరణకు కొన్ని సంప్రదా యాలను అందించారు… ప్రమాణాలు, విలువలను ప్రోదిచేశారు. అన్నింటికీ మించి తెలుగు జాతి సాంస్కృతిక పునరుజ్జీవన వికాసానికి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన మహత్తర పాత్రలో ఆయన కృషి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంతో ఉంది. అది చెరగని ముద్రవేసింది.

నిరాడంబరత, నిస్వార్థం, అంకితభావం, సిద్ధాంత నిబద్ధత, నిర్మోహమాటంగా తన అభిప్రాయాల వ్యక్తీకరణ మద్దుకూరి వ్యక్తిత్వానికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి. కృష్ణాజిల్లా వెంట్రప్రగడలో 1907లో జన్మించిన ఆయన జాతీయోద్యమం నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. ఆయన ఇంజినీరింగ్‌ విద్యార్థిగా 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1932లో వ్యష్ఠి సత్యాగ్రహంలో పాల్గొన్న సందర్భంలో పోలీసులు ఆయనను చిత్రహింసలు పెట్టారు. రెండేళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. జైలులోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు..అవగాహన చేసుకున్నారు. తన పంథా నిర్ధారించుకున్నారు. తనతోపాటు అనేక మంది యువకులను సమీకరించి పార్టీకి సుశిక్షితులైన సైనికుల్లా మార్చారు. సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుతో కలిసి పార్టీ నిర్మాణానికి తనదైన ముద్రతో పనిచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేయడంతోపాటు ఓ మేధావిగా శైశవ దశలో కమ్యూనిస్టు పార్టీకి కొన్ని విషయాల్లో ఆయన మార్గదర్శకం చేశారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, మాతృదేశ దాస్య విముక్తి ఉద్యమాన్ని సమన్వయం చేసి పార్టీని నడిపించడంలో ఆయన చూపిన మార్గమే దిక్సూచిలా నిలిచిందని చండ్ర రాజేశ్వరరావు పేర్కొన్నారు. సోవియట్‌ యూనియన్‌పై నాజీల దాడి నేపథ్యంలో పార్టీ తీసుకున్న వైఖరికి జాతీయవాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆంధ్ర కమ్యూనిస్టులు చంద్రం నాయకత్వానే సంయ మనంతో ముందుకు సాగారు. సుభాష్‌చంద్రబోస్‌లాంటి పొరబడిన దేశభక్తులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడాన్ని తొలినుంచి చంద్రం వ్యతిరేకించారంటే ఆయన ముందుచూపు, పరిస్థితులపై ఆయన అవగాహన స్పష్టమవుతోంది. ఆయన రాసిన వ్యాసాలు ‘గాంధీ-ఇర్విన్‌ నాటినుంచి జమీందారీ పోరాటం వరకు’ కాంగ్రెస్‌ నిర్వ హించిన రాజకీయాలు ఏమిటో అర్థమవుతాయి. ఒక దశలో కమ్యూనిస్టు పార్టీపై జరిగిన కువిమర్శలను తిప్పికొట్టడంలో ఆయన తన వ్యాసాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టారు. అందుకు చక్కని ఉదాహరణే కృష్ణా పత్రిక సంపాదకులకు బహిరంగ లేఖ పేరిట రాసిన వ్యాసం. ఆయన విమర్శ కూడా సూటిగా ప్రత్యర్థుల గుండెలను తాకేలా ఉంటుంది. కృష్ణాపత్రిక సంపాదకీయంలో రాసిన అసత్య, అబద్ధ ఆరోపణలకు సమాధానం ఇస్తూ చంద్రం చెప్పిన మాట నేటికీ అక్షరసత్యంగా నిలుస్తోంది. ‘ప్రజలే మాకు పునాది. ప్రజాసామాన్యానికి అనుంగు బిడ్డలమైన కమ్యూనిస్టులం. ప్రజలలో వేరూని ఉన్నంతకాలం ప్రజాసేవే మా ప్రధాన లక్ష్యమైనంతకాలం, మమ్ములను ప్రత్యర్థులు ఏమీ చేయలేరు.’ అని ఆయన స్పష్టంచేశారు.

మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ నిజమైన పోరాటం చేసింది. మద్రాసు కోసం ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి మొండికేసి కూర్చుంటే.. మద్రాసు కావాలన్న డిమాండును వదులు కుంటేనే రాష్ట్ర సాధన సాధ్యమని కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా ప్రక టించింది. ఈ ప్రకటన వెనక కూడా మిగిలిన నేతలతోపాటు చంద్రం ముందుచూపు, సమస్యపై ఉన్న స్పష్టమైన అవగాహన, పరిష్కారానికి కావాల్సిన ఆలోచన ఉంది. ‘ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే, అంత త్వరగా దానంతటదే రాష్ట్రం వస్తుంది.’ అని డాక్టర్‌ పట్టాభి 1948 ఏప్రిల్‌లో విజయవాడలో ప్రకటించారు. ఆచార్య రంగా, ఇతర కాంగ్రెస్‌ నేతలు కూడా దానికి తలూపారు. చంద్రం తన వ్యాసంలో ఈ ధోరణిని ఎండగట్టారు. ఆనాడు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం చేయాలో వివరించారు.

తెలుగు వైతాళికులకు పునరుజ్జీవం : వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గిడుగు రామమూర్తి మొదలైన వారంతా ఆంధ్రదేశంలో ఆధునిక యుగానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కొద్దికాలానికే వారిని, వారి కృషిని మర్చిపోయిన దుస్థితి నెలకొంది. ఆ దశలో వారిని, వారి రచనలను వెలుగులోకి తీసుకురావడంలో, వారందించిన సుసంప్రదాయాలను కమ్యూనిస్టు ఉద్య మంలోకి, ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మద్దుకూరి చంద్రం కృషే ముఖ్యకారణం. నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది, ఇంకా తీసుకుంటున్నదంటే అది చంద్రం చలవే. వీరేశలింగం పంతులు జీవిత చరిత్ర, ప్రహసనాలు, నాటకాలు, గురజాడ అప్పారావు ముత్యాల సరాలు, కన్యాశుల్కం ప్రచురణకు నోచుకున్నాయంటే కమ్యూనిస్టు పార్టీ వల్లే.. ముఖ్యంగా చంద్రం వల్లే. ఈ సందర్భంలో కొన్ని అభాండాలు, అపవాదులను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది ఆయన వల్లే. ‘అసలు ఇవన్నీ అప్పారావుగారు వ్రాశారా? ఆయన ఏవో కొన్ని వ్రాస్తే కమ్యూనిస్టులు వాళ్ల యిష్టం వచ్చినట్లు ఇవన్నీ కల్పించి వ్రాశారు’. అనే తప్పుడు వాద నలను ప్రజలే తోసిపుచ్చారు. చిలకమర్తి స్వీయచరిత్ర ప్రచురించి ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న ఆయనకు అండగా నిలిచిందీ కమ్యూనిస్టులే. సంస్కృతి, సాహిత్యాలను కలుపు కుపోకుండా రాజకీ యాలు రాణించడం సాధ్యం కాదన్న వాస్త వాన్ని ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ గ్రహించడానికి, వాటిని ప్రోత్సహించడా నికి, వాటిలో మంచి చెడుగులను ఎంచడానికి, అభ్యుదయ బాట పట్టించడానికి ప్రధాన కారణం చంద్రం లాంటి వారి కృషే. అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కళలు పదునైన ఆయుధాలని గ్రహించిన ఆయన ప్రజానాట్య మండలిని తీర్చిదిద్దడంలో, ముఖ్యంగా మహిళలను కళాకారులుగా ప్రోత్సహించడంలో ఆయన ముందు నిలిచారు. ఆంధ్రలో సాంస్కృతిక ఉద్యమానికి ఆయన ప్రధాన కారకుడు. తెలంగాణ పోరాటంలో పెద్ద పాత్ర నిర్వహించిన ‘మా భూమి’ నాటకం ప్రదర్శనల్లో ఆయన కృషి ఎంతో దాగి ఉంది.

కమ్యూనిస్టు జర్నలిజానికి ఒరవడి : నేడు తెలుగు జర్నలిజంలో వినూత్న పోకడలను ఎన్నో చూస్తున్నాం. భాష, భావం, గెటప్‌.. ఇలా ఎన్నో చెప్పవచ్చు. పత్రికా వృత్తికి మార్క్సిస్టు కళ్లద్దాలు అందించి సామాన్యుల జీవితాలు, ఉద్యమాలు వార్తలకు ముడిసరకుగా మార్చడంలో ఆయన వేసిన పునాదే మూలం. ఆయన పత్రికారచన ఎంతో సులువుగా, సూటిగా, సరళంగా…పల్లె ప్రజలను లక్ష్యంగా చేసుకొని సాగింది. 1937లో పార్టీ ప్రారంభించిన పత్రిక ‘నవశక్తి’ సంపాదకులుగా ప్రారంభమైన ఆయన పాత్రికేయ జీవితం, కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకంగా సాగింది. పార్టీ రహస్యపత్రిక ‘స్వతంత్ర భారత్‌’, 1942-45 మధ్య ప్రజాశక్తి వారపత్రి కకు, 1946నుంచి 1948 నిర్బంధ కాలంలో మూసివేసే వరకు ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులుగా పనిచేశారు. 1948లో అరెస్టు అయ్యారు. 1952లో విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభంలో ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. 1964నుంచి 68 వరకు సంపాదకులలో ఒకరుగా ఉన్నారు. 1951నుంచి 56వరకు రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. సోషలిస్టు భావాలను, మార్క్సిస్టు సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేయడానికి, ప్రజల సమస్యలు వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి సాగే ఉద్యమాలకు ఊతంగా నిలవడానికి పత్రికల ద్వారా ఆయన చేసిన కృషి అనితర సాధ్యమైనవి. కమ్యూనిస్టు ఉద్యమాభివృద్ధికి, ప్రజాతంత్రశక్తుల సమీకరణకు తన వ్యాసాలు, సంపాదకీయాల ద్వారా ఆయన తపించారు. అంతకుమించి కమ్యూనిస్టు జర్నలిజానికి ఓ ఒరవడిని ఏర్పరిచారు. ఈ ఒరవడే తెలుగు కమ్యూనిజం జర్నలిజానికి దిక్సూచిగా నిలిచింది.

ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైంది. ఆయన ఏనాడు పదవుల్ని ఆశించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పదవుల కన్నా పార్టీ నిర్మాణమే ముఖ్యమని నమ్మిన కమ్యూనిస్టుల్లో ఆయనే ముందు వరసలో నిలుస్తారు. 1952 ప్రాంతాల్లో సుందరయ్య, బసవపున్నయ్య, రాజేశ్వరరావు, చంద్రం.. ఎవరు ఏ బాధ్యతల్లో ఉండాలని వచ్చినప్పుడు… మొదటి ఇద్దర్ని పార్లమెంటుకు, మూడోవార్ని శాసనమండలికి, చంద్రంను రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయించింది. ‘నేను ఎందుకయ్యా దాంట్లో? కెఎల్‌ నరసింహంను పంపితే ఉపయోగంగా ఉంటుంది’ అని మద్దుకూరి తప్పుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పదవులపై ఆసక్తిలేని నిజమైన కమ్యూనిస్టు ఆయన. అంతేకాదు, తన అభిప్రాయాలను కరెక్టు అని నమ్మినప్పుడు కచ్చితంగా నిలబడే వ్యక్తిత్వం ఆయనది. పార్టీలో ముఠాతత్వానికి నిరసనగా అన్ని బాధ్యతలు వదిలి కర్నూలు వెళ్లి సామాన్య రైతు జీవితం గడిపారు. అక్కడ కూడా సామాన్య కార్యకర్తగా పార్టీ నిర్మాణానికి కృషిచేశారు.

చండ్ర రాజేశ్వరరావు చెప్పినట్లు ఆయనలో లెనిన్‌ గుణగణాలు కనిపిస్తాయి. లీషావ్‌ చీ నిర్వచించిన ‘మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి?’ అనే దానికి మద్దుకూరి చంద్రశేఖరరావు ఒక ఉదాహరణగా భవిష్యత్తు తరాలు చూపించవచ్చు. ఆయన ఆదర్శాలే నేటి కమ్యూనిస్టులకు మార్గదర్శకులు కావాలి.

———–

You may also like...