ఆలూరు వెంకట సుబ్బారావు (Aluru Venkata Subbarao)

Share
పేరు (ఆంగ్లం)Aluru Venkata Subbarao
పేరు (తెలుగు)ఆలూరు వెంకట సుబ్బారావు
కలం పేరుచక్రపాణి
తల్లిపేరువెంకమ్మ
తండ్రి పేరుగురవయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/05/1908
మరణం09/24/1975
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా తెనాలి
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుస్వయంవరం (1980) (కథ), శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (రచయిత), జూలీ (1975) (చిత్రానువాదం), గుండమ్మకథ (1962) (కథ), మనిదన్ మారవిల్లై (1962) (చిత్రానువాదం), రేచుక్క పగటిచుక్క (1959) (చిత్రానువాదం), అప్పుచేసి పప్పు కూడు (1958) (చిత్రానువాదం), మాయాబజార్ (1957/II) (చిత్రానువాదం), మిస్సమ్మ (1955) (రచయిత)
మిస్సియమ్మ (1955) (రచయిత), చంద్రహారం (1954) (రచయిత)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆలూరు వెంకట సుబ్బారావు
సంగ్రహ నమూనా రచన

ఆలూరు వెంకట సుబ్బారావు

చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5 న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించాడు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించాడు. ‘చక్రపాణి’ అనే కలం పేరును ఈయనకు అతనే ప్రసాదించాడు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందాడు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932 లో మదనపల్లె లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళాడు. అక్కడే కొన్ని నెలలు ఉండి, సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నాడు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగు లోకి అనువదించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా శరత్‌బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే – శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టాడు.
1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం ఈయన మాటలు వ్రాసాడు. బి.ఎన్.రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళాడు.[1]
1949-1950 లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి నాగిరెడ్డితో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించాడు.
1934-1935 లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించాడు. 1960 లో దీనిని హైదరాబాదుకుతరలించారు.
తెలుగు సినిమాకు ఓ గ్లామర్ ను అద్ది, గ్రామర్ ను నేర్పాయి విజయావారి చిత్రాలు… ఈ తరం సైతం మరోమాట లేకుండా విజయావారి చిత్రాలకు జై కొడుతోంది…ఆ సినిమాలు అంతలా తెరకెక్కడానికి నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి అభిరుచి ప్రధాన కారణం… అందులో చక్రపాణిది ఆలోచనయితే, నాగిరెడ్డిది ఆచరణ… ఆ ఇద్దరు మిత్రులు నిర్మించిన చిత్రాలే దక్షిణాది సినిమా జనానికి ఈ నాటికీ పెద్దబాలశిక్షలుగా ఉపకరిస్తున్నాయి… ‘షావుకారు’ సినిమాతో మొదలైన ఈ మిత్రుల చిత్రప్రయాణం మలి సినిమా ‘పాతాళభైరవి’తోనే విజయకేతనం ఎగురవేసింది… అక్కడ నుంచీ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనే కాకుండా హిందీలోనూ తమదైన బాణీ పలికించారు నాగిరెడ్డి-చక్రపాణి…ఎంతటి క్లిష్టసమస్యనైనా దాని పేరు ప్రస్తావించకుండా చర్చిస్తూ తగిన పరిష్కారం రచనలు సైతం కొన్ని చిత్రరాజాలుగా వెలుగొందాయి… “ధర్మపత్ని, షావుకారు, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు” వంటి చిత్రాలు చక్రపాణి కలం బలంతో సినిమాలుగా రూపొందినవే… రచయితగా, పత్రికా సంపాదకునిగా, నిర్మాతగా తనదైన బాణీ పలికించారు చక్రపాణి… అన్నిటా ఆయనకు మిత్రుడు నాగిరెడ్డి సహాయసహకారాలు లభించాయి… ఈ ఇద్దరు మిత్రుల అభిరుచులతో అనేక వినోదభరిత చిత్రాలు రూపొంది జనాన్ని ఈ నాటికీ అలరిస్తున్నాయి… సగటు ప్రేక్షకుణ్ణి దైవంగా భావించి, చిత్రాలను నిర్మించిన చక్రపాణి-నాగిరెడ్డి అభిరుచి భావితరాలకు సైతం ఆచరణీయమని చెప్పక తప్పదు…

———–

You may also like...