బయ్యా సూర్యనారాయణ మూర్తి (Bayya Suryanarayana Murthy)

Share
పేరు (ఆంగ్లం)Bayya Suryanarayana Murthy
పేరు (తెలుగు)బయ్యా సూర్యనారాయణ మూర్తి
కలం పేరుబి. ఎస్. మూర్తి
తల్లిపేరు
తండ్రి పేరునాగయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1909
మరణం01/01/1979
పుట్టిన ఊరుతూర్పు గోదావరి జిల్లా లోని రాజోలు తాలూకా నగరం గ్రామం
విద్యార్హతలుఎం.ఏ., బి.ఇడి.,
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబయ్యా సూర్యనారాయణ మూర్తి
సంగ్రహ నమూనా రచన

బయ్యా సూర్యనారాయణ మూర్తి

బి. ఎస్. మూర్తి గా ప్రసిద్ధులైన బయ్యా సూర్యనారాయణ మూర్తి (ఆంగ్లం: Bayya Suryanarayana Murthy) స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి.
వీరు తూర్పు గోదావరి జిల్లా లోని రాజోలు తాలూకా నగరం గ్రామంలో నాగయ్య దంపతులకు 1909లో జన్మించారు. రాజమండ్రి మరియు చెన్నైలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఏ., బి.ఇడి., పట్టభద్రులయ్యారు. తొమ్మిదవ ఆంధ్ర విద్యార్థి కన్వెన్షన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర దళిత వర్గాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1937-1939 మరళ 1946-1947 మధ్యకాలంలో మద్రాసు మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. దేశ స్వాతంత్ర్యయ సమరంలో వ్యక్తి సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో రెండు సార్లు కారాగార శిక్ష అనుభవించారు. వీరు ‘నవజీవన’ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్ర హరిజన సేవక సంఘం అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర వ్యవసాయ కూలీ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నారు.
1952, 1957, 1962, 1967 మరియు 1971 లలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా ప్రజాసేవ చేశారు. భారత ప్రభుత్వ సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పార్లమెంటరీ సెక్రటరీగాను, అదే శాఖకు డిప్యూటీ మంత్రిగాను పనిచేశారు.
వీరు 1947 సంవత్సరంలో తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయంలోనికి అంటరానివారిని అనుమతించాలని సత్యాగ్రహం నిర్వహించి, దాన్ని సాధించారు.
వీరు రచయితగా Revolt of Six Crores, Depressed and oppressed : forever in agony (1972) and The Glimmer in darkness అనే ఆంగ్ల పుస్తకాలు ప్రచురించారు.
వీరు 1979లో పరమపదించారు. వీరికి ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు.

———–

You may also like...