పేరు (ఆంగ్లం) | Vasantarao Venkatarao |
పేరు (తెలుగు) | వసంతరావు వెంకటరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | తాతారావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 02/25/1909 |
మరణం | 04/25/2992 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వసంతరావు వెంకటరావు |
సంగ్రహ నమూనా రచన | – |
వసంతరావు వెంకటరావు
ఈయన 1909, ఫిబ్రవరి 21 వ తేదీన జన్మించారు. తండ్రి పేరు తాతారావు. విజయనగరం మహారాజ కాలేజీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య (ఎం.యస్సీ) చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం వద్ద భౌతిక శాస్త్ర ప్రయోగ శాలలో కొంతకాలం శిక్షన పొందారు. మహారాజా కళాశాల, విజయనగరంలో 1935లో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరి, పదోన్నతులను పొందుతూ ప్రిన్సిపాల్ గా (1956-69) పదవీవిరమణ చేశారు.
భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపన్యాసాలు, రచనలు ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింపచేశారు. తెలుగులో భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తెలుగు భాషా సమితి తరపున రూపొందించారు. దాదాపు సహస్ర విజ్ఞాన వ్యాసాలు రాసారు. వీటిలో అనేకం వ్యాస సంపుటాలుగా వెలువడినాయి. ఈయన రాసిన సైన్స్ గ్రంథాలు 32 లో కొన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా ఎంపిక అయ్యాయి. ఆధునిక విజ్ఞానం[1] పేరుతో ఆయన రాసిన పుస్తకం ప్రసిద్ధి చెందింది. ఈయన సంకలనం చేసిన సూక్తిముక్తావళి అనే గ్రంథం కూడా ప్రసిద్ధి చెందింది.
మానవ మానవ, పడకటింట్లో విజ్ఞానచర్చ, పారిజాతం మొదలగు అనేక పుస్తక రచనలు జన సామాన్యానికి కూడా విజ్ఞానాన్ని చేకూర్చాయి. తెలుగు అకాడమీ లో, 18 పుస్తకాలు డిగ్రీ విద్యార్థులకు వెలువరించారు. విద్యార్థి లోకానికి సంబంధించిన భౌతిక శాస్త్ర సంబందమైన అనేక ప్రయోగాలు నిర్వహించారు. సామాన్య శాస్త్రం మీద, మాతృభాష మీద ఈయనకు గల అపార గౌరవాభిమానాలు, జిజ్ఞాసలు తెలుగువారికి వరప్రదాతలయ్యాయి. సైన్స్ ను అతి సరళ మైన తెలుగు భాషలో విస్తృత ప్రచారం చేసిన ఈయన 1992, ఏప్రిల్ 25 న మృతి చెందారు.
———–