కొండూరు వీరరాఘవాచార్యులు (Konduru Veeraraghavayyacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Konduru Veeraraghavayyacharyulu
పేరు (తెలుగు)కొండూరు వీరరాఘవాచార్యులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/12/1912
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆత్మదర్శనం, శిల్పదర్శనం, సాహిత్య దర్శనం, తోరణము, అమరావతి (పద్యకావ్యము), మిత్ర సాహస్రి, లేపాక్షి (నవల), మోహనాంగి (నవల)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుమద్రాసు విద్వత్ సదస్సులో పండితుల సమక్షంలో దర్శనాచార్య అనే బిరుదు ప్రదానం.
1938లో అయోధ్య సంస్కృత పరిషత్తు వారిచే విద్యాధురీణ బిరుద ప్రదానం
1939లో మైసూరు మహారాజా వారిచే సత్కారం
1972లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ బిరుద ప్రదానం.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొండూరు వీరరాఘవాచార్యులు
సంగ్రహ నమూనా రచన

కొండూరు వీరరాఘవాచార్యులు

కళాప్రపూర్ణ ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. రాఘవాచార్యులు శాస్త్ర పాండిత్యంతో పాటు కవితా సంపదను, ప్రాచీన సంప్రదాయాలతో పాటు ఆధునికరీతులను, సమపాళ్లలో మేళవించుకున్న సాహితీవేత్తలలో దర్శనాచార్య బిరుదాంకితుడైన ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈయన అనేక గద్య, పద్య రచనలు చేసి, ఆచార్యులుగా మూడు దశాబ్దాలుగా తెలుగుసాహితీ ప్రపంచానికి చిరపరిచితులు.
వీరరాఘవాచార్యులు 1912, సెప్టెంబరు 26కు సరియైన పరీధావి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ, గురువారం నాడు గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని, కోపల్లె గ్రామంలో జన్మించాడు. పార్వతమ్మ, కోటీశ్వరాచార్యులు ఇతని తల్లిదండ్రులు. ఈయన తెనాలిలోని సంస్కృత కళాశాలలో త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి వద్ద విద్యను అభ్యసించి 1936లో ఉభయభాషా ప్రవీణుడైనాడు. ఈయన బాల్యంలోనే శిల్పకవితా కళలతో పాటు యోగ, వేదాంతంలలో శిక్షణ పొందాడు. గుంటూరులోని శారదానికేతనం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూలు మొదలైన ఉన్నతపాఠశాలలలో సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశాడు. తర్వాత తెనాలిలోని వి.యస్.ఆర్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు

———–

You may also like...