కేశవపంతుల నరసింహశాస్త్రి (Keshavapantula Narasimhasastry)

Share
పేరు (ఆంగ్లం)Keshavapantula Narasimhasastry
పేరు (తెలుగు)కేశవపంతుల నరసింహశాస్త్రి
కలం పేరు
తల్లిపేరురామలక్ష్మమ్మ
తండ్రి పేరుతిప్పాజ్యోసులకు శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/14/1919
మరణం01/02/1991
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబాలబ్రహ్మేశ్వర సుప్రభాతం, రత్నలక్ష్మీ శతకం, ప్రబంధ పాత్రలు, సంస్థానాలు – సాహిత్య పోషణ, త్యాగధనులు, రఘువంశ వ్యాఖ్యానం, చంద్రికా పరిణయము (సంస్కృతం నుంచి అనువాదం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకేశవపంతుల నరసింహశాస్త్రి
సంగ్రహ నమూనా రచన

కేశవపంతుల నరసింహశాస్త్రి

ఆకాశవాణిలో సంస్కృత పరిచయం కార్యక్రమం ద్వారా తమ గంభీర స్వరంతో ‘ అమరవాణి ‘ ని వినిపించి, కే. ఎన్. శాస్త్రిగా తెలుగువారికి సుపరిచితులైన వ్యక్తే కేశవపంతుల నరసింహశాస్త్రి.
కేశవపంతుల నరసింహశాస్త్రికి చిన్నతనంలోనే ఆశు కవితాధార అబ్బింది. పదహారు సంవత్సరాల వయసులోనే వనపర్తి రాజుల పూర్వపు రాజధాని అయిన శ్రీరంగాపురంలోనిశ్రీరంగనాథస్వామి ఉత్సవాల సందర్భంగా విర్వహించే కవిగాయక సభలలో పాల్గొని, నాటి రాజు తృతీయ రామేశ్వరరావుపై పద్యాలు వినిపించి, మెప్పు పొందాడు. నాటి నుండి మొదలుకొని సుమారు దశాబ్దం పాటు ప్రతియేడు ఆ సభలలో పాల్గొని వార్షిక సన్మానాలు పొందిన కవివరేణ్యులు. మహబూబ్ నగర్ జిల్లాలో సాహితీ పోషణలో పేరెన్నికగన్న గద్వాల, ఆత్మకూరు, జటప్రోలు తదితర సంస్థానాలలో కూడా తమ పాండిత్యాన్ని ప్రదర్శించి గౌరవ సత్కారాలు పొందాడు. శాస్త్రి ప్రౌడకవిగానే కాకా సద్విమర్శకులు కూడా. రఘువంశంపై వీరి వ్యాఖ్యానం వీరి విమర్శనా ప్రతిభకు గీటురాయి. ప్రబంధ పాత్రలు అను వీరి రచన సాహిత్య శాస్త్రంలో వీరెంత ప్రవీణులో, వీరికెంత సూక్ష్మపరిశీలనా శక్తి ఉందో తెలియజేస్తుంది. ‘ సంస్థానాలు- సాహిత్య పోషణ ‘ అను వీరి గ్రంథం సంస్థానాలతో వారికిగల పరిచయాన్ని, అనుబంధాన్ని తెలియజేస్తుంది[1]. శాస్త్రిగారు కవి, విమర్శకులే కాదు గొప్ప వక్త కూడా. గంభీరస్వరంతో పద్యాలను ధారాళంగా పాడుతూ గంటలకొద్ది ఉపన్యసించేవారట. సురభి మాధవరాయ ప్రభు సంస్కృతంలో రాసిన చంద్రికా పరణయము కావ్యాన్ని శాస్త్రి తెలుగులోనికి అందరికీ అర్ధమయ్యే విధంగా అనువదించారు.

———–

You may also like...