పేరు (ఆంగ్లం) | pamulaparti Sadashivarao |
పేరు (తెలుగు) | పాములపర్తి సదాశివరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాములపర్తి సదాశివరావు |
సంగ్రహ నమూనా రచన | – |
పాములపర్తి సదాశివరావు
పాములపర్తి సదాశివరావు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉత్తమ రచయిత, జర్నలిస్టు.
ఇతడు 1921, 17 జూలైన వరంగల్లులో హనుమంతరావు, దుర్గాబాయి దంపతులకు జన్మించాడు. హనుమకొండలోని హైస్కూలులో ఇతని విద్యాభ్యాసం నడిచింది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. భారత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఇతనికి సోదరుడి వరుస మరియు బాల్యమిత్రుడు. వీరి స్నేహం వికసించి కాకతీయ పత్రిక ప్రారంభించడానికి కారణమైంది. 1948లో ఈ కాకతీయ పత్రిక ప్రారంభమైంది. పాములపర్తి సదాశివరావు ఈ వారపత్రికకు సంపాదకుడు కాగా పి.వి.నరసింహారావు ఈ పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఈ పత్రికలో జయ-విజయ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. అవి పాఠకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇద్దరూ అనేక కలంపేర్లతో ఈ పత్రికలో చాలా రచనలు చేశారు. సందేశమ్ పత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు 1945లో కాకతీయ కళాసమితిని స్థాపించాడు. ఈ సంస్థ కళలు, సాహిత్యం, నాటకాలు, శాస్త్రీయ సంగీతం మొదలైన వాటిని ప్రోత్సహించింది. ప్రతియేటా ఈ సంస్థ తరఫున మూడు రోజులు త్యాగరాజ మహోత్సవాలను నిర్వహించేవాడు. ఇతడు కాకతీయ పత్రికతోపాటుగా విశ్వజ్యోతి, ధర్మభూమి మొదలైన పత్రికలలో విస్తృతంగా రచనలు చేశాడు. మార్క్సిజం మొదలుకొని ప్రపంచ చరిత్ర, భారతీయ తత్త్వము, హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం, నాటకరంగం ఇలా అన్ని విషయాలపైనా ఇతడు వ్యాసాలు వ్రాశాడు. 1982లోవరంగల్లులో జరిగిన పోతన పంచశతాబ్ది ఉత్సవాలకు ఇతడు ప్రేరేపకుడు. పోతన విజ్ఞానపీఠం స్థాపనకు ఇతడు కారకుడు. 1988లో కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్యారణ్య విద్వద్గోష్టిలో చురుకుగా పాల్గొని విద్యారణ్యుని తత్వంపై పత్రసమర్పణ చేశాడు.
———–