రచయిత ఎప్పటికీ సజీవంగా ఉండేదెలా?
ఇతర భారతీయ భాషల్లో ప్రక్రియలతో సంబంధం లేకుండా చాలా సమాచారం దొరుకుతుంది గాని, దేశంలో ఎక్కువమంది మాట్లాడే 2 వ అతి పెద్ద భాష, వెయ్యి సంవత్సరాలకు పైబడి సాహిత్య చరిత్ర కలిగిన తెలుగులో మాత్రం, చాలా మంది రచయితల గురించి సాధికారికమైన సమాచారం మాత్రం దొరకడంలేదు. చరిత్ర గురించి, గొప్పవ్యక్తులు జీవించిన ప్రదేశాలను నిలబెట్టుకోవలసిన అవసరం గురించి మన నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. విలువైన సమాచారాన్ని భద్రపరచుకోవాలన్న కోరిక, దానిగురించి అవగాహనలేని రోజుల్లో క్షంతవ్యమేమోగాని, సాంకేతిక నైపుణ్యాలు విరివిగా అందుబాటులో ఉన్న ఈ కాలంలో అది క్షమించరాని నేరమని నా భావన. అందుకే ఇప్పటికీ మించిపోకుండా, ప్రక్రియలతో సంబంధంలేకుండా, తెలుగు సాహిత్యానికి తమవంతు సేవ చేసిన వారి కృషిని, వారి గొంతులోనే కొంత, మరికొంత ఇతర రూపాల్లోనూ భవిష్యత్తరాలకి ఇంటర్నెట్లో అందుబాటులో ఉండేలా భద్రపరచాలని ఉత్సాహంతో సిద్ధపడినపుడు, ప్రపంచ వ్యాప్తంగా రచయితలు, వివిధ తెలుగు సంఘాల సభ్యులు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చేరు.ఈ బృహత్ యజ్ఞంలో పాలుపంచుకోవలసిందిగా తెలుగు రచయిత(త్రి)లందరినీ కోరుతున్నాను. ఈ బృహత్ యజ్ఞంలో మీకొక పేజీ కేటాయించబడాలంటే మీరు చేయవల్సిందల్లా మీ వివరాలు ఫార్మాటుననుసరించి తెలుగు రచయితకి పంపడమే. రచయిత జన్మదినాన పేజీ ప్రత్యక్షం కావడం ఇందులో ప్రత్యేకత. మీ పుట్టినరోజు కానుకగా తెలుగు రచయితలో మిమ్మల్ని చూసుకుందుకు ఇవేళే తెలుగు రచయితలో మీ వివరాలు ఇక్కడ (submit page) సమర్పించండి.
రచయితల సంఖ్య అధికం, మాకుండే వనరులు కొద్దిగా ఉండడం చేత ఒక క్రమ పద్ధతిలో పుట్టిన తేదీ క్రమంలో రచయితల పేజీలు అందుబాటులోకి తేవాలని ఆకాంక్ష. ఈ యజ్ఞంలో ఎవరు ఏ విధంగా సహకారం అందించగలిగినా సంతోషమే. ఇది మనందరి సమిష్ఠి కృషి. ఇందులో సహకరించాలంటే:-
- మీ పూర్తి సమా చారాన్ని అందజెయ్యవచ్చు.
- మీకు తెలిసిన రచయితల సమాచారాన్ని వారి అనుమతితో అందజెయ్యవచ్చు.
- గత రచయితల రచనలూ, వివరాలూ, ఫోటోలూ, ఆడియో, వీడియో టేపులూ వివరాలు తెలియజెయ్యవచ్చు.
కొన్ని నిబంధనలు:-
- మీకు తెలిసిన రచయితల సమాచారాన్ని మాత్రమే అందజెయ్యండి.
- మీరిచ్చే సమాచారం సాధికారికమైనదై ఉండాలని మరిచిపోవద్దు. తెలిసిన విషయాలను మాత్రమే తెలియజెయ్యండి. విన్నవీ, రూఢికానివీ పొందుపరచవద్దు.
- మీ దగ్గర ఇతర రచయితల, మీ కుటుంబ సభ్యుల, మీ వంశీకుల తాళపత్రగ్రంధాలూ, ఫోటోలూ, ఆడియో, వీడియో టేపులూ, చిత్రాలూ, స్కెచ్ లూ, నోట్సులూ ఏది ఉన్నా దయచేసి వాటి వివరాలు తెలియజెయ్యండి. సమాచారం పంపేటప్పుడు రచయిత లేదా వారి వంశీకుల అనుమతిపత్రం తప్పని సరి. అనుమతిపత్రం లేని వివరాలు స్వీకరించబడవు. వాటిని ఎలా పదిలపరచాలో నిపుణుల సలహా మేరకు తిరిగి సంప్రదించడం జరుగుతుంది.
- ఈ వెబ్ సైటు లోని సమాచారం మొత్తం కాపీరైట్సు తెలుగు రచయితవే. అనుమతి లేకుండా ఎక్కడా వాడుకోరాదు.
డా॥ కె. గీతా మాధవి (కె. గీత)
Telugu Rachayita Organising Members:-
Dr Geeta Madhavi Kala (President)
Subhash Peddu (Vice President)
Venu Asuri(Secretary)
Telugu Rachayita Working Committee Members (India) :-
Ravindra PhaniRaj Kala
Swapna Kala
Advisory Committee Members -India
K.Varalakshmi (Jaggampeta)
Amarendra Dasari (Delhi)
Nauduri Murthy (Bangalore)
C.Bhaskara Rao (Hyderabad)
Chandra Latha (Nellore)
Advisory Committee Members -US
Kiran Prabha
Vemuri Venkateswara Rao
Md Iqbal
Chukka Srinivas
SriCharan Paladugu
Rao Tallapragada
Subhash Peddu
Venu Asuri