పేరు (ఆంగ్లం) | Abburi Varada Rajeswararao |
పేరు (తెలుగు) | అబ్బూరి వరదరాజేశ్వరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | రుక్మిణమ్మ |
తండ్రి పేరు | రామకృష్ణారావు |
జీవిత భాగస్వామి పేరు | అబ్బూరి ఛాయాదేవి |
పుట్టినతేదీ | 01/01/1923 |
మరణం | 04/05/1993 |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన జెముడుపాడు గ్రామం |
విద్యార్హతలు | ఎం.ఎ. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శారదాపరిణయము(నాటకం), తపోభంగం (నాటకం), వసంతసేన (నాటకం), నాయకురాలు (నాటకం), సంపెంగతోట (నాటకం – అనువాదం మూలం: ఆంటెన్ చెహోవ్) – శ్రీశ్రీ తో కలిసి, ప్రతిమాసుందరి (నాటకం – అనువాదం మూలం: హెరాల్డ్ బిగ్ హౌస్), జోలపాట (నాటిక), ముక్తయాత్ర (నాటకం), ప్రథమ యుద్ధం (కథ) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అబ్బూరి వరదరాజేశ్వరరావు |
సంగ్రహ నమూనా రచన | – |
అబ్బూరి వరదరాజేశ్వరరావు
అబ్బూరి వరదరాజేశ్వరరావు ప్రముఖ తెలుగు రచయిత. ఇతని తండ్రి అబ్బూరి రామకృష్ణారావు భావకవిగా సుప్రసిద్ధుడు. 1953లో ఇతని వివాహంఅబ్బూరి ఛాయాదేవితో జరిగింది. ఆమె కూడా పేరుప్రఖ్యాతులు గడించిన రచయిత్రి.
అబ్బూరి వరదరాజేశ్వరరావు 1923లో రామకృష్ణారావు, రుక్మిణమ్మ దంపతులకు మద్రాసులో జన్మించాడు. ఇతని స్వగ్రామం గుంటూరు జిల్లా, కొల్లిపరమండలానికి చెందిన జెముడుపాడు గ్రామం. ఇతని బాల్యం బందరు,బెజవాడ,విశాఖపట్నంలలో గడిచింది. స్థానాపతి సత్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతము, తెలుగు అధ్యయనం చేశాడు. విశాఖపట్నం లోని సి.బి.ఎం.హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రాలలో ఎం.ఎ. పట్టాపొందాడు.
ఇతడు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలలోను, మద్రాస్(వార్)రివ్యూ అనే పత్రికలోను సబ్ ఎడిటర్‌గా పనిచేశాడు. మద్రాసు ప్రభుత్వంలో ఆహారశాఖలో ప్రజాసంబంధాల అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాదు నిజాం ప్రభుత్వంలో సమాచారశాఖలో 1946-47లో పనిచేశాడు.తరువాత హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్‌లో పబ్లిసిటీ సెక్రెటరీగా ఉన్నాడు. 1949లో భారత్(బొంబాయి) పత్రికకు హైదరాబాదు విలేఖరిగా పనిచేశాడు. 1953లో బిర్లాబ్రదర్స్‌కు హైదరాబాదులో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా నియమించబడ్డాడు. కవిత పేరుతో ఒక పత్రికను 1954లో ప్రారంభించాడు. 1958లో న్యూయార్క్ టైమ్స్ పత్రికకు స్థానిక విలేఖరిగా నియమించబడ్డాడు. 1959లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐ.సి.సి.ఆర్) న్యూఢిల్లీలో ప్రచురణల అధికారిగా ఉద్యోగాన్ని చేపట్టి Cultural News From India అనే ద్వైమాస పత్రికను ప్రారంభించి దానికి సంపాదకత్వం వహించాడు. 1961లో ఎల్లైడ్ పబ్లిషర్స్ ప్రచురణల విభాగానికి ముఖ్య సంపాదకుడిగా చేరాడు. 1963లో అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ తెలుగు విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్లాడు. 1993లో ఆంధ్రప్రదేశ్అధికారభాషాసంఘం అధ్యక్షుడిగా నియమితుడైనాడు.
———–