మహాకవి డైరీలు, లేఖలు, మాటా – మంతీ మొదలగు వాటికి సంపాదకత్వం వహించి ప్రచురించారు.’ సంస్కర్త హృదయం ‘ అనే గురజాడకథను ఆంగ్లం లోనికి అనువదించారు. ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది. ముల్క్‌రాజ్ ఆనంద ప్రఖ్యాత నవల కూలీని ఆంధ్రీకరించారు. ఆకాశ దీపాలు, అవసరాల కథలు వీరి రచనలు.