మల్లెమాల సుందర రామిరెడ్డి (Mallemala Sundara Ramireddy)

Share
పేరు (ఆంగ్లం)Mallemala Sundara Ramireddy
పేరు (తెలుగు)మల్లెమాల సుందర రామిరెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/15/1924
మరణం12/11/2011
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమల్లెమాల రామాయణం’, స్వీయచరిత్ర “ఇది నా కథ”
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు – రామాయణం, రఘుపతి వెంకయ్య పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లెమాల సుందర రామిరెడ్డి
సంగ్రహ నమూనా రచన

మల్లెమాల సుందర రామిరెడ్డి

మల్లెమాల (ఆగష్టు 15, 1924 – డిసెంబర్ 11, 2011) ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి “సహజ కవి”గా ప్రశంసలందుకున్నారు.
1924, ఆగస్టు 15 న నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అలిమిలి లో ఆయన జన్మించారు. మద్రాసులో మొదట ఫోటో స్టుడియో తో వీరి జీవితాన్ని ప్రారంభించారు. ఈయన చెన్నై లో సినిమా థియేటర్ నిర్మించిన తొలి తెలుగు సినీ నిర్మాత. నిర్మాతగా ఆయన తొలి చిత్రం భార్య. శ్రీకృష్ణ విజయం, కోడెనాగు, ఏకలవ్య, పల్నాటి సింహం, అమ్మోరు, ముత్యాల పల్లకి, అంజి, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, అరుంధతిలాంటి చిత్రాలు నిర్మాతగా ఎంఎస్ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మొత్తం బాలలతో తీసిన రామాయణం సినిమా జూనియర్ ఎన్టీఆర్ను బాల నటుడిగా తెరమీదకు తీసుకుని వచ్చింది. అంకుశం చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి గా నటించాడు.
వీరు స్థాపించిన శబ్దాలయ థియేటర్స్ సినీ డబ్బింబ్ మరియు రికార్డింగ్ లో అత్యున్నత సాంకేతిక విలువలు కలిగినదిగా సినీ వర్గాలు చెబుతారు.
ఒక కవిగా రచించిన గొప్ప పద్యం
రసపిపాస లేని రాలుగాయల మధ్య
చెప్పు కవిత యెంత గొప్పదయిన
కోళ్ల సంతలోన కోహినూరు వజ్రమే,
మహిత వినయ శీల మల్లెమాల.

———–

You may also like...