పేరు (ఆంగ్లం) | Chillara Bhavanarayanarao |
పేరు (తెలుగు) | చిల్లర భావనారాయణరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | రంగనాయకమ్మ |
తండ్రి పేరు | పున్నయ్యశర్మ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 08/06/1925 |
మరణం | 01/22/2010 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అద్దెకొంప, అబద్దమాడరాదు, ఉద్యోగం, గొడుగు, భార్యా రూపవతీ శత్రుః, సత్యన్నారాయణ వ్రతం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చిల్లర భావనారాయణరావు |
సంగ్రహ నమూనా రచన | – |
చిల్లర భావనారాయణరావు
చిల్లర భావనారాయణరావు కవి, నాటక, నాటిక, సినీ రచయితగా సుప్రసిద్ధుడు. చిల్లర భావనారాయణరావు గుంటూరుజిల్లా బాపట్లలో 1925వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ పున్నయ్యశర్మ, రంగనాయకమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు[1]. ఇతడు బాల్యంలోనే గద్వాలలో స్థిరపడ్డాడు. గద్వాల సమీపంలోని దాసరిపల్లి గ్రామంలో వీధిబడిలోనూ, గద్వాల హైస్కూలులోను 8వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి వద్ద రామాయణ, భారత, భాగవతాదులు చదువుకున్నాడు. పాఠశాలలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి ఇతనికి గురువు. ఉర్దూలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. 1944లో అన్నగారి వద్దకు హైదరాబాదుకు మకాం మార్చాడు. మిలటరీ ఆర్డినెన్స్ డిపోలో కొంతకాలం పనిచేసి తరువాత రైల్వేలో 16 సంవత్సరాలు టి.టి.గా పనిచేశాడు. 1947లో నందిరాజు ఇందిరతో ఇతడికి వివాహం జరిగింది. ఎం.ఎ., బి.ఒ.ఎల్. పట్టాలు పొంది సికిందరాబాదులో ఉన్న వెస్లీ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగుపండితునిగా కొంతకాలం పనిచేశాడు. 1972లో మద్రాసులోని ముత్యాలపేట ఉన్నతపాఠశాలలో, 1973లో మద్రాసు క్రిస్టియన్ కాలేజీ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసి 1984లో పదవీ విరమణ చేశాడు. పదవీ విరమణ తరువాత హైదరాబాదులో స్థిరపడి ఆధ్యాత్మిక రచనలపై దృష్టి సారించాడు. ఇతడు 2010, జనవరి 22న మరణించాడు.
బాల్యంలో గద్వాల ఆస్థాన పండితులు నిర్వహించిన పండిత సభల ప్రభావం ఇతడిపై బాగా పనిచేసింది. ఇతడు అనేక నాటకాలు, నవలలు, కథలు, కథానికలు రచించాడు. ఇతని రచనలు మీజాన్, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 1948లో మిత్రులతో కలిసి నవ్యకళాసమితిని స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా తను వ్రాసిన నాటకాలను తెలంగాణా ప్రాంతమంతా వందలాది ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. దక్కన్ రేడియో, ఆకాశవాణిలలో వందలాది నాటికలను రచించి ప్రసారం చేశాడు. 1968లో సినిమా రంగంలో ప్రవేశించి పేదరాశి పెద్దమ్మ కథ, లక్ష్మీ కటాక్షం, సుగుణసుందరి కథ, రాజకోట రహస్యం, పాతాళనాగు, లక్ష్మీ పూజ, శ్రీ సంతోషిమాతా వ్రత మహత్యం, సీతారామ వనవాసం, విక్రమార్క విజయం, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం మొదలైన సినిమాలకు కథ, మాటలు, పాటలు అందించాడు.
———–