భండారు సదాశివరావు (Bhandaru Sadashivarao)

Share
పేరు (ఆంగ్లం)Bhandaru Sadashivarao
పేరు (తెలుగు)భండారు సదాశివరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఛత్రపతి శివాజీ, సమర్థ రామదాసు, యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్, మన పండుగలు
జై సోమనాథ్(అనువాదం – మూలం: కె.ఎం.మున్షీ), మోహన మురళి, రుక్మిణీ హరణం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికభండారు సదాశివరావు
సంగ్రహ నమూనా రచన

భండారు సదాశివరావు

భండారు సదాశివరావు క్రోధన నామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ షష్ఠికి సరియైన 1925, మే 29వ తేదీన భండారు వీరరాజేశ్వరరావు, వెంకురామమ్మ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు. ఇతడు ఆరువేల నియోగి. పరాశర గోత్రీకుడు. కృష్ణాజిల్లాలోని వేములపల్లి అగ్రహారం ఇతని స్వగ్రామం. ఇతడు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో కొంతకాలం చదివాడు. తరువాత తండ్రి ఉద్యోగరీత్యా సూర్యాపేట, జనగామలలో చదువు కొనసాగించాడు. పిదప హనుమకొండ కాలేజియేట్ హైస్కూలులో చదివాడు. అనంతరం హైదరాబాదులో తన అన్న భండారు చంద్రమౌళీశ్వరరావు వద్ద ఉండి వెస్లీ స్కూలులో ఫిఫ్త్ ఫారంలో చేరాడు. ఆ తరువాత ఇస్లామియా స్కూలులో చదివాడు. ఆ సమయంలో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఊరేగింపులో పాల్గొన్న కారణంగా అరెస్టు కాబడి జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషను జైలులో 15 రోజులు డిటెన్షన్‌లో ఉన్నాడు. జైలు నుండి వచ్చిన తరువాత వార్ధా వెళ్లి సర్వోదయనాయకుడు ప్రభాకర్‌జీని కలిసి అతని సలహా మేరకు విద్యనభ్యసించడానికి కాశీ వెళ్లాడు. అక్కడ ఉపకార వేతనం పొంది హిందీపరీక్షలు వ్రాసి సాహిత్యరత్న వరకు చదివాడు.
జాగృతి పత్రికకు సహసంపాదకునిగా ఉన్నప్పుడు అనేక కథలు వ్యాసాలు వ్రాసేవాడు.కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కె.ఎం.మున్షీ వ్రాసిన జైసోమనాథ్ నవలను తెలుగులో అనువదించి జాగృతిలో ధారావాహికగా ప్రకటించాడు.ఈ నవల బహుళ ప్రచారంలోకి వచ్చింది. 1958లో మహారాణాబాప్పా, మనవారసత్వం మొదలైన పుస్తకాలు రచించాడు. 1954లో భారతీయ రచయితల సమితికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్‌ను స్థాపించి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలం తరువాత ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్‌ను ఏర్పాటు చేసి దానికి కొంతకాలం ట్రస్టీగా, మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉన్నాడు. వరంగల్లులో పోతన విజ్ఞానపీఠం సభ్యుడిగా ఉన్నాడు. పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, మన్నవ గిరిధరరావు, బిరుదురాజు రామరాజు, కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, కోవెల సుప్రసన్నాచార్య మొదలైనవారితో కలిసి సాహిత్యకార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు.

———–

You may also like...