కొమ్మూరి సాంబశివరావు (Kommuri Sambasivarao)

Share
పేరు (ఆంగ్లం)Kommuri Sambasivarao
పేరు (తెలుగు)కొమ్మూరి సాంబశివరావు
కలం పేరు
తల్లిపేరుపద్మావతి
తండ్రి పేరువెంకట్రామయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ10/26/1926
మరణం05/17/1994
పుట్టిన ఊరుతెనాలి, గుంటూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తివిలేఖరి, రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలులక్షాధికారి హత్య, చావు కేక, అర్ధరాత్రి అతిథి, ఉరితాడు
ప్రమీలాదేవి హత్య, చీకటికి వేయి కళ్ళు, అడుగో అతనే దొంగ, మతిపోయిన మనిషి, నేను చావను, ప్రాక్టికల్ జోకర్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొమ్మూరి సాంబశివరావు
సంగ్రహ నమూనా రచన

కొమ్మూరి సాంబశివరావు

కొమ్మూరి సాంబశివ రావు ఒక ప్రముఖ నవలా రచయిత. తెలుగులో తొలి హారర్ నవలా రచయిత. ప్రముఖ తెలుగురచయితల కుటుంబంలో జన్మించాడు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. 90 కి పైగా నవలలు రాసి డిటెక్టివ్ నవలా రచయితా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పాత్రలు తెలుగు పాఠకులకు పరిచయమైన పేర్లు.
సాంబశివరావు అక్టోబరు 26, 1926 న తెనాలిలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వెంకట్రామయ్య, మరియు పద్మావతి. వెంకట్రామయ్య ప్రముఖ రచయిత చలంకు స్వయానా తమ్ముడు. చలాన్ని తన తాత దత్తత తీసుకోవడంతో ఆయన ఇంటి పేరు గుడిపాటిగా మారింది. వెంకట్రామయ్యకు అప్పట్లో తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. సాంబశివరావు తల్లి పద్మావతి బళ్ళారి రాఘవ బృందంతో కలిసి నాటకాలు వేస్తుండేది. కొడవటిగంటి కుటుంబరావు భార్యయైన వరూధిని ఈయనకు అక్క. అలా ఈయన కొడవటిగంటి రోహిణీప్రసాద్కు మేనమామ అవుతాడు. ఆయన చెల్లెలు ఉషారాణి డిల్లీలోని నేషనల్ బుక్ ట్రస్ట్ లో తెలుగు విభాగానికి అధ్యక్షురాలిగా ఉండేది.
కొమ్మూరి 14 సంవత్సరాల వయసు నుండే కథలు రాయడం ప్రారంభించాడు. 1957-1980 మధ్యలో ఆయన విస్తృతంగా రచనలు చేశాడు. ఆంగ్ల రచయిత ఎడ్గర్ వాలేస్ ఆయనకు స్ఫూర్తి. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు ఈయన రచనలను అభిమానించే వాడు. మల్లాది వెంకటకృష్ణమూర్తి కొమ్మూరి నుంచి స్ఫూర్తి పొందాడు.

———–

You may also like...