పేరు (ఆంగ్లం) | R.S. Sudarshanam |
పేరు (తెలుగు) | ఆర్.యస్.సుదర్శనం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అనుబంధాలు (నవల) – 1958-ఆదర్శ గ్రంథ మండలి ప్రచురణ సంసారవృక్షం (నవల) – 1976 (ఎమెస్కో ప్రచురణ) [4] నిషాంతం (కవితలు) – 1970 (విశ్వనాథ సత్యనారాయణ గారిచే ప్రచురితం), 1975 (గుంటూరు శేషేంద్రశర్మ గారిచే), 1994 పునర్ముద్రణం. మళ్ళీ వసంతం (నవల) – 1969 అక్టోబరు – ఆగస్టు 86 లో పురర్ముద్రణ మధురమీనాక్షి కథలు -1981 నూరు సమీక్షలు[5] – 1987 జనవరి సాహిత్యంలో దృక్పథాలు – 1968 |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆర్.యస్.సుదర్శనం |
సంగ్రహ నమూనా రచన | – |
ఆర్.యస్.సుదర్శనం
ఆర్.యస్.సుదర్శనం తెలుగు భాషలో పేరెన్నికగన్న విమర్శకులలో ఒకడు. ఈయన పాశ్చాత్య విమర్శ దృక్పథంతో విమర్శలు సాగించారు.
ఆయన మదనపల్లెలో డిసెంబరు 13 1927 న జన్మించారు. ఆయన మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదలనపల్లె దివ్యజ్ఞాన కళాశాల లలో విద్యాభ్యాసం చేసారు.మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి 1947లో పట్టా పుచ్చుకున్నాడు. ప్రముఖ రచయిత్రి ఆర్.వసుంధరాదేవి ఇతని భార్య. వివిధ కళాశాలలలో అధ్యాపకునిగా, విభాగాధిపతిగా, ప్రిన్సిపాల్ గానూ పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత ఆయన 1986లో స్వంత ఊరైన మదనపల్లెలో శేష జీవితం గడిపి డిసెంబరు 14 2001 న కన్నుమూసారు.
ఆయన 1947లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో ట్యూటరుగా చేరారు.1947-48 మధ్య మచిలీపట్నం హిందూ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేసారు.1948-49 లో మదనపల్లెలో బెసెంట్ థియోసాఫికల్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసారు.1949-66 మధ్య ఆయన అనంతపురం, వరంగల్, నల్గొండ మరియు చిత్తూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆంగ్ల అధ్యాపకునిగా, విభాగాధిపతిగా పనిచేశారు.1967-71 మధ్య విడవలూరు డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసారు. శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ గారికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారిని విడవలూరుకు ఆహ్వానించి వారి చిత్రపటం బహూకరించారు.ఆరుద్ర, పిలకా గణపతి శాస్త్రి, మహీధర రామమోహన్ వంటి ప్రముఖ సాహిత్యకారులను అక్కడి కళాశాలకు రప్పించి ఆ ఊరిలో సాంస్కృతిక వాతావరణం నెలకొల్పారు. 1971-73 చిత్తూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు.అప్పుడు కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించారు.1974-77 లో అనంతపురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు.1977-85 లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా, రీజనల్ జాయింట్ డైరక్టరు ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గా పనిచేసి పదవీవిరమణ చేసారు
———–