పేరు (ఆంగ్లం) | Utpala Satyanarayanacharya |
పేరు (తెలుగు) | ఉత్పల సత్యనారాయణాచార్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్రమర గీతము, గోపీగీతము, రాజమాత, వేణు గీతము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఉత్పల సత్యనారాయణాచార్య |
సంగ్రహ నమూనా రచన | – |
ఉత్పల సత్యనారాయణాచార్య
ఉత్పల సత్యనారాయణాచార్య, ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.
వీరు ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ 1927, జూలై 4న రఘునాథాచార్యులు, అలివేలమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం తిరుపతిలో వేటూరి ప్రభాకరశాస్త్రి శిష్యరికంలో జరిగింది. ఇతడు విద్వాన్ వరకు చదివాడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. విద్వాన్ పూర్తి అయిన తరువాత మద్రాసులో మాతృభూమిపత్రికలో ఉపసంపాదకునిగా చేరాడు. అక్కడ ఇతనికి చుండి జగన్నాథంతో పరిచయం ఏర్పడి జాతీయ భావాలను పెంపొందించుకున్నాడు.నెల్లూరులోని జమీన్ రైతు పత్రికకు సినిమా రిపోర్టర్‌గా మద్రాసు నుండి వారం వారం సినిమా వార్తలను పంపేవాడు. ఇలా ఇతడు పత్రికారంగంలో ప్రవేశించి ప్రజామత, ఆనందవాణి, భారతి, గోలకొండ పత్రికలకు గేయాలు అనేకం వ్రాసి ప్రకటించేవాడు. ఇతడు హైదరాబాదుకు వచ్చిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పట్టా పొందాడు. ఈయన సికింద్రాబాదులోనిప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేశాడు. ఆ తర్వాత జంటనగరాలలో అనేక కళాశాలలో ఉపన్యాసకునిగా కొనసాగాడు.
ఇతడు రామ్‌నరేష్ త్రిప్రాఠీ, మైథిలీ శరణ్‌గుప్త, గోల్డ్స్ స్మిత్ మొదలైన వారి రచనలనుండి ప్రభావితుడైనాడు. ఇతని రచన శ్రీకృష్ణ చంద్రోదయమునకు 2003 సంవత్సరములో ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు’ అందుకున్నాడు. ఈయన రచనలలో ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్రమర గీతము, గోపీగీతము, రాజమాత, వేణు గీతము, యశోదానంద గేహిని, స్వప్నాల దుప్పటి, తపతి, గాంధారి, శరణాగతి, కీచకుని వీడ్కోలు, చిన్ని కృష్ణుడు, గంగావతరణము, శతరూప, వ్యాసమంజూష, యుగంధరాయణ, పాతబస్తీ విలాసము, రాసపంచాధ్యాయి, రాసపూర్ణిమ, రాజమాత, రసధ్వని ప్రముఖమైనవి. ఇంకా ఇతడు బొమ్మరిల్లు, యవ్వనం కాటేసింది, బొట్టు కాటుక మొదలైన సినిమాలకు పాటలను అందించాడు.
———–