పేరు (ఆంగ్లం) | Pullela Sriramachandrudu |
పేరు (తెలుగు) | పుల్లెల శ్రీరామచంద్రుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/24/1927 |
మరణం | 06/24/2015 |
పుట్టిన ఊరు | తూర్పుగోదావరి జిల్లా, ఐనవోలు మండలం ఇందుపల్లి గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | హిందీ తెలుగు వ్యాకరణము, రాఘవ శతకము, కుమతీ శతకము (సుమతీ శతకానికి పేరడీ), తెనాలి రామలింగని కథలు, మనమతాలూ – సంప్రదాయాలు కాళిదాస కవితా వైభవము, ధమ్మపదం (అనువాదం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పుల్లెల శ్రీరామచంద్రుడు |
సంగ్రహ నమూనా రచన | – |
పుల్లెల శ్రీరామచంద్రుడు
పుల్లెల శ్రీరామచంద్రుడు (అక్టోబరు 24, 1927 – జూన్ 24, 2015), రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితుడు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు వంటివి తెలుగులోకి అనువదించి వ్యాఖ్యానించారు.
తూర్పుగోదావరి జిల్లా, ఐనవోలు మండలం ఇందుపల్లి గ్రామంలో 1927, అక్టోబరు 24 న నరకచతుర్దశి నాడు పుల్లెల సత్యనారాయణశాస్త్రి, సత్యవతి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఇందుపల్లికి సమీపంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో స్థిరపడ్డారు. తండ్రి వద్ద పంచకావ్యాలు, శ్రీహర్షుని నైషధం, మురారి అనర్ఘరాఘవం మొదలైన కావ్యాలను చదివారు. తండ్రివద్ద సిద్ధాంతకౌముది వ్యాకరణ గ్రంథాన్ని కూడా అధ్యయనం చేశారు. పిదప నరేంద్రపురం లోని సంస్కృతపాఠశాలలో చేరారు. అక్కడ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి శిష్యరికంలో కిరాతార్జునీయం వంటి ప్రౌఢకావ్యాలు, వ్యాకరణ గ్రంథాలు చదివారు. తరువాత మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో వేదాంత శిరోమణి చదివారు. ఆ సమయంలోనే వి. వెంకటాచలం అనే సహవిద్యార్థి వద్ద ఆంగ్ల భాష నేర్చుకున్నారు. హిందీ ప్రచారసభ వారి విశారద పరీక్ష పూర్తి చేశారు. 1950లో మలికిపురం హైస్కూలులో హిందీ పండితుడిగా ఉద్యోగం చేస్తూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1952లో తెలుగు విద్వాన్, 1953లో ఇంటర్మీడియట్,1955లో బి.ఎ., 1957లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి అలంకారశాస్త్రం ప్రధానాంశంగా ఎం.ఎ. చదివారు. అదే యూనివర్సిటీ నుండి ఆంగ్లంలో ఎం.ఎ. 1961లో ఉత్తీర్ణులయ్యారు. 1963లో హిందీలో అక్కడి నుండే ఎం.ఎ. పూర్తి చేశారు. 1966లో ఆర్యేంద్రశర్మ పర్యవేక్షణలో కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ పండితరాజ జగన్నాథ టు సాంస్క్రీట్ పొయటిక్స్ అనే అంశంపై సిద్ధాంతవ్యాసం సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు.
వీరు తమ పదునాలుగవయేట నుండి రచనలు చేయడం ప్రారంభించారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో 200లకు పైగా పుస్తకాలను వెలువరించారు.
———–