శిష్ట్లా వెంకట జోగారావు (Shistla Venkata Jogarao)

Share
పేరు (ఆంగ్లం)Shistla Venkata Jogarao
పేరు (తెలుగు)శిష్ట్లా వెంకట జోగారావు
కలం పేరు
తల్లిపేరుసరస్వతమ్మ
తండ్రి పేరుశిష్టా సాంబశివరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ10/02/1928
మరణం09/01/1992
పుట్టిన ఊరువిజయనగరం జిల్లా పార్వతీపురం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమణిప్రవాళం,ఉపనిషత్తు, సువర్ణశృంఖల, మధురమాధవం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశిష్ట్లా వెంకట జోగారావు
సంగ్రహ నమూనా రచన

శిష్ట్లా వెంకట జోగారావు

ఎస్.వి.జోగారావు లేదా శిష్ట్లా వెంకట జోగారావు సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి.
వీరు అక్టోబరు 2, 1928 సంవత్సరం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శిష్టా సాంబశివరావు, సరస్వతమ్మ.
వీరు 1952లో ఎం.ఎ. తెలుగులో ప్రథమశ్రేణిలో ప్రథమస్థానాన్ని పొందారు. 1954-56 మధ్య భారత ప్రభుత్వ పరిశోధక పండితునిగా నియమితులయ్యారు. ఒక దశాబ్ది కాలం ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరి పరిశోధన ఫలితంగా “ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర” విడుదలైంది. 1965-67 మధ్యకాలంలో సోవియట్ దేశంలో లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని అధిష్టించారు. అప్పుడే ‘తెలుగు-రష్యన్-తెలుగు వ్యవహార దర్శిని’ ప్రచురించారు.1976-83 మధ్యలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో వివిధ శాఖలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 1085 ‘జాతీయ ఆచార్య’ గౌరవాన్ని పొందారు. 1975లో యక్షగానం రచనను ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రచురించారు.


1958లో ‘పంచకళ్యాణి’ శీర్షికతో కవితా సంపుటి వెలువరించారు. 1961లో ‘అప్సర’ గేయనృత్యనాటికల సంపుటి విడుదలైంది. వీరు ‘ఉపనిషత్తు’, ‘సువర్ణశృంఖల’, ‘మధురమాధవం’ మొదలగు కవిత, కథానిక, నాటికల సంపుటాలను సారస్వతులకు కానుకచేసారు. 1988లో నవలాకర్తగా ‘మేరుశిఖరం’ రాశారు. 1980లో ‘అడిగొప్పుల హోరుగాలి’ కావ్యం, ‘మణిప్రవాళం’ సాహిత్య వ్యాస సంపుటాలను ప్రచురించారు. ‘శృంగార సర్వజ్ఞం’, ‘ఆదిభట్ట సారస్వత నీరాజనం’, పది సంపుటాల దాన భారతీ ప్రచురణలు చేశారు. ‘ఊహాప్రహేళిక’ అనే సాహితీ ప్రక్రియ పూర్తిగా వీరి సొంతం.


‘మణిప్రవాళం’ రచనకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1989లో లభించింది.

———–

You may also like...