గూటాల కృష్ణమూర్తి (Gutala Krishnamurthy)

Share
పేరు (ఆంగ్లం)Gutala Krishnamurthy
పేరు (తెలుగు)గూటాల కృష్ణమూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/10/1928
మరణం07/13/2016
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజుబ్బాలేని అబ్బాయి,భజగోవిందం, కుకునం (వంట ),
క్లిననం (వంటపాత్రలు, ఇల్లు శుభ్రము చేయడం ),
స్లిపనం (సంసారము చేయడం ), కననం (పిల్లల్ని కనడం), మున్నగునవి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగూటాల కృష్ణమూర్తి
సంగ్రహ నమూనా రచన

గూటాల కృష్ణమూర్తి

గూటాల కృష్ణమూర్తి తెలుగు సాహితీకారుడు, రచయిత. భారతదేశములో గూటాలగా, ఇంగ్లాండులో జి.కె.గా ప్రసిద్ధుడైన గూటాల కృష్ణ మూర్తి 1928 జూలై 10 వ తేదీన పర్లాకిమిడిలో జన్మించారు. విజయనగరము లోనూ, విశాఖపట్నం ఎ.వి.ఎం.కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయములోనూ విద్యనభ్యసించి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ పూర్తిచేసి మూడేళ్ళు అమలాపురం ఎస్.కె.బి.ఆర్. కళాశాలలోను, మరో మూడేళ్ళు ప్రస్తుత ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్కాలేజీలలోనూ ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు. అక్కడ పనిచేస్తూనే సాగర్ విశ్వవిద్యాలయములో పార్ట్ టైం పరిశోధకునిగా ” ఫ్రాన్సిస్ ధామస్ – ఎ క్రిటికల్ బయోగ్రఫీ ” అన్న అంశముపై పరిశోధన చేపట్టారు. 1962 లో లండన్‌ టైమ్‌స్ పత్రికా కార్యాలయములో గుమస్తా ఉద్యోగము కోసం లండన్‌ వచ్చిన గూటాల అక్కడే తన పి.హెచ్.డి కొనసాగించి 1967 లో డాక్టరేట్ సంపాధించారు. ఆ తర్వాత ఇన్నర్ లండన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ సర్వీసులో ప్రవేశించి లండన్‌ లోని వివిధ విద్యాలయాలలో అధ్యాపకునిగా పనిచేసారు.
గూటాల కృష్ణమూర్తి ఇంగ్లండులో పనిచేసే ఇంగ్లీషు ప్రొఫెసరైనా వారికి ఆధునిక తెలుగు సాహిత్యంపై చాలా మక్కువ. రాచకొండ విశ్వనాథశాస్త్రి పట్ల అభిమానం. శ్రీశ్రీ మహా ప్రస్థానంను కవి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహా ప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహిత్యాభిమాని కృష్ణమూర్తి. ఈయన ‘జుబ్బా లేని అబ్బాయి’ అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవన అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ, అణగారిన వర్గాల పేదరికం, దుర్భరయాతన ప్రతీకాత్మకంగా పెద్ద నవలగా రాయాలని ఆయన అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసింది.
విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి సూర్యకుమారిపై ఒక ప్రత్యేక గ్రంథం ప్రచురించారు. ఇదివరలో, ఆయన శ్రీగారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబరు 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల అయింది. బాపు మిత్రులైన గూటాల కృష్ణమూర్తి వారి కొడుకు, కోడలు వారి పిల్లలను చూడడానికి లండన్ నుంచి ఇండియా వచ్చారు. ఆయన చాలా పెద్దవారు. 80 ఏళ్ళు దాటాయి. ఈ వయసులో ప్రయాణం చేయటం కష్టమే. పైగా వారు ఇండియా రావడం చాలా అరుదు. మార్చి 3 (2009) న వారొచ్చినపుడు వారిని చాలామంది కలిసారు. ఆ సందర్భంగా వారు టంగుటూరి సూర్యకుమారితో వారికి వున్న పరిచయం గుర్తుచేసుకున్నారు (వీరే ఈ మధ్య 2008 లో సూర్యకుమారి గారిపై ఒక ఖరీదైన పుస్తకం ప్రచురించారు.). పైన వున్న బొమ్మను గూటాల సూర్యకుమారిగారికి చూపించినపుడు, ఈ ట్రిక్కు ముందే తెలిస్తే బాగా చదువుకోవాలన్న కోరిక కొంతవరకైనా తీరేదని అన్నారంట. చదువుతున్నపుడు నిద్ర ఆపుకోలేక తల వాల్చడానికి ప్రయత్నిస్తే మేకుకు కట్టిన పిలక వల్ల అది సాధ్యపడదన్నమాట.

———–

You may also like...