పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ (Pamidimukkala Lakshmikantam)

Share
పేరు (ఆంగ్లం)Pamidimukkala Lakshmikantam
పేరు (తెలుగు)పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్
కలం పేరు
తల్లిపేరుమహాలక్ష్మమ్మ
తండ్రి పేరుఅంకినీడు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1928
మరణం05/05/1995
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా రేపల్లె సమీపం లోని వెల్లటూరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురామరాజ్యం, సింహ గర్జన, సింహపురిరాణి, మేరియాన్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్
సంగ్రహ నమూనా రచన

పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్

పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ ప్రసిద్ధ నాటక అనువాదకుడు. వాగ్గేయకారుడు. నవలా రచయిత. జానపద కళా ప్రముఖుడు. సాహిత్యకళా యోధుడు పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్. గుంటూరు జిల్లా రేపల్లె సమీపం లోని వెల్లటూరులో అంకినీడు, మహాలక్ష్మమ్మ దంపతులకు 1928లో లక్ష్మీకాంత మోహన్ జన్మించారు. చిన్నతనం నుంచి కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన లక్ష్మీకాంతమోహన్ అనేక రంగాల్లో నిషాతుడిగా ఎదిగారు. షేక్సిపియర్ రచించిన 33 నాటకాలలో 22 నాటకాలను అనువదించారు. లక్ష్మీకాంతమో హన్ రచించిన షేక్సిపియర్ మెన్ అండ్ విమెన్, సైకలాజికల్ ఇంటర్ ప్రిటేషన్ గ్రంథాలను నాగపూర్ విశ్వవిద్యాలయం పార్య గ్రంథాలుగా ఎంపిక చేసింది. తెలంగాణ పోరాట గాథలు తెలుగు గ్రంథాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. చైనా గెరిల్లా యోధుడు, కూలి, కౌలుదారు, స్వామివివేకానంద, ఝాన్సీలక్ష్మీబాయి, కన్నకూతురు, అల్లూరి సీతారామరాజు బుర్రకథలను రచించడమే కాకుండా స్వయంగా చెప్పారు. జానపద కళారూపమైన గొల్ల సుదులను ఆంగ్లంలోకి అనువ దించి చెప్పారు. కాంగ్రెస్ మంత్రుల వీధిబాగోతం, ఎల్లమ్మ కథ అనే ఒగ్గు కథలతో పాటు అనేక తెలంగాణ జానపద గేయాలను రచించారు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజ ర్కు బుర్రకథలో మెలకువలను నేర్పారు. రామరాజ్యం, సింహ గర్జన, సింహపురిరాణి, మేరియాన్ నవలలను రచించారు. సింహగర్జన నవలను మద్రాసు, తెలంగాణ ప్రభుత్వాలు నిషే ధించాయి. ఏఆర్ కృష్ణ ప్రదర్శించిన మాలపల్లి జీవ నాట కంలో లక్ష్మీకాంతమోహన్ బుర్రకథ ప్రధాన ఆకర్షణగా నిలి చింది. వృద్ధాప్యంలో తీవ్ర దారిద్ర్యంతో అష్టకషాలు పడ్డ లక్ష్మీ కాంతమోహన్ 1995 మే 5న అస్తమించారు.

———–

You may also like...